Categories
National

కేంద్రం ఆదేశాలు : పైలెట్ అభినందన్ వీడియోలు తొలగింపు

పాకిస్తాన్ చెరలో ఉన్న భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వీడియోలన్నిటిని యూట్యూబ్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అభినందన్ వీడియోలను సైట్ నుంచి తొలగించింది. అభినందన్‌కు సంబంధించి పాకిస్తాన్ పలు వీడియోలను విడుదల చేసింది. అభినందన్ పై దాడి చేసే దృశ్యాలను.. తన పేరు, సర్వీస్ నెంబర్ చెప్పే వీడియో.. కళ్లకు గంతలు కట్టి, ముఖంపై రక్తం కారుతున్న వీడియోలను పాక్ రిలీజ్ చేసింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి. ఈ వీడియోలపై అభినందన్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సున్నితమైన అంశం అని ఆ వీడియోలు చూపించి మనోభావాలు దెబ్బతీయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వెంటనే వాటిని తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోలను తొలగించింది. భారత సైనిక బలగాలు సైతం అభినందన్ వీడియోలు షేర్ చేసుకోవద్దంటూ నెటిజన్లకు ఇదివరకే విజ్ఞప్తి చేశాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ తీసుకొచ్చిన దౌత్యపరమైన ఒత్తిడితో పాక్ తలొగ్గింది. అభినందన్‌ను రేపు(మార్చి 1) విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో భారత ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్21 యుద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పైలెట్ అభినందన్ ప్రాణాలను పణంగా పెట్టి పాక్ విమానాలను తరిమికొట్టారు. విమానం కూలిపోతున్న సమయంలో ఆయన పారాచ్యూట్ ద్వారా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. దీంతో కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది.
 
అభినందన్‌ను నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ అత్యుత్సాహం ప్రదర్శించింది. పలు వీడియోలు విడుదల చేసింది. అందులో అభినందన్ ను కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. భారత ఫ్లైట్ సూట్‌ ధరించిన ఓ వ్యక్తికి, కళ్లకు గంతలు కట్టి, ముఖంపై రక్తం కారుతున్న మరో వీడియో విడుదల చేసింది. ఓ వీడియోలో ఆయన తన పేరు, సర్వీస్ నంబర్‌ను చెబుతున్నట్టు కనిపిస్తుంది. ఆయనను ఇంటరాగేట్ చేసిన వీడియోని కూడా పాక్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచేలా చేశాయి.

Categories
Crime

లోపలేశారు : పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్

అనంతపురం: పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు పెనుకొండకు చెందిన నౌషద్ వలీని స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. నౌషద్ పెనుకొండలో ఫుట్ పాత్ మీద గడియారాలు రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వలీపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు అనుకూలంగా పోస్టు పెట్టిన వలీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులైన ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 300మంది టెర్రరిస్టులు హతమయ్యారని సమాచారం. దీన్ని తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ భారత్ పై వైమానిక దాడులకు తెగబడింది. బోర్డర్ లో కాల్పులకు దిగింది. భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈ పరిస్థితుల్లో యావత్ భారతీయులు ఆర్మీకి అండగా నిలిచారు. అయితే కొందరు వ్యక్తులు.. మనోభావాలను గాయపరిచేలా సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టి వివాదానికి కారణం అవుతున్నారు.

Categories
National

మెరుపు దాడుల వాస్తవాలు వెల్లడించాలి

పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. దాడులకు సంబంధించిన వాస్తవాలను తెలియజేయండి

300మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా వీటిని ఖండిస్తోంది. మాకు వాస్తవాలు కావాలి. మీరు సరిగ్గా టార్గెట్ మీదనే బాంబులు వేశారా..లేదా చెప్పండి. ఒక వేళ మీ ప్రయత్నం విఫలమైతే ఒక్కరు కూడా చనిపోరు కదా. దీని కోసమే వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నామన్నారు. పుల్వామా, మెరుపు దాడుల తర్వాత ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా జవాన్ల త్యాగాలను రాజకీయ లబ్థి కోసం వాడుకుంటే సహించమని మమత తెలిపారు.

Categories
Crime

వీడు మనిషి కాదు : 12మంది యువతులపై అత్యాచారం

ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్‌ చేసుకొని గద్దల్లా

ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్‌ చేసుకొని గద్దల్లా వాలిపోతారు. డబ్బు కావాలంటూ బెదిరించి.. వారి వద్ద ఉన్నదంతా దోచేస్తారు. అంతటితో ఆగిపోదు ఈ కీచక బ్యాచ్‌.. ప్రియుడి ముందే ప్రియురాలిని చెరబడుతుంది. అడ్డువస్తే దాడి చేసైనా అనుభవిస్తారు. గుంటుపల్లి హత్యతో గుట్టు వీడుతున్న దండుపాళ్యం బ్యాచ్‌ కథ ఇది.

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధ ఆరామాల్లో ఫిబ్రవరి 24న ప్రేమ జంట నవీన్, శ్రీధరణిలపై దాడి జరిగింది. ఇందులో అత్యంత దారుణంగా శ్రీధరణి హత్య చేయబడగా.. నవీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఎత్తుకెళ్లిన ధరణి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుడు అంకమరావును కనుగొన్నారు. అతన్ని విచారిస్తే విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

దాడి జరిగిన తెల్లారి అంకమరావుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారణ చేశారు. పోలీసుల విచారణలో నేరాన్ని తానే చేసినట్టు ఒప్పుకున్నాడు అంకమరావు.  పోలీసులు తమ స్టైల్‌లో లోతుగా విచారించగా.. తన అకృత్యాల రికార్డును బయటపెట్టాడు. ఇప్పటికే 12మంది యువతులపై అత్యాచారం చేసినట్టు శ్రీధరణితో సహా నలుగురిని మట్టుబెట్టినట్టు అంగీకరించాడని తెలుస్తోంది. అంకమరావుతో పాటు మరో ఐదుగురు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. వీరంతా గ్రూప్‌గా, విడివిడిగా నేరాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.  

ఈ దండుపాళ్యం బ్యాచ్‌ ఫస్ట్‌… బీచ్‌లు, పార్క్‌ల వంటి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తుంది. ప్రేమికులు ఏకాంతంగా ఎక్కడ గడుపుతున్నారనే విషయాన్ని గమనించి.. దగుల్బాజి పనికి పూనుకుంటుంది. కుదిరినప్పుడు గ్యాంగ్‌గా.. లేకుంటే ఒంటరిగానే లవర్స్‌ ఉండే ప్రాంతాలకు వెళ్లి వారిపై దాడి చేస్తారు ఈ నీచులు. అత్యంత కిరాతకంగా దాడి చేసి అమ్మాయిలను అనుభవిస్తారు. లొంగితే ఓకే లేదంటే.. తలపై, మెడపై దాడిచేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయిలపై అత్యాచారానికి ఒడిగడతారు. ఈ నీచ్‌ బ్యాచ్‌ దాడులు చేయడం, డబ్బు తీసుకోవడం, హత్యాచారం చేయడం లాంటి క్రూరమైన పనులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మనుషుల ప్రాణాలను తీసేటప్పుడు ఈ గ్యాంగ్‌ విచక్షణ కోల్పోతుందని పోలీసులు విచారణలో బయటపడినట్లు తెలుస్తుంది.

అంకమరావు.. తానేం చేస్తున్నాడు ఎటు వెళ్తున్నాడనే విషయం కనీసం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఎక్కడివో తెలియదు కానీ.. ఆదివారం సెల్‌ఫోన్స్‌ తెచ్చాడని చెబుతోంది. మరోవైపు అంకమరావు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి అతని అత్తింటివారు భయంతో వణికిపోతున్నారు. విచారణలో భాగంగా పోలీసులు ఇంటికి వస్తుండటంతో బెదిరిపోతున్నారు. గుంటుపల్లి ఘటనతో కరుడుగట్టిన మానవ మృగాల విషయం వెలుగులోకి వచ్చింది. వీరు ఇంకెన్ని దారుణాలకు పాల్పడ్డారనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.

Categories
International

దొందూ..దొందే : తుస్సుమన్న మిసైల్స్ మీటింగ్

ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్ ల మధ్య భేటీ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్థంతరంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా హోటల్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. వియత్నాం రాజధాని హనోయ్ లోని మెట్రోపాల్ హోటల్ వేదికగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) వీరిద్దరూ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం రెండు రోజులు వీరి భేటీ జరగాల్సి ఉంది. అందులో భాగంగా గురువారం ఈ ఇద్దరు నేతలు సమావేశం కావాల్సి ఉంది. అయితే అర్థంతరంగా ఇద్దరు దేశాధినేతలు హోటల్ నుంచి వెళ్లిపోయారు.  

దీనిపై ట్రంప్ మాట్లాడుతూ…ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కిమ్ కోరారని, దానికి తాము అంగీకరించలేదని, అందుకే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈ చర్చలు ముగిశాయని తెలిపారు. ఉత్తరకొరియాలోని యాంగ్ బియాన్ అణు కేంద్రాన్ని కూల్చివేసేందుకు కిమ్ సిద్దంగా ఉన్నారని, దానికి బదులుగా తమ దేశంపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కిమ్ కోరినట్లు తెలిపారు. అయితే అణ్వాయుధాలు,క్షిపణులను పరీక్షంచబోమన్న హామీకి కిమ్ కట్టుబడి ఉంటారని తాను నమ్ముతున్నానని తెలిపారు. కిమ్ తో మరోసారి భేటీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  అన్నారు. ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మక సమావేశాలు జరిగాయి కానీ అణునిరాయుధీకరణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ తెలిపింది.

సింగపూర్ లో 2018లో ట్రంప్-కిమ్ మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య అణు నిరాయుధీకరణపై ఒప్పందం జరిగినా విధివిధానాలేమీ స్పష్టంగా ఖరారు కాలేదు. మరోసారి ఇద్దరి దేశాధినేతలు బుధవారం(ఫిబ్రవరి-27,2019) వియత్నాం వేదికగా సమావేశమయ్యారు. 

Categories
National

నేషన్ హీరో అభినందన్ : ప్రాణాలను పణంగా పెట్టి సాహసం

సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్

సస్సెన్స్ వీడింది. టెన్షన్ తొలగింది. భారత ప్రభుత్వం ఒత్తిడి పని చేసింది. దేశ ప్రజల ప్రార్థనలు ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకరించింది. రేపు(శుక్రవారం మార్చి 1) అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆ దేశ పార్లమెంటులో ప్రకటించారు. భారత్‌తో శాంతి కోరుకుంటున్నామని చెప్పారు.

అసలు అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి ఎలా చిక్కారు? వారి భూభాగంలో ఎలా ల్యాండ్ అయ్యారు? ఆ తర్వాత ఏం జరిగింది? భారత ఆయుధాగారాన్ని ఎలా కాపాడారు? బుధవారం ఫిబ్రవరి 27 ఉదయం పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి చొరబడ్డాయి. భారత ఆయుధాగారాన్ని టార్గెట్ చేసి దాడికి యత్నించాయి. వారి నుంచి ఆయుధాగారాన్ని కాపాడే ప్రయత్నంలో భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వీరోచిత పోరాటం చేశారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆర్మీ బ్రిగేడ్‌ కేంద్ర కార్యాలయాన్ని కాపాడటమే లక్ష్యంగా రంగంలో దిగిన అభినందన్‌ అనుకున్నదైతే సాధించారు. ఘటన సమయంలో మిగ్‌-21 బైసన్‌ విమానంలో ఉన్న అభినందన్‌…పాకిస్తాన్‌ ఎఫ్‌-16 విమానాన్ని వెంబడించి కూల్చేశారు. ఈ క్రమంలోనే ఆయన శత్రు విమానంతో పాటు సరిహద్దులు దాటి…పాక్ సైన్యానికి చిక్కారు.

ఎఫ్‌-16 విమానాన్ని కూల్చే ప్రయత్నంలోనే అభినందన్‌ విమానం కూడా అదుపుతప్పి కూలిపోయింది. దీంతో వెంటనే అభినందన్‌ పారాచ్యూట్‌తో సురక్షితంగా… పీవోకేలోని ఓ నదీ పరీవాహక  ప్రదేశంలో కిందికి దిగారు. అయితే మిగ్‌ కూలిపోవడాన్ని గమనించిన పాక్‌ సైనికులు సంఘటన స్థలానికి చేరుకుని…అభినందన్‌ను పట్టుకున్నారు. అనంతరంపై ఆయన దాడి చేసి తీవ్రంగా  గాయపరిచి…సమీపంలోని సైనిక శిబిరానికి తీసుకెళ్లారు.

జమ్ముకశ్మీర్‌లోని బ్రిగేడ్‌ కేంద్ర కార్యాలయాన్ని దెబ్బతీస్తే భారత్‌ సైన్యానికి ఉన్నత స్థాయిలో భారీ ప్రాణనష్టం జరుగుతుంది. భారత్‌ పూర్తి స్థాయి యుద్ధానికి దిగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.  అందుకే, వీటిని టార్గెట్‌ చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన 10 ఎఫ్‌-16 విమానాలు సరిహద్దులు దాటుకొని భారత భూభాగంలోకి వచ్చాయి. పాక్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచిన విషయాన్ని  క్షణాల్లోనే భారతీయ రాడార్లు పసిగట్టాయి. వెంటనే భారత్‌కు చెందిన 4 సుఖోయ్‌, 2 మిగ్‌ విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి. 16 విమానాల మధ్య ఆకాశంలో హోరాహోరీ  పోరాటం జరిగింది. అభినందన్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ సాహసం చేసి ఉండకపోతే పాక్‌ విమాన దాడిలో మనకు భారీ నష్టం జరిగేదని భారత వాయుసేన వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌ చెర నుంచి విడుదల కానున్న అభినందన్‌ది అసాధారణమైన పోరాటమనే చెప్పాలి.

భారత్‌ ఒత్తిడికి పాకిస్తాన్‌ తలొగ్గింది. భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాక్‌ చెర నుండి విడిపించడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో  భారత్‌ పైచేయి సాధించింది. విక్రమ్‌ అభినందన్‌ను రేపు(మార్చి 1) విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని పేర్కొన్నారు. శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని ఇమ్రాన్ తెలిపారు.

Categories
National

పాక్‌లో ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పోరాటం ఆగదు : త్రివిధ దళాలు

దాయాది దేశంపై భారత్ చేసిన తీవ్ర ఒత్తిడుల ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కమాండర్‌ను శుక్రవారం(మార్చి 1) విడుదల చేయనుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను వివరించారు. భారత భూభాగంలోని మిలటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేస్తూ దాడికి యత్నించిందని వెల్లడించారు. 

ఫిబ్రవరి 14 తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విషయంలో పాక్ సైనికులు హద్దు మీరి ప్రవర్తించారన్నారు. మన మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసినందుకు ధీటుగా బదులిచ్చినట్లు తెలిపారు. వారి కవ్వింపు చర్యలకు సమాధానంగానే దాడులు జరిపి సమర్థవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో పాక్‌లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో అనేది కచ్చితంగా చెప్పలేమన్నారు. 

ఫిబ్రవరి 27న ఉదయం పదిన్నరకు పాక్‌కు చెందిన యుద్ధ విమానాల జాడ భారత రాడార్‌కు కనిపించింది. వారిని వెంబడించే ప్రయత్నంలోనే మన పైలట్లు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ముగ్గురు భారత పైలెట్లు అరెస్టు అయ్యారని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. F-16 శకలాలు రాజౌరీ సమీపంలో కనిపించాయని వాటిని మీడియా ముందే ప్రదర్శించారు. LOCలో పూర్తి స్థాయి నిఘాను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పాక్ ఏ రూపంలో దుశ్చర్యలకు పాల్పడ్డా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అభినందన్ క్షేమంగా వెనక్కు వస్తున్నందుకు మాకు ఆనందంగా ఉందన్నారు.

Categories
National

భారత్ కూల్చివేసిన పాక్ యుద్ధ విమాన శకలాలివే

బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్  కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చూపించారు.
Read Also : ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు

LOC దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని త్రివిధ దళాలు ప్రకటించాయి. పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులను భారత్ పైకి పాక్ ఉసిగొల్పుతున్నంత కాలం ఉగ్రశిబిరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు.

భారత్ చేయాలనుకున్నది, టార్గెట్ లను నాశనం చేయాలనుకున్నది, చేసిన దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, సీనియర్ల సలహా మేరకే కూల్చివేయబడిన పాక్ విమాన శకలాలను దేశ ప్రజలకు చూపించడం జరిగిందని వారు తెలిపారు.

Categories
National

ఇస్రో స్పెషల్ మిషన్ : PSLV కొత్త రాకెట్‌లో 30 శాటిలైట్లు

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది.

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది. DRDO సంబంధించి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఎమిశాట్ ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ లో దాదాపు 30 థర్డ్ పార్టీ శాటిలైట్లు గగనతలంలోకి దూసుకెళ్లనున్నాయి. కొత్త వేరియంట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ ను ఇస్రో మార్చిలో ప్రయోగించనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు కొత్త టెక్నాలజీతో కూడిన శాటిలైట్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. పీఎస్ఎల్ వీ రాకెట్ లాంచింగ్ అయ్యే కచ్చితమైన తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించలేదు.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

‘ఈ ప్రయోగం.. మాకు స్పెషల్ మిషన్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి నాలుగు మోటార్లను వాడుతున్నాం. 28 థర్డ్ పార్టీ శాటిలైట్లను తొలిసారి మూడు వివిధ స్థాయి కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నాం’ అని ఇస్రో చైర్మన్ కె. శివన్ చెప్పారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ)కు సంబంధించిన డిఫెన్స్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఎమిశాట్, పీఎస్ఎల్వీ రాకెట్ ను ప్రయోగిస్తున్నట్టు తెలిపారు.

శాటిలైట్ 420 కేజీల బరువు ఉంటుందన్నారు. తమ కస్టమర్లకు సంబంధించిన 28 శాటిలైట్లు కలిపి మొత్తం బరువు 250 కేజీలు ఉంటుందని శివన్ చెప్పారు. డీఆర్ డీఓ ఎమిశాట్ అనేది ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ గా శివన్ తెలిపారు.  పీఎస్ఎల్వీ ఎమిశాట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత 76 కిలోమీటర్లు వరకు ప్రయాణించి 28 శాటిలైట్లను 504 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ప్రవేశపెట్టనుంది. 
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి

పీఎస్ఎల్వీ శాటిలైట్ తో పాటు మరో రెండు డిఫెన్స్ శాటిలైట్లను ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ద్వారా లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. గత జనవరిలో ఇస్రో డీఆర్ఢీఓ కోసం మైక్రో శాట్ ఆర్ అనే ఇమేజింగ్ శాటిలైట్ ను లాంచ్ చేసింది.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి

Categories
International National

పాక్ అందుకే తగ్గింది : మిస్సైల్ దాడులకు భయపడే అభినందన్ విడుదల

తమ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్తాన్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ సడెన్‌గా ఎందుకు మనసు  మార్చుకుంది. అభినందన్‌ను ఎందుకు విడుదల చేయాలనుకుంది. భారత్‌తో శాంతి కోరుకోవడానికి కారణం ఏంటి? భారత పైలెట్ అభినందన్ విడుదల నిర్ణయం వెనుక కీలక పరిణామాలు చోటు  చేసుకున్నాయి. భారత్ చేయబోయే మిస్సైల్ దాడులకు భయపడే తమ చెరలో ఉన్న అభినందన్‌ను రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Read Also : ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు

అభినందన్‌ను పాకిస్తాన్ నిర్భంధించడం భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పాకిస్తాన్‌పై మిస్సైల్ దాడులకు భారత సైన్యం సిద్ధమైంది. నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న అమెరికా..  వెంటనే పాకిస్తాన్ ప్రధానికి ఫోన్ చేసింది. యుద్ధం అంటూ వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. అభినందన్‌ను రిలీజ్ చేయాలని పాక్ ప్రభుత్వానికి అమెరికా సూచన చేసింది.  పాక్ విదేశాంగ మంత్రితో సమావేశమైన సౌదీ విదేశాంగ మంత్రి సైతం.. వింగ్ కమాండర్ అభినందన్‌ని విడుదల చేస్తే భారత్ కొంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెప్పింది. ఇలా అంతర్జాతీయ  స్థాయిలో అన్ని దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ ఆలోచనలో పడిపోయింది. చివరికి అభినందన్ విడుదలకు అంగీకారం తెలిపింది.
Read Also:ఇమ్రాన్ ఖాన్ ప్రకటన : రేపే కమాండర్ అభినందన్ విడుదల

రేపు(మార్చి 1 2019) అభినందన్‌ను విడుదల చేస్తామని స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. పార్లమెంటు వేదికగా శాంతి సందేశం పంపారు. భారత్‌తో  శాంతి కోరుకుంటున్నట్టు ఇమ్రాన్ స్పష్టం చేశారు. కాగా, యుద్ధంపై చర్చించేందుకు గురువారం(ఫిబ్రవరి 28) సాయంత్రం త్రివిధ దళాధిపతులు భేటీ కావాల్సి ఉంది. ఇంతలో అభినందన్ విడుదలకు  పాకిస్తాన్ అంగీకారం తెలపడంతో యుద్ధం ఆలోచనలను విరమించుకున్నట్టు తెలుస్తోంది.

Read Also : ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్