Categories
Uncategorized

జగన్ కేసుల కోసం ప్రజలు ఓట్లు వేయాలా..విశాఖ సభలో సీఎం

 ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

విశాఖలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథులుగా ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ…ఐదేళ్ల క్రితం మోడీ ఏం చెప్పారో… ఏం చేశారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. రాజధానికి సహకరించకుండా నమ్మకద్రోహం చేసిన వ్యక్తి మోడీ అని అన్నారు. హుద్‌ హుద్‌ సమయంలో సాయంగా మొదటివిడతగా రూ.1000కోట్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చి రూ.650కోట్లు మాత్రమే ఇచ్చి రూ. 350 కోట్లు ఎగ్గొట్టారని చంద్రబాబు ఆరోపించారు.అహ్మదాబాద్ కంటే విశాఖ ముందుకు వెళ్తుందని మోడీకి భయమన్నారు.
 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి మోడీ అడ్డంకులు సృష్టించారని, డివిజన్‌ లేకుండా విశాఖ రైల్వే జోన్‌ ఇచ్చారని విమర్శించారు. ప్రధానికి ఉండాల్సిన అర్హతలు మోడీకి లేవని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ. 350 కోట్లను వెనక్కి తీసుకున్నారని, మోడీది నీచమైన మనస్థత్వం అని చంద్రబాబు విమర్శించారు.మోడీకి ఏపీ గడ్డపై కాలుపెట్టి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.ఏపీలో ఒక్కరు కూడా మోడీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు.మోడీ ఓడిపోతేనే దేశం బాగుపడుతుందని, దేశంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. మోడీకి నీతిలేదని, పద్ధతి లేదని చంద్రబాబు విమర్శించారు.ప్రధాని స్థాయికి తగని విధంగా మోడీ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

55లక్షలమందికి ఏపీలో ఫించన్ ను రూ.200నుంచి రూ.2000చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు అన్నారు.మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే ఫించన్ ను రూ.3,000లకు పెంచుతామని తెలిపారు.చంద్రబాబే మళ్లీ గెలవాలని వృద్ధులు అనుకుంటున్నారని అన్నారు.సింహాచలం భూముల విషయంలో ప్రతిపక్ష వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని..వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు.వైసీపీ పేదవాళ్లను దోచుకొనే పార్టీ అని,సంక్షేమం గురించి సరైన హామీలివ్వలేక ఒక్క అవకాశం.. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ఆ ఒక్క అవకాశం ఇస్తే వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని ముంచేస్తారని అన్నారు.

జగన్‌ కేసుల కోసం ప్రజలంతా ఓట్లు వేయాలా..ఆయన జైలుకు వెళ్లకుండా మనం కాపాడాలా అని సీఎం ప్రశ్నించారు.టీడీపీ నీతివంతమైన పాలన అందించిందన్నారు.జగన్ పై 31 కేసులు ఉన్నాయన్నారు.జగన్ అసెంబ్లీకి 24రోజుల మాత్రమే  వచ్చాడని..కోర్టుకి 240రోజులు వెళ్లాడని అన్నారు.కోడికత్తి పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు.గత ఎన్నికల్లో విశాఖలో వైఎస్ విజయమ్మ పోటీ చేశారని మళ్లీ ఎందుకు పోటీ చేయడం లేదని తాను అడుగుతున్నానని,దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
 

Categories
Uncategorized

ఏపీలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : గోపాలకృష్ణ ద్వివేది 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పోలింగ్ సెంటర్లను పెంచినట్లు ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరుగలేదన్నారు. 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఏపి అసెంబ్లీ  ఎన్నికల బరిలో 2,395 మంది అభ్యర్ధులు, పార్లమెంట్ బరిలో 344 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. ఓటరు ఎపిక్ కార్డులు పంపిణీ ఏప్రిల్ 7 వ తేదిలోగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇవిఎంలపై ఉన్న అపోహలను తొలగించేందుకు హైకోర్టు ఛీఫ్ జస్టిస్, ఇతర జస్టిస్ ల ఎదుట వాటి పనితీరును ప్రదర్శించనున్నామని ఆయన తెలిపారు. 

Categories
Uncategorized

ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు : సీఈసీ

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయాలని ఈసీఐఎల్‌కు ఆదేశించింది. 26 వేల 820 బ్యాలెట్ యూనిట్లను సప్లై చేయాలని ఈసీఐఎల్ కు సీఈసీ ఆదేశించింది. 2వేల 6 వీవీప్యాట్ లు సప్లై చేయాలని ఆదేశించింది. బేల్ ఎం-3 ఈవీఎంలను ఈసీఐఎల్ సరఫరా చేయనుంది. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో 185 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు. 

 

Categories
Uncategorized

చంద్రబాబుతోనే ఏపీ అభివృధ్ధి సాధ్యం: మమతా బెనర్జీ

విశాఖపట్నం: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం  మోడీ, అమిత్ షా ద్వయం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.  అందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యమని ఆమె అన్నారు. రాష్ట్రాలను భయభ్రాంతులను చేయడం ద్వారా మోడీ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరని విశాఖ పట్నంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె చెప్పారు. గత ఎన్నికల్లో చాయ్‌వాలా అని ప్రచారం చేసుకున్న మోడీ ఇప్పుడు చౌకీదార్ అంటూ కొత్త నాటకం ప్రారంభించారని విమర్శించారు. 

మోడీ ఎవరికి కాపాలాదారుడుగా ఉన్నారో చెప్పాలని మమతా బెనర్జీ  డిమాండ్ చేశారు. దేశాన్ని లూటీ చేసేవారికి మోడీ చౌకీదార్ గా ఉన్నారని మమత ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయందని ఆమె విమర్శించారు. ప్రధాని మోదీకి విలేకరులను ఎదుర్కోవటంచేతకాదని, అధికారంలో ఉండగా ఒక్కసారికూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ప్రస్తుతం దేశభక్తి పేరుతో దేశాన్ని అమ్మేసే దేశభక్తులు తయారయ్యారని మమతా బెనర్జీ చురకలు అంటించారు. బీజేపీని, దాని మిత్రులను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని మమతా బెనర్జీ  ధీమా వ్యక్తం చేశారు. 

Categories
Uncategorized

బాబు మరోసారి సీఎం కావాలి…టీడీపీ సభలో కేజ్రీవాల్

ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగా మార్చారని, ఆయన మరోసారి సీఎం కావాలని అన్నారు. టీడీపీ భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ…ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు కలిసి దేశంలో అనేక సమస్యల్ని సృష్టించారన్నారు.ప్రశాంతంగా ఉండే దేశంలో కులమతాల పేరుతో విద్వేషం నింపారన్నారు. దేశం మొత్తాన్ని వారిద్దరూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వారి దెబ్బకు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.వారిద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేశారన్నారు.

మోడీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిందన్నారు.నోట్ల రద్దు దెబ్బకు అన్ని రకాల వ్యాపారాలూ కుదేలయ్యాయని తెలిపారు. నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఇప్పుడు తెలుస్తోందన్నారు.మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే హిట్లర్‌ పాలన వస్తుందన్నారు. మోడీ మరోసారి ప్రధాని అయితే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు.
 

Categories
Hyderabad Weather

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి, నారాయణగూడ, బాగ్ లింగంపల్లి, చిక్కడపల్లి, ఆర్టీసీక్రాస్ రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉరుము, మెరుపులతో కూడిన వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

Categories
National

చౌకీదార్ గా ఉంటా….ప్రభుత్వ ధనాన్ని కాపాడతా

భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమం ‘మైన్ భీ చౌకీదార్’లో మోడీ మాట్లాడుతూ…2014లో నేను భారతదేశానికి కొత్తవాడిని. ఓ ముఖ్యమంత్రిగానే భారతీయులకు నేను పరిచయం.ఆ సమయంలో నా విమర్శకులే నా గురించి ప్రచారం చేశారు. వారి వల్లే ప్రజలకు నా గురించి తెలిసింది. అందువల్ల వారికి ధన్యవాదాలు చెప్తున్నాను అని మోడీ తెలిపారు. ప్రజలు తన గురించి ఆసక్తిగా గమనించడానికి కారణం విమర్శకులేని అన్నారు.బీజేపీ తనకు ఓ బాధ్యత అప్పగించిందని, కాపలాదారుగా చేసిందని తెలిపారు.

అవినీతిపరుల నుంచి దేశ సంపదను కాపాడటానికి గట్టి కృషి చేస్తానన్నారు.కాపలాదారు అంటే ఏదో ఓ యూనిఫాం, టోపీ ధరించి, ఈల పట్టుకోవడం అని కొందరు అనుకుంటారన్నారని, అలాంటివారి ఆలోచనా సామర్థ్యం చాలా తక్కువ అని మోడీ తెలిపారు. ఈ ఐదేళ్ళలో దేశ ప్రజలంతా తనకు మద్దతిచ్చారన్నారు. నేడు ఇక్కడ ప్రతి ఒక్కరూ కాపలాదారేనన్నారు. ఈసారి ప్రతి కాపలాదారు బరిలో ఉన్నారని చెప్పారు. కాపలా ఉండటం ఆదర్శప్రాయమైనదని, అదొక గొప్ప అనుభూతి అని తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని దోపిడీకి గురికానివ్వబోనని,కాపలాదారుగా తాను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్నారు. కొందరు తమ పరిమిత ఆలోచనా సామర్థ్యం వల్ల ‘కాపలాదారు’కు ఉన్న డిక్షనరీలోని అర్థానికి మించి ఆలోచించలేరని అన్నారు.
 

Categories
National Political

పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారు : మోడీ ఫొటోలతో చీరలు

ప్రధాని మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి  శుభలేఖలను కూడా ప్రచారాస్త్రంగా వాడారు. ‘మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీ కి ఓటేయ్యండని’ కోరిన సంఘటన కూడా మనం చూశాం. మహిళా ఓటర్లను ఆకర్షించటానికి బొట్టు బిళ్లల ప్యాకెట్ పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు. ప్రస్తుతం మోడీ చిత్రంతో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

మన్‌కీ బాత్, మోడీ విజన్, సర్జికల్ స్ట్రైక్స్‌, ఎయిర్ స్ట్రైక్.. ఇలా వివిధ రకాల పేర్లతో తయారైన చీరలు మహిళల అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఈ సరికొత్త చీరలను కట్టుకుని మగువలు మురిసిపోతున్నారు. దీనిపై వ్యాపారుల కూడా హర్షం చేస్తున్నారు. దేశంలో మోడీ మానియా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమంటున్నారు.
 

Categories
Telangana

నిఖార్సైన హిందువుని నేనే : కేసీఆర్

మహబూబ్ నగర్ : కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పటానికి వస్తున్నాడనే సరికి మోడీకి, రాహుల్ కు భయం పట్టుకుందని  టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. మే 23 తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తుందని అప్పుడు బీజేపీ భరతం పడతామని  కేసీఆర్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ లో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన  మాట్లాడుతూ….. దేశంలో గడిచిన 5 ఏళ్లలో  బీజేపీ  ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. ఐదేళ్లలో బీజేపీ చేసిందేమి లేదని 29 రాష్ట్రాలలో కంటే అంగన్ వాడీలకు  ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణా ఒక్కటే అని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో  బీజేపీకి అధికారం ఇస్తే పాలమూరు  ప్రాజెక్టు కడతామన్నమోడీ ఎందుకు కట్టలేదని కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను మోడీ  కాపీ కొట్టారని, గడిచిన 5 ఏళ్లలో మోడీ రైతులకు చేసిందేమి లేదని కేసీఆర్ అన్నారు. మిషన్ బగీరధకు, మిషన్ కాకాతీయకు నిధులు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ మోడీ నిధులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, దేశ భద్రత దృష్ట్యా గోప్యత పాటించాల్సిన అంశాలను మోడీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు కానీ కేంద్రంలో బీసీల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ ఉండదని, ఈవిషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో 3వేల మంది ఎస్టీలను టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లను చేసిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

దేశానికి దరిద్రం పట్టిందని, దాన్ని పోగొట్టాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలని, అవసరమైతే జాతీయ పార్టీ స్ధాపిస్తానని కేసీఆర్ చెప్పారు.  రాజ్యాంగంలో, న్యాయవ్యవస్దలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ తెలిపారు. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ  యాక్ట్ తీసుకువస్తామని తెలిపారు. బీజేపీ వాళ్లు రాజకీయ హిందువులని, మేమే అసలైన హిందువులమని కేసీఆర్ అన్నారు. నేను చేసినన్ని యాగాలు ఎవరైనా చేశారు అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంటే వాడుకోవటం చేతకాని దద్దమ్మలు ,సన్నాసులు దేశాన్ని పాలిస్తున్నారని ఆయన బీజేపీని దుయ్యబట్టారు.

Categories
Uncategorized

CSKvsRR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై చిదంబరం స్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 31న తలపడనుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన చెన్నై గత సీజన్ హవానే కొనసాగిస్తోంది. 

రాజస్థాన్ రాయల్స్ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవక పేలవమైన రికార్డుతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో జట్టు తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. 

రాజస్థాన్ రాయల్స్: 
అజింకా రహానె(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతం, జోఫ్రా ఆర్చర్, జయదేశ్ ఉనదక్త్, శ్రేయాస్ గోపాల్, ధావల్ కుల్‌కర్ణి

చెన్నై సూపర్ కింగ్స్: 
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోనీ, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మిచెల్ శాంతర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్