Categories
Movies

నిర్మాతగా మారుతున్న చిరంజీవి పెద్దల్లుడు

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి నిర్మాత అయ్యేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎల్ వీ విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను తియ్యాలని నిర్ణయించుకున్నారు.

అయితే విష్ణు, సుస్మిత ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్ ను తీసి తర్వాత పెద్ద సినిమాలను తీయాలని భావిస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. విష్ణు ప్రసాద్ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త. 2006లో విష్ణు, సుస్మిత వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే వెబ్ సిరీస్ లను అన్నీ భాషల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు విష్ణూ.

Categories
National

తొలిసారి ఎన్నికల బరిలో.. గెలవాలని కాదు ప్రజాసేవకి: ఆదిత్య థాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శివసేన యువ నాయకులు, బాల్‌థాకరే మనవడు ఆదిత్య థాక్రే స్పష్టం చేశారు. శివసేనకు కంచుకోటగా పరిగణించే వొర్లి స్ధానం నుంచి ఆదిత్య థాక్రే పోటీ చేయనున్నారు.

ముంబైలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆదిత్య థాక్రే గతంలో బాలాసాహెబ్‌కు ఆ తర్వాత మా తండ్రి ఉద్దవ్‌కు ప్రేమాభిమానాలు అందించిన మీరు అదే ప్రేమను తన యాత్ర సందర్భంగా కొద్దిరోజులుగా తనపై కురిపిస్తున్నారని, అందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇదే సమయంలో తాను వొర్లి నుంచి పోటీ చేస్తున్నా అంటూ ప్రకటించారు. యావత్‌ మహారాష్ట్ర తన కర్మభూమిగా ఉంటుందని ఆదిత్య స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే, మంత్రి, లేదా ముఖ్యమంత్రి కావాలనే కోరికతో పోటీ చేయట్లేదని, ప్రజలకు సేవ చేసేందుకే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

బాల్‌థాకరే శివసేనను 1966లో స్ధాపించినప్పటి నుంచి థాక్రే కుటుంబం​ నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయలేదు. అలాగే రాజ్యాంగ పదవిని చేపట్టలేదు. థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఆదిత్య థాక్రే ఎన్నికలలో నిలవడం గమనార్హం.

Categories
Uncategorized

పవన్ ట్వీట్స్ : ఇదేనా దసరా కానుక

నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ట్వీట్‌ చేశారు.

గత ఏడాది ఇదే నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్.. ఈసారి ఎందుకు విఫలమైందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సర్కార్ సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
Read More : ఆశలు చిగురిస్తున్నాయి : బోటు వెలికితీత పనుల్లో దర్మాడి
ఏ కొత్త ప్రభుత్వమైనా శుభంతో పనులు ప్రారంభిస్తారని, కానీ వైసీపీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధమైన పనులు చేస్తోందని ఆక్షేపించారు. ఇళ్ల కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాలను రద్దు, ఆశా వర్కర్లను రోడ్ల మీదకు తీసుకరావడం, కేసులు పెట్టడం, అమరావతి రాజధాని చెయ్యడం వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు పవన్. 

Categories
Uncategorized

ఆశలు చిగురిస్తున్నాయి : బోటు వెలికితీత పనుల్లో దర్మాడి సత్యం టీం

కచ్చులూరు వద్ద తొలిరోజు బోటు వెలికితీత పనులు ముగిశాయి. ధర్మాడి సత్యం టీమ్‌ విసిరిన కొక్కేలు బోటుకు తగిలేలా చేసి బయటకు లాగాలని ప్లాన్‌ చేశారు. అయితే కొక్కేలతో లాగితే బోటు విరిగిపోయే ప్రమాదం ఉందని భావించి.. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకొని సెకండ్‌ ప్లాన్‌తో గోదావరిలోకి వెళ్లింది. చుట్టూ తాడు బిగించి బయటకు తేవడమే ఈజీ అని రంగంలోకి దూకింది. మొత్తం 25 మంది సభ్యుల బృందం, భారీ ఇనుప తాళ్లతో బోటు వెలికితీత పనులకు వెళ్లింది. 

బోటు వెలికితీత పనులు వేగంగా సాగుతుంటే.. ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం నుంచి దర్మాడి సత్యం టీమ్‌ ఇనుప తాళ్లు, లంగర్లతో గోదావరిలోకి వెళ్లి ప్రమాదం జరిగిన స్థలంలో గాలిస్తోంది. ప్రభుత్వ అనుమతితో రంగంలోకి దిగిన బాలాజీ మెరైన్స్‌ సంస్థకు చెందిన టీమ్‌.. ఒక పంటు, బోటుతో గోదావరిలోకి వెళ్లింది. గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున.. పంటును బోటుకు కట్టి ప్రమాదస్థలికి వెళ్లింది. భారీ ఇనుప కొక్కేలు, ఇనుప తాళ్లను పంటు ద్వారా గోదావరిలోకి వదిలింది. భారీ బరువున్న ఇనుప తాళ్లను క్రేన్‌ సాయంతో పంటుకు అనుసంధానం చేసింది.

పంటు ద్వారా గోదావరి లోపలికి యాంకర్లను, లంగర్లను దించి.. ప్రమాద ప్రదేశంలో దాదాపు రెండు వందల అడుగుల లోతుకు దింపి.. బోటు కోసం గాలిస్తోంది. ఈ క్రమంలోనే లంగర్లకు బరువైన వస్తువు తగిలినట్టుగా తెలుస్తోంది. అది ప్రమాదానికి గురైన వశిష్ట బోటా లేక మరేదైనా వస్తువా అనేది తెలియాల్సి ఉంది. రెండు ప్లాన్లతో సహాయక చర్యలకు దిగిన దర్మాడి టీమ్‌.. ఫస్ట్‌ ప్లాన్‌లోనే పురోగతి సాధించడంతో బోటు బయటకు వస్తుందనే ఆశాభావం పెరుగుతోంది.

మరోవైపు.. కచ్చులూరు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని.. అక్కడికి ఎవరినీ అనుతించడం లేదు. కనీసం మీడియాను కూడా దగ్గరికి రానివ్వడం లేదు. సహాయక చర్యలు జరుగుతున్న ప్రదేశం నుంచి కాస్త దూరం నుంచే మీడియా కవరేజ్‌కు అనుమతించారు. పూర్తిగా బోటు బయటకు వచ్చిన తర్వాతనే మీడియాను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. ఇటు సెల్ టవర్ సిగ్నల్స్‌ను పూర్తిగా నిలిపివేశారు. వదంతులు వెలువడే అవకాశం ఉండటంతో.. సెల్‌ జామర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

కచ్చులూరు ప్రమాదం సెప్టెంబర్‌ 15న జరిగింది. సరిగ్గా 15 రోజులు దాటిపోయింది. ప్రమాద సమయంలో 26 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మరో 40 మృతదేహాలు లభించాయి. కానీ.. ఇంకా పదిహేను మృతదేహాలు దాకా.. లభించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నేవీ బృందాలు ఎంత గాలించినా.. అత్యాధునిక పరికరాలతో గోదావరి అంతా పరిశీలించినా బోటు ఆచూకీని కనిపెట్టలేకపోయారు. రెండు ప్లాన్లతో బోటును బయటకు తీసేందుకు రంగంలోకి దర్మాడి టీం దిగింది. భారీ సరంజామాతో బోటు, పంటు ఆధారంగా బోటు వెలికితీత పనులను మొదలుపెట్టింది. బోటు కదిలినా, బయటకు వచ్చినా మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉంది. 

Categories
Uncategorized

ఏపీలో మద్యం ప్రియులకు షాక్ :  సమయం కుదించారు

ఏపీలో మద్యం ప్రియులకు షాక్. సమయాన్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలని సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బీర్లు, లిక్కర్ అమ్మకాల పరిమితంగానే అమ్మకాలు చేయనుంది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరుగనున్నాయి.

ఒక్కో దుకాణంలో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్ మెన్స్ ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 500 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినా..బెల్టు షాపులు నిర్వహించినా..ప్రభుత్వం కొరఢా ఝులిపించనుంది. ఒక వ్యక్తి దగ్గుర మూడు బాటిళ్లు మాత్రమే ఉండాలని..అంతకంటే ఎక్కువ ఉంటే…కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

తెల్లారితే మద్యం పాలసీ అమల్లోకి వస్తుండడంతో ఆయా దుకాణ దారులు తమవద్దనున్న స్టాక్‌ను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు బారులు తీరుతున్నట్లు టాక్. రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణమైన మద్య నిషేధం చేస్తామని ఎన్నికల సందర్భంగా వైసీపీ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్న బెల్టుషాపులపై కొరఢా ఝులిపించారు. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Categories
Crime National

గుజరాత్‌లో ఘోర బస్సు ప్రమాదం : 21మంది మృతి.. 50మందికి గాయాలు

గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 21మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం (సెప్టెంబర్ 30, 2019) గుజరాత్ నార్తరన్ బనస్కాంత జిల్లాలోని అంబాజీ సమీపంలో జరిగింది. ఇటీవల బనస్కాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురియడంతో రోడ్లన్నీ బురదమయమయ్యాయి.

దీంతో ఆ మార్గాల్లో వెళ్లే వాహలన్నీ జారిపోతున్నాయి. పక్కనే లోయ ఉండటంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులు ఉండగా వారిలో 21 మంది అక్కడిక్కడే మృతిచెందినట్టు అదనపు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం బనస్కాంతలోని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘బస్సు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడ్డ బాధితులకు సాధ్యమైనంత తొందరంగా వైద్య సాయం అందించేలా స్థానిక అధికారులు చూడాలి. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.  

మరోవైపు హోం మంత్రి అమిత్ షా కూడా బస్సు ప్రమాద ఘటనపై తన సంతాపాన్ని తెలియజేశారు. బస్సు ప్రమాదంలో మృతిచెందినవారి పట్ల విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి ప్రతిఒక్కరికి సాధ్యమైనంత తొందరగా అత్యవసర సాయం అందించాలని కోరినట్టు ట్వీట్ చేశారు. గాయపడ్డ ప్రయాణికులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాని, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. 

Categories
Uncategorized

తిరుపతిలో సీఎం జగన్ : శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పణ

ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకంటే ముందు…5.23 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణం అనంతరం శ్రీ వారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ వారి ఆలయం ముందున్న బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తలపై స్వామి వారి శేషవస్త్రంతో పరిపట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఆలయ మహాద్వారం గుండా..ఆలయంలో ప్రవేశించి..గర్భాలయంలో మూల విరాట్టు ముందు అర్చకులకు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. 

అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. సోమవారం వాహన మండపం వద్ద పెద్ద శేష వాహనం సేవ జరిగింది. సేవలో పాల్గొన్న సీఎం జగన్..ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. తిరుమల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. 

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు అక్టోబరు 8 వరకు జరుగనున్నాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 8న చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ మలయప్పస్వామి వివిధ రకాల వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామికి వాహనసేవలు జరగనున్నాయి. 

> సెప్టెంబర్ 30న పెద్దశేష వాహనం
> అక్టోబరు 1న చిన్నశేష వాహనం. హంస వాహనం, 
> అక్టోబరు 2న సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం
> అక్టోబరు 3న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
> అక్టోబరు 4న మోహిని అవతారం, గరుడ వాహనం
> అక్టోబరు 5న హనుమంత వాహనం, గజవాహనం
అక్టోబరు 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
అక్టోబరు 7న స్వర్ణ రథం, అశ్వ వాహనం
అక్టోబరు 8న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత గలిగిన గరుడ సేవ అక్టోబరు 4న జరుగనుంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడుడిపై ఉన్న స్వామిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
Read More : బాంబులు వేస్తేనే భయపడలేదు..జగన్‌కు భయపడుతానా – బాబు

Categories
Uncategorized

కోడెలకు ధైర్యం చెప్పా.. వైసీపీ వేధించింది: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభను గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు తెలుగుదేశం నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. కేవలం రూ. లక్ష కోసం కోడెల కక్కుర్తిపడ్డారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫర్నిచర్ కేసు పెట్టి వేధించారని ఆరోపించారు చంద్రబాబు. కోడెలపై తప్పుడు కేసులు పెట్టి ఆయన చనిపోయేవరకు హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోడెలపై కేసులు పెట్టిన విషయం తెలిసి ఆయనను ఓదార్చానని, ధైర్యం చెప్పానని, వైసీపీ మాత్రం రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పోలీసులను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాటిపులిగా పేరుగాంచిన కోడెల మృతిచెందిన విధానం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.

 

Categories
National Political

రెజ్లర్లకు బీజేపీ టికెట్లు : తొలి జాబితాలో బాబితా ఫోగాట్, యోగేశ్వర్ దత్

హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని అధికారిక బీజేపీ కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుంది.

హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని అధికారిక బీజేపీ కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుంది. రాష్ట్రంలో 90 స్థానాలు ఉన్న హర్యాణా అసెంబ్లీకి మొత్తం 78 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు రెజ్లర్ క్రీడాకారులకు చోటు దక్కింది.

బాబితా ఫోగాట్, యోగేశ్వర్ దత్ లకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మొత్తంగా 38 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తుండగా.. ఏడుగురు మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. కేంద్ర ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలతో కలిసి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. 

మూడు గంటల పాటు చర్చించిన అనంతరం 78 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తోహనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెజ్లర్ ఫోగాట్ డారి నుంచి పోటీ చేస్తుండగా.. దత్ బరోడా నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఇద్దరు మంత్రుల్లో.. బాద్ షా పూర్ నుంచి రావ్ నర్ బీర్ సింగ్ ఒకరు.. ఫరీదాబాద్ నుంచి విపుల్ గోయెల్ టికెట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. 2014 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) 19స్థానాల్లో గెలిచింది. మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 

నవంబర్ 2న హర్యాణా అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. మహారాష్ట్ర, హర్యాణాలో అక్టోబర్ 21 నుంచి కొత్త అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటింగ్ జరుగనుంది. మూడు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 4న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 7 వరకు నామినేషన్లు ఉపసంహరణకు తుదిగడువు ఉంది. జాతీయ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అందరి దృష్టి ఈ రెండు రాష్ట్రాలపైనే ఉంది. ఉత్తర రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. మహారాష్ట్రలో 8.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 

Categories
Hyderabad

కమిషనర్ వార్నింగ్ : ఆ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే జైలుకే

సీపీ అంజనీ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. నిషేధిత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో ట్వీట్ చేశారు. రెండు రోజుల నుంచి కొంత మంది పోకిరీలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని మీడియాకు తెలిపారు. ఇరాన్, అప్ఘనిస్తాన్ ఇతర దేశాలకు సంబంధించిన కొన్ని వీడియోలను కట్ చేసి..పేస్టు చేస్తూ..పార్వర్డ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాట్సప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌‌లను ఆయన హెచ్చరించారు.

ఇలాంటి వీడియోలు, ఫొటోలు ఫార్వర్డ్ చేయడం..చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై కేసు రిజిష్టర్ చేయడం, అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. నిషేధిత వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని, ప్రజల మధ్య చిచ్చు రేపవచ్చని అనుకుంటున్నారని అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వీరి ప్రయత్నాలను తాము నెరవేరనీయమని స్పష్టం చేశారు.
Read More : పోలీస్ అలర్ట్ : జూబ్లీహిల్స్ టూ మాదాపూర్ ట్రాఫిక్ జాం

ప్రజల సహకారంతో..వీటిని అరికడుతామన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్..తదితర వాటిల్లో ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్, అప్ లోడ్ చేయవద్దని సూచించారు. ఇలాంటి పిక్చర్స్‌కు కాశ్మీర్‌కు ఎలాంటి సంబంధం లేదని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.