Categories
Crime National

ఎప్పుడో ఉరి తీయాల్సింది : నిర్భయ దోషులకు త్వరలో మరణశిక్ష అమలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువులోగా నేరస్థులు క్షమాభిక్ష,సవాల్ చేయడమో చేయకపోతే అదే విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తామని తెలిపారు. అనంతరం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మరణశిక్షను అమలుచేస్తామని తెలిపారు. ఈ కేసులోని నలుగురు దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా,ఇంకొకరు మండోలీ జైలులో ఉన్నారు.

మరణశిక్షను సవాల్ చేసే హక్కు దోషులకు ఉన్నప్పటికీ నలుగురిలో ఎవరూ దరఖాస్తు చేయలేదు. తమ శిక్ష తీవ్రతను తగ్గించి,మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని రాష్ట్రపతిని క్షమాభిక్ష పెట్టమని వేడుకునే అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోకపోవడం గమనించదగ్గ విషయం.

నిర్భయ తల్లి ఆషాదేవి మాట్లాడుతూ..దోషులకు మరణశిక్ష అమలు ఎప్పుడో జరగాల్సి ఉందన్నారు. 2017లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆమె గుర్తుచేశారు. 7ఏళ్లుగా తాను స్ట్రగుల్ అవుతూనే ఉన్నానని,ఇంకా దోషులకు ఉరిశిక్ష పడలేదన్నారు. జైలు అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.

Categories
Crime

పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బేల మండలం,లోని జునొని గ్రామ శివారులొ నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు పొలంలో పత్తి కాయలు ఏరుతుండగా వర్షం పడటం మొదలయ్యింది.

పత్తి తడిసి పోతుందనే ఉద్దేశ్యంతో వారు సమీపంలోని ఒక చెట్టు కిందకు చేరారు. వీరు చెట్టు కింద ఉండగ పిడుగు పడడంతొ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఇద్దరు షాక్ కు గురై బయట పడ్డారు. షాక్ కు గురైన మహిళలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతిచెందిన వారు కనక దేవికా(30) కబీర్ దాస్ బెలా గ్రామనికి చెందినది కాగ, నగొసే ప్రమిలా(29)బ్రాహ్మనంద్ జునొని గ్రామ మహిళగా గుర్తించారు. 

Categories
National Political

మహా రాజకీయంలో మలుపులు…పవార్ తో శివసేన ముఖ్యనాయకుడు భేటీ

మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యఠాక్రే,పలువురు శివసేన నాయకులు కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు.

శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమైన తర్వాత ఆ పార్టీ ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పవార్ తో చర్చించినట్లు సంజయ్ రౌత్ తెలిపారు. 

చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలని శివసేన చేస్తున్న ప్రతిపాదనను బీజేపీ ఒప్పుకోవడం లేదు. 5ఏళ్లు తానే సీఎం అని దేవేంద్ర ఫడ్నవీస్ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. శివసేనకు 16మంత్రి పదవులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ చెబుతోంది. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పవార్ తో శివసేన నాయకుడు భేటీ చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటిమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ వచ్చినప్పటికీ పదవుల విషయంలో క్లారిటీ లేక ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు.

Categories
Hyderabad Political

విన్నపాలు వినవలె : కేంద్ర మంత్రులతో కేటీఆర్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని, నిధులు కేటాయించాలని కోరారు. అక్టోబర్ 31వ తేదీ గురువారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమయ్యారు. బేగంపేట సమీపంలోని రసూల్ పురా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి SRDP కార్యక్రమం కింద కొంత స్థలాన్ని కేటాయించాలని షాను కోరారు కేటీఆర్. ఇంటర్ స్టేట్ పోలీస్ వైర్ లెస్ స్టాఫ్ క్వార్టర్స్‌కి చెందిన 1.62 ఎకరాల స్థలాన్ని GHMCకి ఇవ్వాలని, దీనికి ప్రత్యామ్నాయంగా మరోస్థలంలో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామన్నారు. 

అంతకుముందు రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‌తో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీకి ఏర్పాటుకు సహకారం అందించాలని, నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ కింద ఫార్మా సిటీ ఏర్పాటుకు డీపీఐఐటీ కింద నిధులు సమకూర్చాలని కోరారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని, విజయవాడ నుంచి నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు రోజువారి పాసింజర్ రైలు నడపాలని మంత్రి కేటీఆర్ కోరారు. 

2019, అక్టోబర్ 30వ తేదీన ఢిల్లీకి మంత్రి కేటీఆర్ వెళ్లారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. బుధవారం సౌత్ బ్లాక్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్..రాజ్ నాథ్ సింగ్‌‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ – నాగ్ పూర్, హైదరాబాద్ – రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Read More : కరీంనగర్‌లో హైటెన్షన్ : చర్చలు జరిపితేనే..డ్రైవర్ బాబు అంత్యక్రియలు

Categories
Uncategorized

కరీంనగర్‌లో హైటెన్షన్ : చర్చలు జరిపితేనే..డ్రైవర్ బాబు అంత్యక్రియలు

కరీంనగర్‌లో హైటెన్షన్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో.. ప్రభుత్వం చర్చలు జరిపేంత వరకు.. డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదంటున్నారు. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు.  డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. 

ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ… డ్రైవర్ బాబు మృతదేహం దగ్గరే బైఠాయించారు. వీరికి మద్దతుగా 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం రాత్రికి.. ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్ష నాయకులు కరీంనగర్ చేరుకోనున్నారు. నవంబర్ 01వ తేదీ శుక్రవారం కూడా కరీంనగర్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా బంద్ కొనసాగుతుండగానే.. మరో వైపు మంథని ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. బస్ డిపో ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి కార్మికులు అడ్డుకుని అతడ్ని వారించారు. 

డిపోల వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
మరోవైపు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఆల్‌ పార్టీ నేతలంతా గవర్నర్ తమిళిసైను కలిసారు. ఆర్టీసీ సమ్మెపై కోర్టులను కేసీఆర్ లెక్కచేయడం లేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క  జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్ బాధపడ్డారని .. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 

ఇదిలా ఉంటే..ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్‌కు పర్మిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. మూడు వేల నుంచి నాలుగువేల రూట్లలో ప్రైవేట్‌ బస్‌లకు పర్మిట్లు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెయ్యి రూట్లలో ప్రైవేటు పర్మిట్ల కోసం నోటిఫికేషన్‌ జారీచేస్తే.. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. 21 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. కేబినెట్‌లో చర్చించి ప్రైవేట్‌ బస్‌లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
Read More : తల్లిని ఎలా చంపానంటే : కీర్తిరెడ్డి కేసులో షాకింగ్ నిజాలు

Categories
Political

3 రోజులు పండుగ : ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్, సీఎం హాజరవుతారు. అమరజీవి పొట్టిశ్రీరాములకు ప్రత్యేక నివాళులర్పిస్తారు. స్వాతంత్ర సమరయోధుల వారసులకు సన్మానాలు చేస్తారు. 

మూడు రోజుల పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబంబించేలా వేడుకలు నిర్వహించనున్నారు. కూచిపూడి నృత్యాలు, సురభి నాటకాలతో పాటు 21 చేనేత, హస్తకళల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రుచులను అందించే 25 ఫుడ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Categories
National

అక్రమంగా ఆక్రమించారు.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

జమ్మూకశ్మీర్,లడఖ్ లు ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో చైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసింది. భారత్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఇది చెల్లదని కామెంట్ చేసింది. చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా జవాబిచ్చింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని తేల్చిచెప్పింది. లద్దాఖ్, జమ్మూ, కశ్మీర్‌లు భారత్‌లో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది.

భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాలని మేం కొరుకుంటున్నాం. లడఖ్, కశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించిందని, చైనా-పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం కింద 1963లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొంత భాగాన్ని కూడా చైనా చట్టవ్యతిరేకంగా ఆక్రమించిందని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోదని, అదేవిధంగా ఇతర దేశాలు కూడా భారత్ వ్యవహారాల్లో తలదూర్చకూడదని తాము ఆశిస్తున్నామని రవీశ్ తెలిపారు.

Categories
Crime

కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమార్తె  పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల  సాయి పెట్టిన 420, 506  బెదిరింపులు, అక్రమ వసూళ్లు  కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగిపోయారు.

కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జి షీట్ నమోదు అయ్యేంత వరకు  నరసరావుపేట వన్ టౌన్, టూ టౌన్  పోలీసు స్టేషన్లలో ప్రతి ఆదివారం హాజరై తప్పని సరిగా సంతకం చేయాలని ఆదేశించింది. 

కోడెల శివప్రసాదరావు ఏపీ స్పీకర్ గా పని చేసిన రోజుల్లో ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మిలు సత్తెనపల్లి,నరసరావు పేట పరిసర ప్రాంతాల్లో కే ట్యాక్సు పేరుతో బలవంతపు వసూళ్ళు, బెదిరింపులు ఆక్రమణలు కొనసాగించారు. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో  కోడెల కుటుంబ బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి కోడెల కుటుంబం చేసిన అరాచకాన్ని బయటపెట్టారు. కేసులు నమోదుచేసుకున్న  పోలీసులు వారి కోసం ప్రయత్నించగా శివరాం, విజయలక్ష్మిలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  తదనంతరం జరిగిన పరిణామాల్లో  2019 సెప్టెంబర్ 16న కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవటంతో శివరాం అజ్ఞాతం వీడి బయటకు రాగా, అక్టోబరు 31న విజయలక్ష్మి నరసరావుపేట కోర్టులో లోంగి పోయారు. 

Categories
National

ఏపీకి మహా తుపాన్ గండం : 24 గంటల్లో భారీ వర్షాలు

రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో భారీ వర్షాలు నమోవుతన్నాయి. క్యార్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంటే..మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, అరేబియా సముద్రంలో ఇది నాలుగో తుపాన్ అన్నారు. ఆరు గంటల్లో మరింత తీవ్రతరం కానుందని ఐఎండీ తెలిపింది.

లక్ష ద్వీప్ – ఆగ్నేయం, తూర్పు మధ్య అరేబియా సముద్రంపై బలమైన గాలులు వీస్తాయన్నారు. బుధవారం సాయంత్రం తుపాన్‌గా మారిందని, కేరళలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక తీర ప్రాంతాల్లో, దక్షిణ భాగం తమిళనాడులో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని..,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, కోజికుడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 

Read More : ఆర్థికమంత్రి విమర్శలకు రాజన్ దిమ్మతిరిగే కౌంటర్
భారీ వర్షం..ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ప్రాంతాలు : – 
> లక్ష ద్వీప్, కేరళ, కర్ణాటకలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.
> తమిళనాడు, మహారాష్ట్ర తీర ప్రాంతాలు, గోవా, కర్ణాటకలలో భారీ వర్షాలు, ఉరుములు.
> ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్ దీవుల్లో విస్త్రతంగా వర్షాలు.
> మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చెదురుముదురు వర్షాలు.
> అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఒడిశా, జమ్మూ & కాశ్మీర్, గుజరాత్, చత్తీస్ గడ్‌లలో ఉరుమలతో కూడిన వర్షాలు.
> పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశలలో పొడి వాతావరణం.

Categories
Business Technology

ఆర్థిక సాయం అక్కర్లేదు : టెలికంలకు రుణాలు చెల్లించే సత్తా ఉంది.. జియో లేఖ

రుణభారంతో కుంగిపోయిన టెలికం కంపెనీలు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను బిలియనీర్ ముఖేశ్ అంబానీ టెలికం సంస్థ రిలయన్స్ జియో తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల వ్యవధిలో బాధిత టెలికం కంపెనీలు బకాయిలను తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సిందేనని జియో నొక్కి చెప్పింది. కోర్టు ఆదేశాలనుసారం టెలికం కంపెనీలు తమ బకాయిలను సౌకర్యవంతంగా చెల్లించగల సామర్థ్యం ఉందని జియో స్పష్టం చేసింది.

ఈ మేరకు గురువారం (అక్టోబర్ 31, 2019) టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు జియో లేఖ రాసింది. టెలికం పరిశ్రమలో ఇద్దరు ఆపరేటర్లు విఫలమైనంత మాత్రాన మొత్తం టెలికం రంగంపై ప్రభావం పడిందనడం సరికాదని జియో గట్టిగా వాదించింది. సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) మంత్రికి లేఖ రాసిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇండస్ట్రీ బాడీ అనడాన్ని జియో తప్పుబట్టింది. 

ప్రస్తుత టెలికం ఆపరేటర్లు ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని, తమ వైఫల్యాలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయని రిలయన్స్ జియో విమర్శించింది. ఈ క్రమంలో టెలికం రంగంలో ఆర్థిక సంక్షోభంపై COAI మంత్రి రవిశంకర్ కు రాసిన లేఖలో జియో స్పందనను ప్రస్తావించలేదు. సర్దుబాటు స్థూల రాబడి (AGR)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై COAI తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది పరిశ్రమ మరింత పెట్టుబడులు పెట్టగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. సేవా నాణ్యత క్షీణతకు దారితీస్తుందని, గుత్తాధిపత్యం, ప్రభుత్వ కార్యక్రమాలను దెబ్బతీస్తుందని తెలిపింది. దీనిపై మంత్రి రవిశంఖర్‌కు జియో లేఖ రాసింది.

తమ అభిప్రాయం కోసం ఎదురుచూడకుండా ‘అనవసరమైన తొందరపాటుతో సమర్పించిన COAI లేఖ’ అంటూ ఏ ఒక వాదనతో కూడా ఏకీభవించదని తెలిపింది. రిలయన్స్ జియో తన అభిప్రాయాల కోసం వేచి ఉండమని COAIను కోరినప్పటికీ అలా చేయలేదని మంత్రికి రాసిన లేఖలో జియో పేర్కొంది. 
Jio Letter