Categories
Hyderabad

జనసేనలో చీలిక: కొత్తగా పార్టీ పెట్టిన నాయకుడు

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించింది. నవ శాఖానికి నాంధి పలుకుతూ “జన శంఖారావం” పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం చతికిల పడుతున్న తరుణంలో నూతన పార్టీ పెట్టారు. జన శంఖారావం పేరుతో వెనుకబడ్డ వర్గాల ఆత్మాభిమానం, అభివృద్ధి, ఆకాంక్షల కొరకు పార్టీ స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ.

స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా వెనుక బడ్డ వర్గాల వారికి పదవులను నామమాత్రంగానే ఇచ్చారంటూ ఈ మేరకు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. విద్య, ఉద్యోగ, రాజకీయంగా వెనుక బడిన వర్గాలను పాలక వర్గం కోటాకే పరిమితం చేస్తుందన్నారు. దేశ ఉన్నతిని కోరుకుని ముందడుగు వేసే వెనుకబడ్డ పౌరులకు జన శంఖారావం పార్టీ వేదికగా నిలుస్తుందని యువతను ఆహ్వానించారు. 

Jana Sankaravam Party

పత్రికా ప్రకటనలో పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ.  పార్టీ ఉపాధ్యకుడిగా వినోద్ ఖన్నా యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా కంటేకర్ రాంజీ , కోశాధికారిగా బి.నాగరాజు గుప్తా, ఉమ్మడి కార్యదర్శిగా ఎ. గణేష్ రెడ్డి, నిర్వహరణ కార్యదర్శులుగా జి.సాయి కిషోర్, ఎం. రవి ముదిరాజ్, కార్యనిర్వాహకులు – జె.అవినాష్(చింటు), ఎస్. శ్రీ శైలం యాదవ్ పేర్లను పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

గతంలో పర్దిపూర్ నర్సింహ ప్రజారాజ్యం, జనసేన పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడిగా ఇరు రాష్ట్రాల్లో పేరు పొందారు జన శంఖారావం పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ. తెలంగాణలో వెనుకబడ్డ వర్గాల ఉనికిని చాటేందుకే పార్టీ స్థాపించారంటూ అనుచరులు చెబుతున్నారు. 

Categories
Crime International

ఈ రికార్డు కూడా ట్రంప్ దే…మొదటిసారి దేశభక్తి చట్టం ప్రయోగించిన అమెరికా

మొదటిసారిగా అమెరికా…దేశభక్తి చట్టంను ఉపయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. కేవలం విదేశీయులకే వర్తించే ఈ చట్టాన్ని అమెరికాపై ఒసామా బిన్‌ లాడెన్‌ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001, అక్టోబర్‌ 26వ తేదీన అమెరికా పార్లమెంట్‌ ఆమోదించింది.

టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్‌ అమీన్‌ హసౌన్ అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన ఆదమ్‌ కు 2017లోనే శిక్షాకాలం పూర్తయింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన్ని విడుదల చేయకుండా, ఎలాంటి విచారణ లేకుండానే జీవితాంతం జైల్లో నిర్బంధించేందుకు ‘దేశభక్తి చట్టం’ను ప్రయోగించారు. ఈ విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లెబనాన్‌కు చెందిన ఆదమ్‌ నుఅక్రమ వలస కేసులోమొదటిసారి 2002, జూన్‌లో అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం ప్రకటించాక ఎక్కువ సార్లు ఆదమ్‌ కటకటాల వెనక్కే ఉన్నారు. వాస్తవంగా ఆయన ప్రత్యక్షంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కానీ టెర్రరిస్టు కార్యకలాపాలకు మద్దతిస్తున్న పలు ముస్లిం చారిటీ సంస్థలకు భారీగా విరాళాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ చారిటీ సంస్థలను కూడా అమెరికా నిషేధించింది. 2017లో ఆదమ్‌ శిక్షాకాలం పూర్తయ్యాక ఆయన పుట్టిన లెబనాన్‌ గానీ, పెరిగిన పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ గానీ శరణార్థిగా తీసుకునేందుకు తిరస్కరించడంతో జాతీయ భద్రతా దృష్ట్యా ఆయన్ని దేశభక్తి చట్టంలోని 412 సెక్షన్‌ కింద నిర్బంధించారు. 

Categories
Uncategorized

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు ఉత్తర్వులు జారీ

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ( నవంబర్30, 2019) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జగన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు జగనన్న విద్యా దీవెన వర్తిస్తుంది. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని ఉన్నత విద్యలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు కానున్నది.

జగనన్న వసతి దీవెన పథకం కింద పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనున్నది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐకి రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు అందించనున్నారు. డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు వసతి దీవెన సహాయం లభించనుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లోపు ఉన్న పేద కుటుంబాలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన విద్యార్థుల ఎంపిక చేపట్టాలని శాఖలను ఆదేశాలు జారీ చేసింది.
 

Categories
Crime Telangana

ప్రియాంక రెడ్డి కేసు : నిందితుల ఖైదీ నంబర్లు ఇవే

డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నిందితులను తమను అప్పగించాలని, ప్రియాంకకు న్యాయం చేస్తామని..బహిరంగంగా ఉరి వేయాలని డిమాండ్స్ చేశారు.

తీవ్ర ఉద్రిక్తతుల నడుమ..నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులకు ఖైదీ నెంబర్లు కేటాయించారు జైలు అధికారులు. ఏ 1 మహ్మద్‌కు ఖైదీ నెంబర్. 1979, ఏ 2 జొల్లు శివకు ఖైదీ నెంబర్. 1980, ఏ 3 చెన్నకేశవులుకు ఖైదీ నెంబర్. 1981, ఏ 4 నవీన్ కుమార్‌కు ఖైదీ నెంబర్ 1982 కేటాయించారు. 

> 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి నవాబుపేట మండలం కొల్లూరు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఆచూకీ తెలియలేదు.
> నవంబర్ 28వ తేదీ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ దారుణ హత్యకు గురైంది.
> 24వ నేషనల్ హైవే దగ్గర ఓ వంతెన కింద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. 
> హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. 
> నిందితులంతా ప్రియాంకరెడ్డి స్కూటీని పంక్చర్‌ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్‌ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్‌ చేశారు.
> నిందితులు ఏ 1 మహ్మద్‌, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్ కుమార్‌లుగా వెల్లడించారు. 
> 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
> జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. 
> నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపించాయి. 
> చంచల్ గూడకు నిందితులను తరలించాలని నిర్ణయించుకున్నారు. 
> తొలుత అలాగే భావించినా చివరకు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. 
> హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
Read More : ప్రియాంక హత్య కేసు : షాద్ నగర్ టూ చర్లపల్లి.. జైలులో నిందితులు

Categories
Uncategorized

ప్రణయ్ హత్య కేసులో మారుతీ రావు మళ్లీ అరెస్ట్

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకొచ్చిన మారుతీ రావు.. తమ కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే మారుతీరావు తన అనుచరులను ప్రణయ్ ఇంటికి పంపి భయబ్రాంతులకు గురి చేసినట్లు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమృత కూడా కేసు నమోదు చేయడంతో పోలీసులు మారుతీరావును అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.  

కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని అతి దారుణంగా కత్తితో నరికి నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. ఈ కేసులో మారుతీరావు ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ ఏ2గా ఉన్నారు. 

Categories
National

విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్

విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది.

విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి ఇండిగో విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది. ఈ విమానం బెంగళూరులో ఉదయం 5.35 గంటలకు బయలుదేరి ఉదయం 7.05 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 7.45గంటలకు విశాఖపట్నంలో ఇండిగో విమానం బయలుదేరి ఉదయం 9.35 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 
 

Categories
Crime Hyderabad National

మన చట్టాలు ఇంతేనా : రేపిస్టులకు ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలున్నాయో తెలుసా!

మొన్న అసిఫా,నిన్న వరంగల్ లో తొమ్మి నెలల పసిపాపపై,ఈ రోజు ప్రియాంకరెడ్డి ఇలా ఏదో ఒక చోట నుండి మనిషి రూపంలో ఉన్న కామాంధులు,మృగాలు కొందరు అణ్యం పుణ్యం తెలియని,నెలలు నిండని పసిపాపలను కూడా వదలకుండా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అసలు ఇలాంటి వాళ్లను కఠినంగా,త్వరగా శిక్షించే చట్టాలు భారత్ లో లేకపోవడం చాలా దారుణం. దీనికి ఉదాహరణే నిర్భయ దోషులకు ఇప్పటికి కూడా మరణశిక్ష అమలుకాకపోవడం. 

అసలు ప్రపంచంలో వివిధ దేశాల్లో రేప్ చేస్తే శిక్షలు ఎలా అమలుచేస్తారు,రేపిస్టులను ఎలా శిక్షిస్తారో ఒకసారి చూద్దాం.
1. చైనా
పొరుగు దేశం చైనాలో రేప్ చేసినట్లు విచారణలో తేలితే…నిందితులను రోజుల్లోనే తుపాకీతో కాల్చి చంపేస్తారు.
2. పాకిస్తాన్
ఇక్కడ కూడా రేపిస్టులకు మరణశిక్ష విధిస్తారు. ఇలాంటి ఉరి తీయడంలో కూడా వివిధ పద్దతులు ఉంటాయి. ఒకటి జైలులో ఉరి తీయండం,రెండవది బాధితురాలకి జరిగిన నష్టం తీవ్రంగా ఉంటే బహిరంగంగా ఉరితీయడం.
3.సౌదీ అరేబియా
ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ నేరాల రేటు చాలా తక్కువ. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే వాళ్లకు బహిరంగంగా శిరచ్ఛేధన శిక్ష అమలు చేస్తారు.
4.ఈజిప్ట్
ఈ దేశంలో రేప్ చేసినట్లు తేలితే ఉరితీస్తారు. చాలా దశాబ్దాల నుంచి ఈజిప్ట్ లో ఈ రూల్ అమల్లో ఉంది.
5.ఆప్గనిస్తాన్
ఇక్కడ రేప్ కేసులు చాలా అరుదు,తక్కువ. రేప్ చేసి దొరికిన నాలుగు రోజుల్లోనే కాల్చి చంపడం,లేదా ఉరితీస్తారు.
6.ఇరాన్
ఈ దేశంలో కూడా రేపిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. రేపిస్టులకు మరణమే శిక్ష. రేపిస్టులను అందరిముందు బహిరంగంగా ఉరి తీస్తారు.
7.ఉత్తరకొరియా
కఠినమైన రూల్స్ కి కేరాఫ్ అడ్రస్ ఉత్తర కొరియా. ఇక్కడ అత్యాచారానికి పాల్పడిన వాళ్లను ఫైర్ స్క్వాడ్ కంటిన్యూగా ఫైర్ చేసి చంపిస్తారు.
8.అమెరికా
ఈ దేశంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. ఒకటి స్టేట్ చట్టం. రెండవది ఫెడరల్ చట్టం. స్టేట్ చట్టం ప్రకారం రేప్ చేసినవాళ్లకు 15-30ఏళ్ల వరకు జైలుశిక్ష. ఫెడరల్ లా అయితే లైఫ్ టర్మ్ మొత్తం జైలుశిక్ష.
 

Categories
Hyderabad

ప్రియాంక రెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్

పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డిని కిరాతకంగా పశువులాగా హత్య చేసిన మహ్మద్‌ ఆరిఫ్‌ పని చేసే లారీ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి దగ్గర ప్రధాన నిందితుడు ఏ1 మహ్మద్‌ ఆరిఫ్‌ లారీ డ్రైవర్‌గా పనిచేయగా.. మహ్మద్ గురించిన సమాచారం మరింత తెలుసుకునేందుకు అతనిని అరెస్ట్ చేశారు.

భారీ ఉద్రిక్తతల మధ్యలో పోలీసులు హంతకులను చర్లపల్లి జైలుకు తరలించారు. గట్టి బందోబస్తు మధ్య నిందితులను పోలీస్ వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు వాహనాలకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వాహనాలపై రాళ్లు విసరగా కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే నిందితులు గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే నిందితులకు దగ్గర వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Categories
Hyderabad

ఆ మృగాళ్లను చంపి జైలుకెళ్తా : పూనంకౌర్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆ మృగాళ్లను చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితులను చంపేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. ఆ మృగాళ్లను చంపేయాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని తెలిపారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ మృగాళ్లు జైలు శిక్ష అనుభవించిడం సరికాదని, వారిని చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. 

నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని..ఇక్కడ మతమనేది సమస్య కాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ జనారణ్యంలోనే కొందరు అతిభయంకరంగా ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పుదోవ పట్టించద్దని కోరారు. 

మేజిస్ట్రేట్ నిందితులకు 14 జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. భారీ భద్రత నడుమ ఆ నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకముందు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. నిందితులను తమకు అప్పగించాలంటూని నాదాలు చేశారు. స్టేషన్ లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, చెదరగొట్టారు.
 

Categories
Crime National

హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి

కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లోని దక్షిణ సియాచిన్ గ్లేసియర్ సెక్టార్ లో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున  సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన  చోటుచేసుకున్నట్టు శ్రీనగర్ కు చెందిన రక్షణ ప్రతినిధి తెలిపారు.

సమాచారం తెలిసిన వెంటనే అవలాంచీ రెస్క్యూ టీమ్(ART) ఘటనా స్థలికి చేరుకుంది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. హిమపాతంలో గస్తీ బృందం చిక్కుకున్న ప్రాంతాన్ని తొలుత గుర్తించిన సహాయక బృందం దట్టమైన మంచులో కూరుకుపోయిన సిబ్బందిని వెలికి తీశారు. అప్పటికే ఇద్దరు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, సురక్షితంగా వెలికి తీసిన మిగిలినవారిని హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ బేస్ క్యాంప్‌ కు ట్రీట్మెంట్ కోసం తరలించినట్లు ఆయన తెలిపారు.