Categories
National

ముంబై పోలీసుల కొత్త ఐడియా: పూరీ జగన్నాధ్‌కి బాగా నచ్చేసింది

సిగ్నల్‌ ముందు వెయిట్‌ చేసే కార్లన్నీ మోత చేస్తే సిగ్నల్స్‌ గ్రీన్ లోకి మారిపోతాయా? అసలు తోటివాహనాల ఇబ్బందుల్ని గుర్తించకుండా, ట్రాఫిక్‌ రూల్స్‌ని గౌరవించకుండా – మనం ఏదోలా ముందుకి పోవాలనుకోవడం పచ్చి స్వార్థం. అంతేకాదు అనవసరంగా హార్న్‌ కొట్టడం ఎదుటి వాహనాన్ని అవమానపరచడమే! ఏ కారణం లేకుండా వాళ్లు అలా వాహనాన్ని నిలపరు కదా? ఈ మాత్రం ఆలోచన లేకుండా హారన్ సౌండ్లు మ్రోగించేవాళ్లకు ముంబై పోలీసులు చెక్ పెట్టారు. 

అదే డెసిబెల్‌ మీటర్‌ – లింక్డ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌.. ఇప్పుడు ముంబయిలో – ట్రాఫిక్‌లో ఆగిన వాహనాలు సౌండ్‌ చేయకుండా వీలైనంత మౌనంగా ఉండాలి. పదే పదే హార్న్‌ కొట్టకూడదు. కొడితే? ధ్వనికాలుష్యం పెరుగుతుంది. వాహనాలు చేసే ధ్వనికాలుష్యం 85 డెసిబెల్స్‌ దాటిందనుకోండి. సిగ్నల్‌ రిసెట్‌ అయిపోతుంది. అంటే – రెడ్‌ సిగ్నల్‌ 90 సెకన్లు పడాలనుకోండి. రిసెట్‌ అయిపోయి మరో 90 సెకన్ల పాటు… వేచి చూడాల్సిందే! మళ్లీ ధ్వని కాలుష్యం పెరిగితే మళ్లీ రిసెట్‌… ట్రాఫిక్‌ సిగ్నల్‌ గ్రీన్‌లోకి మారడానికి ఇంకా లేట్ అవుతుంది. 
 
ట్రాఫిక్‌లో వాహనాలు నడిపే వ్యక్తులు సహనంగా ఉంటేనే ముందుకు వెళ్లగలరు. ట్రాఫిక్‌‌లో కాస్త ఓపికా సహనం ఉండాలి కదా మరి అంటూ పోలీసులు ఈ ఏర్పాటు చేశారు.  ఈ దెబ్బకి ముంబై ప్రయాణికులు సహనం అలవాటు చేసుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. పైగా సిటీలో ధ్వని కాలుష్యం కూడా తగ్గుతుంది. భలే ఐడియా.  ఈ ఐడియా దర్శకుడు పూరి జగన్నాధ్ కి కూడా తెగ నచ్చేసింది. ఈ మేరకు ఓ వీడియోని తన తన ట్విట్టర్ లో విడుదల చేశాడు. ముంబై పోలీసులను పొగుడుతూ. 
 

Categories
Uncategorized

ప్రధాన మంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తుంది. ఇప్పటికే వేల మందికి ఈ వైరస్ సోకగా.. ఎందరో చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనాలో హెల్త్ ఎమర్జన్సీని కూడా ప్రకటించింది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే చైనాలోని వూహాన్‌ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకులను తిరిగి రప్పించేలా చర్యలు చేపట్టాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. ఆప్టో డిస్ల్పే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎంపికయిన 35 మంది యువకులను శిక్షణ కోసం సంస్థ చైనా పంపడంతో అక్కడే యువకులు శిక్షణ పొందుతున్నారని, వూహాన్‌ సిటీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోండడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని వారిని వెనక్కి తీసుకుని వచ్చేందుకు కృషి చెయ్యాలని సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో కోరారు. వీలైనంత త్వరగా వారిని భారత్‌కు చేర్చేందుకు ఏర్పాట్లు చెయ్యాలని కోరారు.
 

Categories
National

ఉరి అమలు వాయిదాపై సీఎం అసహనం

నూరు మంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ప్రాధమిక న్యాయసూత్రం.. నేరస్తులకు అస్త్రంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు నిర్భయ దోషుల ఉరికి ఆటంకాలు కలిగిస్తుంది. నిర్భయ దోషులకు యమపాశం దగ్గర కానివ్వకుండా చేస్తుంది. నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు మళ్లీ ఇవాళ(31 జనవరి 2020) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయొద్దంటూ ఆదేశించింది.

చట్టం తెలిస్తే చాలు ఉరి పడకుండా చెయ్యడానికి ఎన్నో లొసుగులు.. ఆ లొసుగులే ఇప్పుడు నిర్భయ దోషులకు రక్షణ కవచంలా మారింది. భారతజాతి మొత్తం ఎదురుచూస్తున్నా కూడా.. ఉరి శిక్ష ఖరారై, ఉరి తాడు పేనడం పూర్తయి, తలారి దొరికి, ఉరి కంబం పిలుస్తున్నా ఉరి మాత్రం అప్పుడే కాదు అంటుంది. అందుకు కారణం చట్టం. ఇదే విషయంపై దేశం యావత్తు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 

లేటెస్ట్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా అసహనం వ్యక్తం చేశారు. చట్టపరంగా ఉన్న లొసుగులు ఉపయోగించుకుని నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తుండడం దారుణమని కేజ్రీవాల్‌ అన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడగా.. అత్యాచార కేసుల్లో దోషులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చట్టాలు సవరించాల్సిన అవసరముందని, దీనిపై సత్వరమే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం కూడా ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడిన వారు మరణశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తుండడంపై చర్చ జరగాలన్నారు.

Categories
National Political

ఓటు వేస్తేనేనా : ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల…బుల్లెట్ రైలులా దేశరాజధానిలో అభివృద్ధి

ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక్షంలో బీజేపీ మెనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ…దేశరాజధానిలో అభివృద్ధిని బుల్లెట్ రైలులా పరుగులు పెట్టిస్తామని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద ఢిల్లీలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని తెలిపారు.  ఎయిర్ పోల్యూషన్ డీల్ చేయడం కోసం 55వేల కోట్లు కేటాయిస్తామన్నారు.

కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలైన ఆయుష్మాన్ భారత్,కిసాన్ సమ్మాన్ నిధి పధకాలను ఢిల్లీలో అమలుచేస్తామని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు. కాలేజీ విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు,స్కూల్ కు వెళ్లే 9,10వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తామని తెలిపారు. ఢిల్లీలో ఎరికైనా ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరుతో బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి ఆ అమ్మాయికి 21సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆ అమ్మాయికి రూ.2లక్షలు వస్తాయని తివారీ తెలిపారు. వ్యాపారాలకు తీవ్రమైన సమస్యగా మారిన సీలింగ్ ప్రాబ్లంకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు.అద్దె నివాసాల్లో ఉంటున్నవారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కొత్త కాలనీ డెవలప్ మెంట్ బోర్టు ఏర్పాటు చేసి కొత్త కాలనీల అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 

మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ఢిల్లీ సీఎం,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ ప్రజలను బీజేపీ మేనిఫెస్టో పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఉచిత కరెంట్,ఉచిత బస్ రైడ్,ఉచిత రక్షిత మంచినీరు ఢిల్లీ వాసులకు ఇవ్వబోమని బీజేపీ మేనిఫెస్టో నిరూపించిందని,బీజేపీకి ఓటు వేస్తేనే ఇవన్నీ ఇస్తామని చెబుతోందని కావున అందరూ ఆలోచించి ఓటు వెయ్యాలని ఓటర్లకు పిలుపునిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Categories
Andhrapradesh

జేసీకి సీఎం జగన్ మరో షాక్ : బస్సుల సీజ్ నుంచి తేరుకోక ముందే

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనంతపురం జిల్లా యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల గడువు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. అక్కడ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడనందునే ఐదేళ్ల గడువును రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు, లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వి తీసి.. రవాణ చేయటంపై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జేసీ బస్సులు సీజ్:
జేసీ బ్రదర్స్‌కు చెందిన బస్సులను ఇటీవలే ప్రభుత్వం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లలో అవకతవకల కారణంగా అధికారులు దాదాపు 36 బస్సులను, అలాగే 18 కాంట్రాక్టు బస్సులను సీజ్ చేశారు. పర్మిట్లలో అవకతవకలకు తోడు నిబంధనలకు విరుద్దంగా బస్సులు నడుస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని అప్పట్లో రవాణా శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం,టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచడం వంటి అంశాలపై తమకు ఫిర్యాదులు అందినట్టు చెప్పారు. జేసీ బ్రదర్స్ కు ఇది పెద్ద దెబ్బ. బస్సులు సీజ్ చేయడంతో బాగా నష్టపోయారు. దీన్ని నుంచి కోలుకోక ముందే జగన్ సర్కార్ జేసీకి మరో గట్టి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

జగన్ ప్రతీకారం తీర్చుకుంటున్నారా?
సిమెంట్ ప్లాంట్ నిర్మాణం పేరుతో మైనింగ్ లైసెన్సులు పొంది, ఖనిజాన్ని వేరే వాళ్లకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు జేసీపై ఉన్నాయి. దానిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఆలస్యం కారణంగా లీజును రద్దు చేయడం సరికాదని జేసీ అనుచరులు అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. బస్సులను సీజ్ చేసిన సమయంలోనూ జేసీ తీవ్రంగా స్పందించారు. కేసుల గొడవ కంటే కొంతకాలం ట్రావెల్స్ బిజినెస్ ఆపేయడమే మేలని అన్నారు. ప్రతీకారంతోనే జగన్ ప్రభుత్వం ఇదంతా చేస్తోందని జేసీ ఆరోపించారు. తాజాగా సిమెంట్ కంపెనీ లీజుని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జేసీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Categories
National

బడ్జెట్ 2020లో రైతుల కోసం కొత్త పథకాలు ఇవే!

బడ్జెట్ 2020కి మోడీ సర్కార్ రెడీ అయింది. మరికొన్ని గంటల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్ లో చదవి వినిపించనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే శనివారం(ఫిబ్రవరి-1,2020)పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2020లో రైతలు రెండు కీలక పథకాలను ప్రకటించే అవకాశముంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకాల విషయానికి వస్తే.. వీటిల్లో ఒకటి కార్ప్ డైవర్సిఫికేషన్ (భిన్నమైన పంటలు)కు సంబంధించిన స్కీమ్, మరొకటి ఎఫ్‌పీవో ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించే పథకం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో) ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీవో కార్యక్రమానికి రూ.7,000 కోట్లు కేటాయించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. దీని వల్ల 10 వేల వరకు ఎఫ్‌పీవోల ఏర్పాటు సాధ్యం కావొచ్చు. ఎఫ్‌పీవోల్లోని చిన్న, సన్నకారు రైతుల గ్రూప్‌‌లు రైతుల ఆదాయం పెరగుదలకు సాయం అందిస్తారు. మార్కెట్ యాక్సెస్ మరియు సామూహిక బేరసారాల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోడానికి ఎఫ్‌పిఓలు సహాయం చేస్తాయి. ఎఫ్‌పీవోలు బిజినెస్ యూనిట్లుగా పనిచేస్తాయి. వీటికి వచ్చే లాభాలు.. ఆ గ్రూప్‌లోని సభ్యులే తీసుకుంటారు. వ్యవసాయ మంత్రత్వి శాఖ ఎఫ్‌పీవోలకు నిధులకు సమకూరుస్తుంది. అలాగే  ఏమైనా టెక్నాలజీ పరమైన అవసరాలు ఉంటే.. వాటికి కూడా తీరుస్తుంది. 

మరొకటి కార్ప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్‌ను కూడా రేప్ బడ్జెట్ సందర్భంగా కేంద్రం లాంచ్ చేయొచ్చు. దీని కోసం రూ.500 నుంచి రూ.600 కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. నేలను సారవంతంగా మార్చడం, వ్యవసాయ-పర్యావరణ సమతుల్యత అనే అంశాలు ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా ఉండనున్నాయి. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చు. 

Categories
Andhrapradesh Crime Telangana

ఫ్రెండ్స్ ముందు టీచర్ మందలించాడని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

వారంతా విద్యార్థులు. వారిది ఎంతో ఉజ్వల భవిష్యత్‌. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. జీవితం అన్నాక సమస్యలు కామన్‌. కాస్త ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారమూ దొరుకుతుంది. కానీ కొందరు విద్యార్థులు.. సమస్యకు చావే పరిష్కారమంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉరేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఓ విద్యార్థి ఘటన మరవకముందే మరో విద్యార్థి ఘటన వెలుగులోకి వస్తుండటం కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుల వేధింపులంటూ కొందరు.. ప్రేమ వేధింపులంటూ మరికొందరు.. పేరెంట్స్‌ మందలించారని ఇంకొందరు.. ఇలా ఏదో ఒక కారణంతో స్టూడెంట్స్‌ మృత్యుబాట పడుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో… ఉరి తాడును పట్టుకుంటున్నారు. సమస్యకు చావే శరణ్యమంటూ ఆ ఉరి తాడుకు వేలాడుతున్నారు.

తోటి విద్యార్థుల ముందు మందలించారని సూసైడ్:
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులోని ఓ స్కూల్‌ లో 10వ తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో వెనకబడిపోయాడనే కారణంతో టెన్త్‌ చదివే బాలుడిని..సదరు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల ముందు మందలించారు. స్టడీ అవర్‌ పేరుతో రాత్రి, పగలు తేడా లేకుండా స్కూల్‌ లోనే ఉంచి చదివించారు. దాంతో మనస్థాపానికి గురైన బాలుడు స్కూల్లో అందరూ పడుకున్న సమయం చూసి తరగతి గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాలేజీ ప్రాంగణంలో ఆత్మహత్య:
ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఈ ఘటనకు ఒక్క రోజు ముందు ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నూజివీడు సిద్ధార్థ కాలేజీలో బీఫార్మసీ సెకండియర్ చదువుతున్న శైలజ..గురువారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ…తన ఆత్మహత్య గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయోద్దని సూసైడ్‌ లెటర్‌ రాసి బలవన్మరణానికి పాల్పడింది. వీరిద్దరే కాదు పలు కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతునే ఉన్నారు.

కష్టాలు లేని మనుషులు ఉండరు. సమస్యలు లేని కుటుంబాలు లేవు. మనుషులకే కాదు, ఈ భూమ్మీద సమస్త జీవరాశులూ కష్టాలు, బాధలు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల వాతావరణంలోనూ బతకడం ఎలాగో తెలుసుకుంటున్నాయి. తమ పిల్లలకూ నేర్పిస్తున్నాయి. కానీ మనిషి మాత్రమే వాటికి జడిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. చిన్న కష్టానికి, సమస్యకూ ఆత్మహత్యే పరిష్కారమని పొరబడుతున్నారు. 

జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. ఇకనైనా హత్య, ఆత్మహత్యలకు పాల్పడే ముందు మిమ్మల్ని నమ్ముకున్న వారి గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్ల ముందే కనిపిస్తుంది.

Categories
Andhrapradesh Crime

దారి తప్పిన గురువు : క్లాస్ రూమ్ లో లైంగిక వేధింపులు

వారంతా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు. వారి పని ఆ విద్యను విద్యార్థులకు పంచడం. ఆ విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం. అలాంటి వ్యక్తులు కొందరు కీచకుల్లాగా

వారంతా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు. వారి పని ఆ విద్యను విద్యార్థులకు పంచడం. ఆ విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం. అలాంటి వ్యక్తులు కొందరు కీచకుల్లాగా మారుతున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సింది పోయి..దారి తప్పుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కీచకుల్లాగా మారుతున్నారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠాలకు బదులు ప్రేమ పాఠాలు బోధిస్తున్నారు. 

ఆరు బయటే అనుకుంటే..చివరకు గుడి లాంటి బడిలో కూడా బాలికలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దేవుడిలా భావించే కొందరు గురువులు మృగాళ్లుగా మారుతున్నారు. అభం శుభం తెలియని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి చేష్టలతో భయాందోళనకు గురిచేస్తున్నారు. తరగతి గదుల్లో చదువు చెప్పాల్సింది పోయి..ప్రేమ పాఠాలు బోధిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి ఓ కీచక టీచర్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడే విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.

రాజోలు మండలం బి.సావరంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తీరు వివాదానికి దారితీసింది. విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సిన టీచర్ కామాంధుడిగా మారాడు. విద్యార్థులు చెడు మార్గాలు పట్టకుండా చూడాల్సిన వాడే చెడు మార్గం ఎంచుకున్నాడు. బాలికలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేయబోయాడు. ప్రేమ పాఠాలు భోదిస్తూ…విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. 

ఇతడి కీచక పర్వం కొన్నాళ్లుగా సాగుతున్నా…బాధిత బాలికలెవ్వరూ భయంతో బయటపెట్టలేకపోయారు. కొందరు బాలికలు ధైర్యంతో ముందుకురావడంతో కీచకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ఆ కీచక ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Categories
Health International Life Style

యుకే, రష్యాలో రెడ్ అలర్ట్.. 10వేలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ నుంచి మొదలైన వైరస్ వ్యాప్తి యుకే, రష్యాలకు పాకింది. దీంతో ఆయా దేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూకే, రష్యాలో శుక్రవారం (జనవరి 31, 2020) తొలి నోవల్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు యూఎస్, జపాన్ దేశాలు తమ పౌరులను చైనాకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. చైనీస్ దేశీయులకు మాస్కో క్రిమ్లిన్ వర్క్ వీసాలను తాత్కాలికంగా బ్యాన్ విధించే అవకాశం ఉంది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో యూరోప్, ఆసియాలోని స్టాక్స్ మార్కెట్లతో పాటు యూఎస్ ఫ్యూచర్లు కూడా పతనమయ్యాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గురువారమే గ్లోబల్ హెల్త్ ఎమర్జెనీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9,950కు పైగా నమోదు అయ్యాయి. గతంలో SARS వైరస్ (అంటువ్యాధి) మహామ్మారి ప్రబలిన సమయంలో నమోదైన కేసుల కంటే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయినట్టు అధికారికంగా నివేదించాయి. జర్మనీలోని మునీచ్ సమీపంలో ఆటో పార్టస్ సప్లయిర్ ఆరో వ్యక్తికి కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. ఒక చిన్నారికి ఆమె తండ్రి నుంచి వైరస్ సోకడంతో మరో కొత్త కేసు నమోదైందని బవేరియన్ హెల్త్ అధికారులు తెలిపారు.

రష్యాలో రెండు కేసులు :
ఇద్దరు చైనీ దేశీయులకు కరోనా సోకడంతో వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు డిప్యూటీ ప్రధాని తాత్యానా గొలికోవా తెలిపారు. క్రిమ్లిన్ వర్క్ వీసాలపై తాత్కాలి నిషేధం విధించింది. మంగోలియా-రష్యా సరిహద్దులో నుంచి వచ్చే చైనీయులకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. చైనాకు వెళ్లే విమాన సర్వీసులను కూడా నిలిపివేసినట్టు రష్యా తెలిపింది.

ఇటలీలో ఎమర్జెనీ ప్రకటన :
ఇటలీ కేబినెట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. తమ దేశంలోని రాష్ట్రాల్లో వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. ఇద్దరు చైనా దేశీయులకు కరోనా వైరస్ సోకడంతో వారికి రోమ్ నగరంలోని ప్రత్యేక ప్రదేశంలో చికిత్స అందిస్తోంది. తమ దేశానికి వచ్చిన 18 మంది పర్యాటకులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు.

సింగపూర్, వియత్నాం, పాకిస్థాన్ లో ట్రావెల్ ఆంక్షలు జారీ :
కరోనా వైరస్ ప్రభావంతో చైనీయులకు సింగపూర్ ఎంట్రీ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చేశాయి. వియత్నాంలో కూడా ఇదే తరహాలో వీసాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చైనీస్ పర్యాటల వీసాల జారీని నిలిపివేశాయి. మరోవైపు పాకిస్థాన్ కూడా చైనా నుంచి వచ్చే పోయే అన్ని డైరెక్ట్ విమాన సర్వీసులను ఫిబ్రవరి 2 వరకు నిలిపివేసింది. చైనాతో ఉత్తర సరిహద్దులోని ఎంట్రీని కూడా మూసివేసేందుకు ప్లాన్ చేస్తోంది.

యూకేలో రెండు కేసులు నమోదు :
ఇంగ్లండ్ లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిగా అక్కడి అధికారులు వెల్లడించారు. వీరిద్దరికి కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూ క్యాస్టిల్ లోని స్పెషలిస్టు కేర్ లో ఆ ఇద్దరు రోగులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

ఇప్పటికే తమ దేశంలో కొత్త కరోనా వైరస్ తో మరణాల రేటు 2శాతంగా ఉందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ తెలిపారు. మరోవైప వుహాన్ నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని యూకే ప్రభుత్వం తెలిపింది. చైనా నుంచి వైరస్ లక్షణాలతో వచ్చినవారిని దూరంగా ఉంచి 14 రోజుల పాటు వారి ఆర్యోగ పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.

మార్చి 2 వరకు హాంగ్ కాంగ్ స్కూళ్లు మూసివేత :
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో హాంగ్ కాంగ్ లో మార్చి 2 వరకు స్కూల్ సెలవులను పొడిగించారు. కరోనా వ్యాప్తి పరిస్థితిని బట్టి అక్కడి స్కూళ్లను తెరవనున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్యారీ లామ్ తెలిపారు. హుబేయ్ ప్రావెన్స్ నుంచి వచ్చిన పర్యాటకులను అక్కడి ప్రభుత్వం స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. వైరస్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించి పర్యవేక్షించనుంది. చైనాతో హాంగ్ కాంగ్ సరిహద్దుల్లో లామ్ ను మరోసారి మూసివేశారు.

యూఎస్ వృద్ధిపై ప్రభావం : పడిపోయిన గోల్డ్ మ్యాన్ ఎగుమతులు
కరోనా వైరస్ ప్రభావంతో అమెరికాలోని ఆర్థిక వృద్ధి తొలి త్రైమాసికంలో 0.4 శాతానికి పడిపోయింది. చైనా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యను నిరాకరించడం, ఎగుమతులు నెమ్మదించినట్టు గోల్డ్ మ్యాన్ సాచ్ గ్రూపు ఇంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా వదలిరావాలని అమెరికన్లకు యూఎస్ పిలుపు :
కరోనా వైరస్ వ్యాప్తితో చైనాకు ట్రావెల్ చేయొద్దని అమెరికన్లను యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. ప్రస్తుతం చైనాలోని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం లెవల్ 4 ఉండగా, రవాణా సౌకర్యాల కేటగిరీపై హెచ్చరికలు జారీ చేసింది. చైనా సహా ఇతర దేశాల్లో నార్త్ కొరియా, వెనిజులా, ఇరాన్, ఇరాక్, సోమాలియా పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా యుఎస్ ఒక అడ్వైజరీ జారీ చేసింది.

గ్లోబల్ వైరస్ కేసుల్లో SARS కంటే కరోనా ఎక్కువ :
గ్లోబల్ వైరస్ కేసుల్లో ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు 9,950 కు చేరింది. అప్పట్లో SARS వైరస్ కేసుల కంటే ఇప్పుడు కరోనా కేసులే టాప్. 2003లో సార్స్ కేసుల సంఖ్య 8,096 గా అధికారిక రిపోర్టులో తెలిపినట్టు WHO తెలిపింది.

Categories
Movies

RGV (ఒక సైకో బయోపిక్) – టైటిల్ రిజెక్ట్

‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ టైటిల్‌ తిరస్కరించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు నిత్యం ఏదో ఒక వివాదంలో వినబడుతూనే ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని వివాదంగా మార్చడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య.. ఇటీవల ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో నానా రచ్చ చేసిన వర్మ గతకొద్ది రోజులుగా సైలెంట్‌గానే ఉంటున్నాడు.

ఇప్పుడు వర్మ పేరు తెరమీదకి ఎందుకు వచ్చిందంటే.. ‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ అనే టైటిల్‌తో సినిమా తీయడానికి తెలుగు ఫిలిం ఛాంబర్ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

‘‘RGV (ఒక సైకో బయోపిక్)’’ టైటిల్‌తో సినిమా తీయడానికి ఆ పేరు ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ పేరు కావడం చేత వీలు పడదని, టైటిల్ ఆమోదం పొందాలంటే రామ్ గోపాల్ వర్మ దగ్గరినుండి NOC (No Objection Certificate) తీసుకోవాలని, దానిని ఛాంబర్ వారికి అందించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో వర్మ పేరుకున్న పవర్ ఏంటనేది తెలిసింది అంటున్నారు RGV ఏకలవ్య శిష్యులు.