Categories
Andhrapradesh

ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు..ఇవాళ ఒక్కరోజే 21 మందికి పాజిటివ్‌ 

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 కరోనా కేసుల్లో 18 కేసుల్లో మర్కజ్‌ సదస్సుకు వెళ్లివచ్చినవారే ఉన్నారు. విశాఖలో ఇవాళ ఒక్కరోజే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు మర్కజ్‌ సదస్సులో పాల్గొన్నవారిగా గుర్తించారు. 

ఈ మేరకు మంగళవారం (మార్చి 31, 2020) రాష్ట్ర నోడల్‌ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత మొత్తం 256 శాంపిళ్లను పరీక్షించగా 21 కరోనా పాజిటివ్‌, 235 కరోనా నెగిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు కోలుకున్నట్టు చెప్పారు.

బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. తాజాగా పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన బాలుడి కరోనా పాజిటివ్ వచ్చింది.

నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23. ఆ సంఖ్య కాస్త ఒక్కసారిగా 40కి పెరగడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలోని ప్రకాశం – 11, విశాఖపట్నం – 10, గుంటూరు -9, కృష్ణా -5, తూర్పు గోదావరి -4, అనంతపురం-2, చిత్తూరు -1, నెల్లూరు -1, కర్నూలు-1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.   

Also Read | భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోవడం బాధగా ఉంది… కానీ లాక్‌డౌన్‌ చాలా ముఖ్యం : మంచు విష్ణు

Categories
Movies

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోవడం బాధగా ఉంది… కానీ లాక్‌డౌన్‌ చాలా ముఖ్యం : మంచు విష్ణు

కరోనా వైరస్ భయాందోళనలతో పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్‌, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ భయాందోళనలతో పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడున్న వారు అక్కడికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. విదేశాల్లో ఉన్నవారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్‌, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి మంచు విష్ణు మంగళవారం (మార్చి 31, 2020) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. 

విరానికను, పిల్లలను చాలా మిస్సవుతున్నానని, చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే చాలా మంది బాధ అనుభవిస్తూ ఉండొచ్చు.. కానీ లాక్‌డౌన్‌ అనేది చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ పాటించి.. కరోనాను ఆరికట్టేందుకు మద్దతుగా నిలవాలని కోరారు. కాగా, ఆ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో విష్ణు కళ్లలో నీళ్లు తిరగడం చూస్తే.. ఆయన ఎంత బాధ పడుతున్నారో అర్థమవుతుంది. 

‘నేను ఎందుకు గడ్డం పెంచుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. అది కొంతమందికి నచ్చుతుంది.. ఇంకొందరికి నచ్చడం లేదు. ఎందుకు పెంచుతున్నానంటే ఓ కారణం వల్ల పెంచుతున్నాను. నా భార్య, పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డం తీస్తాను. ఫిబ్రవరి చివరి వారంలో మా ఫ్యామిలీ మెంబర్‌కు ఆరోగ్యం బాగోలేక సర్జరీ కోసం వేరే దేశానికి వెళ్లాం. అందరం వెళ్లాం. దేవుడి దయ వల్ల సర్జరీ బాగా జరిగింది. 

అయితే మార్చి 19న నాన్నగారి పుట్టినరోజు, విద్యానికేతన్‌లో వార్షికోత్సవం ఉండటంతో.. మార్చి 11న నేను, నాన్న, అమ్మ ఇక్కడికి వచ్చేశాం. పిల్లలు, విరానిక ఇంకో నాలుగైదు రోజుల్లో వచ్చేయాలి. అయితే మేము వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోవడంతో విద్యానికేతన్ వార్షికోత్సవం క్యాన్సల్‌ చేశాం. వాళ్లు ఉన్న దేశంలో కూడా సందర్శకులను అనుమతించకుండా ఆపేశారు. దాని తర్వాత మన దగ్గర కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేశారు.

ఏప్రిల్‌ 14న ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ అనుమతిస్తారని అనుకుంటున్నాను. గత ఏడేళ్లుగా అరి, వివి పుట్టాకా.. నేను వేరే ఊరికి పనిమీద వెళ్లిన సాయంత్రానికి వచ్చేవాడిని.. ఎందుకంటే పిల్లలతో గడపాలని. వాళ్లతో నాకు అటాచ్‌మెంట్‌ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు బాగా కష్టంగా ఉంది. మేము అంతా ఒకే దగ్గర క్వారంటైన్‌లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ.. చాలా బాధగా ఉంది. వాళ్లను చాలా మిస్సవుతున్నాను. నాలాగే చాలా మంది ఈ రకమైన బాధ అనుభవిస్తూ ఉండొచ్చు.. కానీ లాక్‌డౌన్‌ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు దీనిని పాటించాలి. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌కు మద్దతుగా నిలవాలి. ధైర్యంగా ఉండండి’ అని మంచు విష్ణు అన్నారు. 
 

Also Read | వుహాన్ లో కరోనాతో ఎంత మంది చనిపోయారో తెలుసా? 

Categories
International

వుహాన్ లో కరోనాతో ఎంత మంది చనిపోయారో తెలుసా? 

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది. కానీ ఆ మ‌ర‌ణాల రేటుపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వైర‌స్ కేంద్ర బిందువైన వుహాన్ న‌గ‌రం రెండు నెల‌ల లాక్‌డౌన్ త‌ర్వాత మ‌ళ్లీ తెరుచుకున్న‌ది. అయితే వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన వారి చితాభ‌స్మం కోసం కుటుంబ‌స‌భ్యులు స్మ‌శాన‌వాటిక‌ల వ‌ద్ద క్యూలైన్లు క‌డుతున్నారు. దీంతో కొన్ని షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌వుతున్నాయి. గ‌తం వారం వుహాన్‌లో సుమారు 5వేల మందికి చితాభ‌స్మాల‌ను అంద‌జేశారు.

తమవారి చితాభస్మం కోసం స్మ‌శాన‌వాటిక‌ల‌కు వెళ్తున్న ప్ర‌జ‌లు
వుహాన్‌లో మొత్తం 8 స్మ‌శాన‌వాటిక‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆంక్ష‌లు ఎత్తివేయ‌డంతో వుహాన్‌లో ప్ర‌జ‌లు స్మ‌శాన‌వాటిక‌ల‌కు వెళ్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆరున్న‌ర గంట‌ల పాటు కూడా త‌మ‌వారి చితాభ‌స్మం కోసం ఎదురుచూడాల్సి వ‌స్తున్న‌ది. ప్ర‌తి రోజూ 3500 చితాభ‌స్మాల‌ను అంద‌జేస్తామ‌ని అధికారులు ఇప్ప‌టికే చెప్పారు. ఏప్రిల్ 5 వ‌ర‌కు ఈ ప్ర‌క్రియ ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ ఈ విధానం రోజూ జ‌రిగితే, దాన్ని బ‌ట్టి  వుహాన్ మృతుల సంఖ్య‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. చైనాకు చెందిన కైక్సిన్ అనే ప‌త్రిక స్మ‌శాన‌వాటిక‌ల్లో ఉన్న చితాభ‌స్మాల ఫోటోల‌ను ప్ర‌చురించింది. 

ప్ర‌తి రోజూ ఒక్కొక్క స్మ‌శాన‌వాటిక‌ల్లో 220 ద‌హ‌నాలు 
మ‌హ‌మ్మారి వ్యాపించిన త‌ర్వాత ప్ర‌తి రోజూ ఒక్కొక్క స్మ‌శాన‌వాటిక‌ల్లో 220 ద‌హ‌నాలు జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  8 స్మ‌శాన‌వాటిక‌ల్లో మొత్తం 84 ఫ‌ర్నేస్‌లు ఉన్నాయి. ఈర‌కంగా 1560 మందిని రోజూ ద‌హ‌నం చేసి ఉంటార‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. చైనాలో పుట్టి, అమెరికాలో బ్లాగ్ ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్న జెన్నిఫ‌ర్ జెంగ్ త‌న ట్విట్ట‌ర్‌లో కొన్ని భ‌యాన‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. చితాభ‌స్మాల‌ను అంద‌జేస్తున్న ప్ర‌క్రియ‌ను ప‌రిశీలిస్తే, వుహాన్‌లో 59 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆమె అంచ‌నా వేశారు. చైనా దేశ‌వ్యాప్తంగా ఆ సంఖ్య 97 వేలు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక వైర‌స్ ప‌ది ల‌క్ష‌ల మందికిపైనే సోకి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 
 

Also Read | కరోనా ఎఫెక్ట్…పారిశ్రామిక రంగం కోసం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

Categories
National Political

కరోనా ఎఫెక్ట్…పారిశ్రామిక రంగం కోసం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం

కరోనా వైరస్(కోవిడ్ -19)దేశంలోని పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత వారం కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో ప్యాకేజీని రెడీ చేస్తున్నట్లు సామాచారం. త్వరలోనే ఈ ప్యాకేజీ గురించి ఆర్థికమంత్రి ప్రకటించే అవకాశముంది. కరోనా కారణంగా పేదలు,కూలీలుతో పాటు పారిశ్రామిక రంగం(ఇండస్ట్రీ సెక్టార్)పై గట్టి దెబ్బ పడింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఇ), సేవలు మరియు ఎగుమతులపై. దీంతో పరిశ్రమ రంగాలకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు… రెండవ ఆర్థిక రిలీఫ్ ప్యాకేజీని కేంద్రం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ ప్రభావాన్ని పరిష్కరించడానికి కొన్ని ముఖ్య ఆర్థిక రంగాలకు మద్దతు ఇవ్వడంతో పాటు అత్యవసరంగా అవసరమయ్యే ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడానికి అపూర్వమైన ప్యాకేజీ కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఇది వర్కవుట్ అవుతోందని, త్వరలో ప్రకటించబడుతుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. కొన్ని రంగాలకు సెలక్ట్ ట్యాక్స్ పేమెంట్స్ పై మారటోరియం(తాత్కాలిక నిషేధం), దిగుమతి మరియు ఎగుమతి సుంకాలను తగ్గించడం,బకాయిలు మరియు ఫీజుల చెల్లింపులో సడలింపు మరియు ఎగుమతులకు అదనపు వడ్డీ ఉపసంహరణ వంటివి కొన్ని ప్రభుత్వం పరిగణిస్తున్న వాటిలో ఉన్నాయి. 

కొన్ని షరుతులు సులభం అయ్యే అవకాశం
ఎగుమతులకు పనితీరు-అనుసంధాన(performance-linked) ప్రోత్సాహకాల కోసం షరతులు సడలించే అవకాశం కూడా ఉందని మరో ప్రభుత్వ అధికారి తెలిపారు. మార్చి 25 న ప్రారంభమైన 21 రోజుల లాక్‌డౌన్ వల్ల ఎగుమతులు, రిటైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు చాలా సేవా రంగాలు – విమానయానం, ఆతిథ్యం, ​​ఆహారం, ప్రయాణం మరియు పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నాయి. ఇది ఎక్కువగా ప్రభావితమైన రంగాలకు లక్ష్యంగా ఉన్న ప్యాకేజీ అవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు వాటాదారుల మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి అని ఆ ప్రభుత్వ అధికారి తెలిపారు.
 

Categories
National

కరోనా ఫైట్…విపత్తులో నిధిలో ప్రభుత్వం దగ్గర 60వేల కోట్లు

కరోనా వైరస్(కోవిడ్ -19)మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వం దగ్గర 60,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి. రాష్ట్ర విపత్తు సహాయ నిధులలో (SDRF) ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తాన్ని రిలీఫ్ అండ్ మిటిగేషన్( విపత్తు ఉపశమనం మరియు ఉపశమనం)కు కేటాయించారు. ఇది PM యొక్క సహాయ నిధిలో అందుకున్న విరాళాలకు అదనంగా ఉంటుంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం… మార్చి30,2020 నాటికి రాష్ట్రాల SDRFలో 30వేల కోట్ల బాలెన్స్ ఉంది. రిలీఫ్ అండ్ రీహేబిలిటెషన్(ఉపశమనం మరియు పునరావాసం) కోసం ఖర్చులను తీర్చడానికి ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు కేటాయించే నిధుల నుండి ఈ ఫండ్ తయారు చేయబడింది. ఎస్‌డిఆర్‌ఎఫ్ మరియు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (NDRF) కింద ఉన్న నిధులు నాన్ లాప్సబుల్(నాన్ లాప్సబుల్ ఫండ్ అంటే బడ్జెట్ కేటాయింపు కింద… ఏదైనా మంత్రిత్వ శాఖకు లేదా డిపార్మెంట్ కు ఇవ్వబడిన డబ్బు, అది ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది మరియు ఖర్చు చేయని మొత్తం ఆర్థిక సంవత్సరం చివరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు తిరిగి వెళుతుంది) కాబట్టి, అవి ఈ నిధికి జోడించబడతాయి.  

2016-17 నుండి ప్రభుత్వం… విపత్తు ఉపశమనం మరియు పునరావాసం కోసం రూ.80,000 కోట్లకు పైగా కేటాయించింది(ఎస్‌డిఆర్‌ఎఫ్‌ల కోసం రూ .50 వేల కోట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి రూ.30,285 కోట్లు). ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద సహాయం అందించే ఉద్దేశ్యంతో… కోవిడ్ -19 ను గుర్తించిన విపత్తుగా హోం మంత్రిత్వ శాఖ మార్చి 14 ప్రకటించిన విషయం తెలిసిందే.

విపత్తు సంబంధిత వ్యయాలను తీర్చడానికి గతేడాది కేంద్రం ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద రాష్ట్రాలకు రూ .13,465 కోట్లు కేటాయించింది. అదనంగా,ఎనిమిది రాష్ట్రాలు… మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ లకు NDRF నుండి 14,000 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కేరళ ఇప్పటికే తన ఎస్‌డిఆర్‌ఎఫ్‌లో రూ .2,100 కోట్ల బ్యాలెన్స్‌ను కలిగి ఉంది.

ఢిల్లీ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వారి స్వగ్రామాలకు వలస వెళ్లిన పెద్దస్థాయిలో కార్మికులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని… ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద నిధుల వినియోగం ఈ తరగతి ప్రజలకు తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు మరియు వైద్య సంరక్షణను అందించడంలో సహాయక చర్యలను కలిగి ఉంటుందని శనివారమే కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. 21రోజుల లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన మరియు సహాయక శిబిరాల్లో ఉంటున్న వలస కార్మికులకు,ఇళ్లు లేనివాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది అని ఉత్తర్వులో పేర్కొంది. కరోనా యుద్ధంలో ఏ రాష్ట్రమూ నిధుల కొరతను ఎదుర్కోదని స్పష్టం చేస్తుంది. లాక్ డౌన్ నిజమైన స్ఫూర్తితో అనుసరించేలా చూడాలని మరియు ఏ పౌరుడి కదలికను అనుమతించవద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. 
Also Read | కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సీఎం జగన్ సమీక్ష

Categories
Movies

‘డమ్మీస్టార్’ మహేష్ బాబు.. ‘రీమేక్ స్టార్’ విజయ్ – వీరలెవల్లో ఫ్యాన్ వార్..

సోషల్ మీడియాలో తమిళ నటుడు విజయ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల మధ్య వార్..

సినిమా రిలీజ్‌లు, రికార్డులు, కలెక్షన్ల విషయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ స్థాయిలో ఫ్యాన్ వార్స్ జరుగుతాయో తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అని ఇతర భాషలకు చెందిన హీరోల అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా తెలుగు, తమిళ్ అభిమానుల మధ్య వార్ మొదలైంది. విజయ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ మహేష్‌ బాబుని కాస్తా డమ్మీస్టార్ మహేష్ అనేయడంతో, దళపతి విజయ్ ఏమో రీమేక్ స్టార్ అంటూ మహేష్ అభిమానులు రెచ్చిపోయారు.

social media

social media

వీళ్ల మధ్య సోషల్ మీడియా ఫ్యాన్ వార్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండడం విశేషం. తమిళనాట దళపతి విజయ్, టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ ఇద్దరూ టాప్ స్టార్స్ అనే సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే మహేష్ డమ్మీ స్టార్ అంటూ విజయ్ ఫ్యాన్స్ రకరకాలుగా మార్ఫింగ్ మరియు సినిమాలోని ఫోటోలతో ట్రోల్ చేస్తుండగా.. రీమేక్ స్టార్ అంటూ విజయ్‌ను మహేష్ ఫ్యాన్స్ ఆటాడుకుంటున్నారు.

vijay

mahesh

ట్విట్టర్‌లో #RemakeStarVijay #DummyStarMaheshBabu హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఫ్యాన్ వార్‌కి ముగింపు ఏంటనేది అభిమానులకే తెలియాలి. ఇటీవల ధనుష్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలోనూ తమిళ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

social media

fans war

Categories
Uncategorized

కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి మంగళవారం  అధికారులతో సమీక్షి  నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 40కి చేరాయని..కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు.

అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కేసులు నమోదు కాగా, ఒక్క చీరాలలోనే 5 కేసులను గుర్తించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 9 కేసులు, విశాఖలో 6, కృష్ణాలో 5, తూర్పు గోదావరిలో 4, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించారు.

వీరిలో చాలా మంది ఢిల్లీలోని, హజ్రత్‌ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైన వారు, వారి కుటుంబ సభ్యులేనని అధికారులు సీఎం కు వివరించారు. రాష్ట్రం నుంచి వెళ్లిన వారు, అదే రోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని అధికారులు తెలిపారు.

జమాత్‌ నిర్వాహకుల నుంచి, పోలీసుల నుంచి, రైల్వే అధికారుల నుంచి.. ఇలా వివిధ రకాలుగా సమాచారం సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామన్న అధికారులు సీఎం కు తెలిపారు. వీరిపై ప్రధానంగా దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

కాగా….లండన్‌ ఉన్న తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ధైర్యం చెప్పారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లండన్‌లోని తెలుగు విద్యార్థులతో గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, నిబ్బరం కోల్పోవద్దని వారికి సూచించారు.

భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు డీజీపీకి వివరించారు. విద్యార్థుల సమస్యలు విన్న డీజీపీ.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు.

Also Read | రోడ్లపై ఒక్క వలస కూలీ లేరన్న కేంద్రం…వైరస్ కన్నా భయమే ఎక్కువమందిని చంపేస్తుందన్న సుప్రీం

Categories
National

రోడ్లపై ఒక్క వలస కూలీ లేరన్న కేంద్రం…వైరస్ కన్నా భయమే ఎక్కువమందిని చంపేస్తుందన్న సుప్రీం

21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్లపై ఒక్క వలస కూలీ కూడా లేరని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకి తెలిపారు.  కరోనా వైరస్ నేపథ్యంలో 21రోజుల లాక్ డౌన్ విధించిన తర్వాత ఎటువంటి పని లేకపోవడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన వేలాది మంది వలస కూలీలకు రిలీఫ్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీం విచారించింది. రోడ్లపై ఉన్నవాళ్లని ఇప్పటికే దగ్గర్లోని అందుబాటులో ఉన్న షెలర్లకు తరలించబడ్డారని తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం,ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు కేంద్రప్రభుత్వం భరోసా ఇవ్వాలని,మరియు ఆహారం,మందులు వారికి అందించాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వలస కార్మికులకు తమ ఉన్న భయాందోళనలు తొలగించడానికి కౌన్సిలింగ్ సౌకర్యం కూడా కలిపించాలని ఆదేశించింది. వలస కార్మికుల మనోధైర్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని కూడా కోర్టు నొక్కి చెప్పింది. మీరు భజన్, కీర్తన, నమాజ్ లేదా ఏదైనా కలిగి ఉండవచ్చు, కాని మీరు ప్రజలకు బలం ఇవ్వాలి అని కోర్టు తెలిపింది. శిక్షణ పొందిన కౌన్సిలర్లు మరియు అన్ని మతాలకు చెందిన కమ్యూనిటీ లీడర్లు రిలీఫ్ క్యాంపులను సందర్శించి భయాందోళనలను నివారించండని తెలిపింది.

శిక్షణ పొందిన కౌన్సిలర్లతో పాటు, మత పెద్దలను వలస వచ్చిన వారితో మాట్లాడటానికి తీసుకువస్తామని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. షెలర్లను నిర్వహించే బాధ్యత పోలీసులకు కాకుండా వాలంటీర్లకు ఇవ్వాలి మరియు వలస కార్మికులపై ఎలాంటి బలప్రయోగం లేదా బెదిరింపులు ఉండకూడదని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే… మెహతాతో మాట్లాడుతూ అన్నారు. భయాందోళన అనేది వైరస్ కంటే ఎక్కువ ప్రాణాలను నాశనం చేస్తుందని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వింటున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే…షెల్టర్ హోమ్స్ కు వచ్చిన వలస కార్మికులందరీకీ ఆహారం, పోషణ మరియు వైద్య సహాయం అందించేలా చూడాలని కేంద్రానికి చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వారు నగరాల్ని వీడారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నగరాల నుంచి గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఇలా ఊర్లకు వెళ్లడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువ అవతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న ఈ వైరస్ ఇండియాలో తక్కువ స్థాయిలో ఉందని, లాక్‌డౌన్ సక్రమంగా పాటిస్తే కరోనాను అడ్డుకోవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Also Read | మురికినీటిలో Covid-19 వ్యాప్తి, సోకిన వ్యక్తి మలంలోనూ వైరస్ ఉంటుంది : డచ్ సైంటిస్టులు  

Categories
Movies

అదరగొడుతున్న ‘ఆహా’ – వన్ మిలియన్ యూప్ డౌన్‌లోడ్స్

‘ఆహా’ డిజిటల్ రంగంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది..

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల డిజిటల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అమెజాన్,  నెట్ ఫ్లిక్స్‌కు ధీటుగా తెలుగు సినిమాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లో ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు వెబ్ సిరీస్‌లు, లెటెస్ట్ మూవీస్ ఆడియన్స్‌కు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ‘ఆహా’ యాప్‌ను అక్షరాలా పదిలక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

aha

తెలుగులో మొట్టమొదటి ఎంటర్‌టైన్‌మెంట్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌గా దూసుకుపోతోంది ‘ఆహా’. ఫిబ్రవరిలో టెస్ట్ లాంఛ్ చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 25న యాప్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేయాలని భావించారు కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాయిదా వేశారు. ప్రస్తుతం ‘సిన్‌’, ‘లాక్డ్’ వంటి కంటెంట్ బేస్డ్ వెబ్‌సిరీస్‌ల‌ు స్ట్రీమింగ్ అవుతూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగంలో స‌త్తా చాటుతున్నాయి. కొత్తగా పెళ్లైన జంట మ‌ధ్య సాగే క‌థే  ‘సిన్’. శ‌ర‌త్ మారార్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు న‌వీన్ మేడారం (బాబు బాగా బిజీ ఫేమ్) డైరెక్ట‌ర్.. బోల్డ్ కంటెంట్‌తో, డొమెస్టిక్ వ‌యొలెన్స్‌కి వ్య‌తిరేకంగా ఒక మెసేజ్ ఓరియంటెంట్‌తో తీసిన వెబ్‌సిరీస్ ఇది. ‘మ్యారేజ్ నో ఎక్స్‌క్యూజ్’ అనే క్యాంపెయిన్‌ని నిర్వ‌హిస్తుంది ఈ టీమ్‌.

Read Also : అది విరాళం.. రౌడీ మామూలు కాదు – దర్శకుడు దేవ కట్టా

aha

ఇక ‘లాక్డ్‌’ విషయానికొస్తే సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటించగా కృష్ణ కుల‌శేఖ‌ర‌న్ నిర్మాణంలో ప్ర‌దీప్ దేవ‌కుమార్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్‌సిరీస్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈ వెబ్‌సిరీస్ ప్రివ్యూ లాంచ్ సంద‌ర్భంగా న‌టీన‌టులు.. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌తిపాదించిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను చేప‌ట్టి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు. వీటితోపాటు ‘ఆహా’ సొంతంగా స‌మ‌ర్పించిన ‘మ‌స్తీస్’, ‘కొత్త పోర‌డు’, ‘షిట్ హాపెన్స్’, ‘గీతా సుబ్ర‌మ‌ణ్యం’ వంటి సిరీస్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘అర్జున్ సురవరం’, ‘ఎన్‌జికె’, ‘ఖైదీ’, ‘ప్రెషర్ కుక్కర్’, ‘సవారి’, ‘చూసీ చూడంగానే’, ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ పరిస్తితిలో ‘ఆహా’తో అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందవచ్చు.

aha

Categories
International Life Style

మురికినీటిలో Covid-19 వ్యాప్తి, సోకిన వ్యక్తి మలంలోనూ వైరస్ ఉంటుంది : డచ్ సైంటిస్టులు  

నెదర్లాండ్స్‌లో covid-19 వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకముందే డచ్ సైంటిస్టులు సిటీలోని మురుగు నీటిలో కరోనా వైరస్ ఉందని గుర్తించినట్టు ఓ నివేదిక తెలిపింది. న్యూమోనియా వ్యాధిని వ్యాప్తిచేసే నోవల్ కరోనా వైరస్‌ ప్రారంభంలోనే హెచ్చరించినట్టు పేర్కొంది. SARS-CoV-2 అనే పిలిచే కరోనా వైరస్ సోకిన వ్యక్తి మలంలో కూడా తరచూ కరోనా వైరస్ విసర్జించడం జరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయినప్పటికీ మురుగునీరు కరోనా వైరస్ ప్రసారానికి ముఖ్యమైన మార్గంగా మారే అవకాశం లేదు. కానీ, కమ్యూనిటీలో వ్యాధికారక ప్రసరణ మురుగునీటి వ్యవస్థల్లోకి ప్రవహించే మొత్తాన్ని పెంచుతుందని న్యూవెజిన్‌లోని KWR Water Reasearch Institute గెర్టజన్ మెడెమా తెలిపారు.  

ఆగ్నేయ ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు 50 కిలోమీటర్ల (32 మైళ్లు) దూరంలోని నగరంలో మార్చి 5న అమెర్స్ ఫ్రూట్ ప్రాంతంలో మురుగునీటి ప్లాంట్ దగ్గర కరోనా వైరస్ నుంచి ఒక జెనటిక్ మెటేరియల్ గుర్తించినట్టు తెలిపారు. అప్పటివరకూ నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఫిబ్రవరి 27న తొలి కొవిడ్-19 కేసు నెదర్లాండ్స్ లో ధ్రువీకరించారు. కొన్నిరోజుల తర్వాత దక్షిణేతర భాగంలో హెల్త్ వర్కర్లకు వైరస్ వ్యాపించి అనారోగ్యానికి గురైనట్టుగా గుర్తించారు. అంటే.. కరోనా వైరస్ కమ్యూనిటీలో వ్యాపిస్తోందనే సంకేతాన్ని ఇచ్చింది. 

మురికి నీటిలో కొత్త వైరస్ వ్యాధి ప్రసారం అవుతోందని, దీని కారణంగా ఎలా ప్రమాదం లేదనే విషయాన్ని పారిశుద్ధ్య కార్మికులకు అర్థమయ్యేలా చెప్పాలి. దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించడం ఎంతో ముఖ్యమని అన్నారు. మన కమ్యూనిటీల్లో SARS-CoV-2 వైరస్ వ్యాప్తిపై పర్యవేక్షించేందుకు సీవేజ్ నిఘాను ఎలా నియోగించుకోవాలో గుర్తించాల్సిన అవసరం ఉందని ఇన్సిస్ట్యూట్ ప్రిన్సిపల్ మైక్రోబయాలిజిస్ట్, కో-అథర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత క్లినికల్ సర్వైలెన్స్ కొవిడ్-19 బాధితులకు పరిమితంగా ఉన్నప్పటికీ వారిలో వైరస్ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 

మురికి నీటిలో SARS-CoV-2 వైరస్ ఉన్నట్టు తొలి రిపోర్టులో గుర్తించినట్టు వారు చెప్పారు. వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ ద్వారా పొలియోవైరస్, యాంటీబయాటిక్ రిసిస్టెంట్ బ్యాక్టిరీయాలను గుర్తించేందుకు సమర్థవంతంగా పనిచేసే మెథడ్ అని కూడా చెప్పారు. నగరంలో వైరస్ వ్యాప్తి ప్రారంభంలో అత్యవసర హెచ్చరికకు కూడా Sewage surveillance పనిచేస్తుందని డెచ్ సైంటిస్టులు వెల్లడించారు. మురికి నీటిలో కనిపించే వైరస్.. తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. జనాభాలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో పర్యవేక్షించేందుకు సున్నితమైన టూల్ గా పనిచేస్తుందని వారు చెప్పారు. 

Also Read | కరోనా ఎఫెక్ట్ : విటులు లేక వేశ్యల నరక యాతన