Categories
Movies Slider

తుదిశ్వాస వరకు నవ్వుతూనే ఉన్నారు.. ఏడిపిస్తూ వెళ్లిపోయారు.. భావోద్వేగానికి గురైన కపూర్ కుటుంబం..

పూర్తయిన రిషి కపూర్ అంత్యక్రియలు.. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు..

బాలీవుడ్ సీనియర్ నటులు రిషి కపూర్ (67) ఈరోజు(గురువారం) ఉదయం 8గంటల 45నిమిషాలకు కన్నుమూశారు. రెండేళ్లుగా లుకేమియా‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. చివరి నిమిషం వరకు ఆయన నవ్వుతూ, నవ్విస్తూ గడిపారని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషీ భారత్‌కు తిరిగి వచ్చారు.

Rishi Kapoor

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషీకపూర్ ఈ నెల రెండో తేదీ నుంచి కొత్త పోస్టులు చేయలేదు. ఈ సాయంత్రం రిషి కపూర్ అంత్యక్రియలు ముగిసినట్లుగా కపూర్ ఫ్యామిలీ తెలియజేసింది. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా చివరి వరకు నవ్వుతూనే ఉన్నారు.. ఇప్పుడు మమ్మల్ని అందర్నీ ఏడిపిస్తూ వెళ్లిపోయారు.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు కపూర్ కుటుంబ సభ్యులు.. 

Rishi Kapoor

 

Categories
Movies Slider Viral

ఏం అండర్ స్టాండింగ్ గురూ.. కాంబో కుదిరింది.. లాక్‌డౌన్ తర్వాత లాంఛనంగా ప్రారంభం!

మహేష్ బాబు, రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా కలయికలో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో ఓ సినిమా రూపొందనుంది. వీళ్లిద్దరు చేయబోయేది మల్టీస్టారర్ మూవీ కాదు. చరణ్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ తన జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రె.లి. బ్యానర్‌పై ఓ సినిమా నిర్మించనున్నాడని తెలుస్తోంది.

ఈమధ్య సందీప్, మహేష్‌ని కలిసి కథ చెప్పగా బాగా ఇంప్రెస్ అయిన మహేష్ ఆ స్టోరీ చరణ్‌కి అయితే చాలా బాగుంటుందని సందీప్‌ని చరణ్ దగ్గరకు పంపాడట. చెర్రీకి కూడా కథ నచ్చడంతో ఫుల్ నెరేషన్ ఇవ్వమని అడగ్గా సందీప్ కొంత టైమ్ అడిగాడట.

దీంతో చెర్రీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్పడంతో సందీప్ స్క్రిప్ట్ పూర్తి చేసేపనిలో ఉన్నాడు. అలాగే మంచి కథ కావడంతో మహేష్ తానే నిర్మిస్తానని మాటిచ్చాడట. అన్నీ పక్కగా కుదిరితే లాక్‌డౌన్ తర్వాత చెర్రీ, మహేష్, సందీప్ కలయికలో సినిమా పట్టాలెక్కడం ఖాయం అనే మాట ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’లో మహేష్ కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి.

కట్ చేస్తే చివరకు చరణ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు. అలాగే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేష్, సందీప్ కలిసి సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ హీరోగా నటించాల్సిన సినిమాని చరణ్‌కిచ్చి తాను నిర్మాతగా మారబోతున్నాడు. తిరిగి తిరిగి ముగ్గురూ ఒకచోటకే చేరారన్న మాట..   
 

Categories
Andhrapradesh

ఇంగ్లీష్ మీడియానికే జై కొట్టిన తల్లిదండ్రులు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు జై కొట్టారు. ఈమేరకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియమే కావాలంటూ స్పష్టంచేశారు.

విద్యారంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నాడు.. నేడు.. కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను గణనీయ స్థాయిలో అభివృద్ధిచేయడానికి కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడి ఉన్నతస్థాయి చేరుకోవడానికి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఇటీవల హైకోర్టు తీర్పుతో 2019-2020 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. మూడు ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు.
1. ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు
2. తెలుగు మీడియం
3. ఇతర భాషా మీడియం

ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. 

ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్‌ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి.

Categories
Political Telangana

రేపటి నుంచి బియ్యం, ఎల్లుండి నుంచి నగదు పంపిణీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌  వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.  మార్చినెలలో ఇచ్చినట్లు గానే … ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు  మే1 వ తేదీ నుంచి ఉచిత బియ్యంను రాష్ట్రంలోని అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. 

క్రితం నెలలో ఇచ్చినట్లే తిరిగి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున  బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా ఉచితంగా అధికారులు పంపిణీ చేయనున్నారు. అదే విధంగా రూ.1500 ధన సహయాన్ని మే 2వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. 

లబ్దిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్‌లో ఇచ్చిన నిర్దేశిత సమయంలోనే రేషన్‌ తీసుకోవాలని అధికారులు  సూచించారు. ప్రతి రేషన్‌ దుకాణం దగ్గర సబ్బు, శానిటైజర్‌, నీళ్లు వంటి సదుపాయాలు అందుబాటులో  ఉంచుకోవాలన్నారు.  ప్రతి ఒక్కరికీ రేషన్‌ ఇచ్చే వరకు రేషన్‌ షాపులు తెరిచే ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల మంది ఆహార భద్రత కార్డులు ఉన్న వారికి  మేలు జరగనుంది.

Categories
National Telangana

ఐటీ పరిశ్రమను కేంద్రమే ఆదుకోవాలి :  కేటీఆర్ లేఖ 

కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా విధించిన  లాక్ డౌన్ కారణంగా ఐటి రంగంలోని సూక్ష్మ మరియు మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,  కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు తో రవిశంకర్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటి, మరియు అనుభంద పరిశ్రమలను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు సంబంధించి సవివరమైన లేఖను కేటీఆర్  రాశారు.

ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వంతో పరిశ్రమ పరిస్థితులపైన జరుగుతున్న సంభాషణలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వాములు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఐటీ, ఐటిలోని ఎం ఎస్ ఎంఈలను ఆదుకునేందుకు చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. 

మంత్రి కేటీఆర్ రాసిన లేఖలోని ప్రధానాంశాలు:                                                                             
ఐటి రంగంలోని సూక్ష్మ మరియు మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉన్నదని, ఇందుకు సంబంధించి పలు సూచనలు మంత్రి కేటీఆర్ ఈ లేఖలో చేశారు హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు లక్షల మంది ఐటి ఉద్యోగులు ఉన్నారని, ప్రస్తుత సంక్షోభ ప్రభావం వారిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగా ఉన్నదని తెలిపారు. అయితే ఈ ప్రభావం చిన్న కంపెనీలపైన అధికంగా ఉండే అవకాశం ఉన్న  నేపథ్యంలో ఆయా కంపెనీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐటి మరియు జీఎస్టీ పన్నుల రిఫండ్లను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. 

25 లక్షల కన్నా తక్కువగా ఉన్న ఆదాయపు పన్ను బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. 25 లక్షలకు పైగా బకాయిలు ఉన్న నేపథ్యంలో వాటిలో కనీసం 50 శాతం అయిన వెంటనే విడుదల చేయాలని కోరారు. జిఎస్టికి సంబంధించి కేంద్రం ప్రకటించిన మినహాయింపుల విషయంలో తొలినాళ్లలో కొంత అయోమయం నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో అనేక కంపనీలు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించాలని, అయితే ఆయా సంస్థలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రావలసిన రీపండ్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి కంపెనీలకు సహాయకారిగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ ఐటి విభాగంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వివిధ శాఖలతో సమన్వయానికి అవకాశం కల్పించాలని కోరారు. 

సూక్ష్మ మధ్య మధ్యతరహా సంస్థలకు కనీసం 50 శాతం రుణ సదుపాయాన్ని పెంచాలని, తద్వారా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, దీంతో కరోనా సంక్షోభం వలన లే అప్స్ (lay offs) కలుగకుండా ఉంటాయని మంత్రి తెలియజేశారు. దీనిపైన సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఉండాలని కోరారు. ఇలాంటి రుణాలను తిరిగి వసూలు చేసేందుకు కనీసం 12 నెలల కాలాన్ని నిర్దేశించాలన్నారు.  

ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించిన ప్రత్యక్ష ప్రయోజనాలను పొందుటకు మార్చి31, 2020 తుది గడువుగా కేంద్రం ప్రకటించిందని, దీనిని కనీసం వచ్చే ఏడాది వరకు పొడగించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అనేక కంపెనీల్లోని ఉద్యోగుల సాంద్రత ఆఫీస్ కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందని, దీన్ని  ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులులా నిర్దేశించాలన్నారు. అన్ని ఐటి పార్కులు, సెజ్ ల్లోని కార్యాలయాలకు ఈమేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా సురక్షిత కార్యక్షేత్రాలు( work places) ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.  దీంతోపాటు ఐటీ పార్కులు, సెజ్ ల్లోని కార్యాలయాలకు, ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్ ని ప్రవేశపెట్టాలని,  అగ్నిమాపక మార్గదర్శకాల మాదిరే వీటిని కూడా తప్పనిసరి చేయాలని తన లేఖలో సూచించారు

Categories
Andhrapradesh

వలస కార్మికుల కోసం జగన్ సర్కార్  కీలక నిర్ణయం.. కంట్రోల్ రూం ఏర్పాటు

మరో మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పూర్తి అవుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్  పూర్తికానున్న సంధర్భంగా మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పూర్తయ్యాక ఏపీలో ఎలాంటి పరిస్థితులు కొనసాగనున్నాయి ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండనున్నాయనే విషయంలో ప్రజలకు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయనే దానిపై కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు పలు వివరాలు వెల్లడించారు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్  సడలింపులు ఉంటాయని కృష్ణ బాబు స్పష్టంచేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రీన్ జోన్‌లో ఉన్న అన్ని ప్రాంతాలలో కార్యకలాపాలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణబాబు తెలిపారు.

అయితే రెడ్ జోన్‍‌లలో  మాత్రం కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వలస కార్మికుల విషయంలో కూడా జగన్ సర్కార్  కీలక నిర్ణయం తీసుకున్నట్లు  కృష్ణ బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్న వలస కార్మికులు అందరినీ తమ తమ స్వస్థలాలకు పంపుతున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో 60 వేల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారు అని తెలిపిన కృష్ణబాబు.. వారందరిని తమ తమ స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

అంతే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని  ఇక్కడికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు కనుక వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన వాళ్ళకి ముందుగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచిన అనంతరం తమ తమ గ్రామాలకు పంపిస్తామని కృష్ణ బాబు వెల్లడించారు.

ఇక ఏపీకి చెందినవారు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్లయితే వారు కంట్రోల్‌ రూం నంబర్‌ 0866-2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు వివరించారు.

Categories
National

దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. 

దేశంలో కరోనా రికవరీ రేటు 25 శాతం పైగానే ఉందన్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,324 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా  మరణాల్లో  78 శాతం మందికి  ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే పరీక్షలు చేయాలని, లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్‌ చేయాలని రాష్ట్ర  ప్రభుత్వాలను ఆదేశించామని చెప్పారు. లాక్‌డౌన్‌లో వలస కూలీలకు  ఆహారం అందిస్తున్నామని, భౌతిక దూరం పాటించడంలో ప్రజలు చాలావరకు అవగాహనకు వచ్చారని తెలిపారు. కరోనా ప్రభావం లేని చోట ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చామని వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన చెప్పారు. 

Categories
Crime Latest National

భార్యకు కరోనా..ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్యకు కరోనా పాజిటివ్ సోకింది. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఆసుపత్రలో ఉన్న సమయంలోనే ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ వైపు తల్లి ఆసుపత్రిలో..తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదంలో మునిగిపోయాడు కొడుకు. ఈ విషాద ఘటన…చండీగఢ్ లోని గుర్గావ్ లో చోటు చేసుకుంది. 

సత్బీర్ సింగ్ (54) కొంతకాలంగా ఉపాధి లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఇతని కుమారుడు ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్నాడు. కొడుకు, కోడలు, భార్యతో సత్బీర్ నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే..సత్బీర్ సింగ్ భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేరిపించారు. చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా ఉందని నిర్దారించారు. 

2020, ఏప్రిల్ 29వ తేదీ బుధవారం రాత్రి యదావిధిగా సత్బీర్ సింగ్ నిద్రపోయాడు. ఉదయం లేవలేదు. గదిలో గమనించగా..సత్బీర్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. ఎందుకు సత్బీర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదు. తల్లి ఆసుపత్రిలో..తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో కొడుకు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. 

కుటుంబం ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. FIR నమోదు చేయలేదని, డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించామన్నారు. 

Categories
Movies Slider Viral

కష్టపడు, పైకొస్తావ్.. వైరల్ అవుతున్న రిషి కపూర్ చివరి వీడియో..

రిషి కపూర్ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు  కొద్దిసేపటి క్రితం ముంబైలోని చందన్‌వాడి స్మశానంలో ముగిశాయి. అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషి కపూర్ చేసిన రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా రిషి కపూర్ చివరి వీడియో ఇదేనంటూ ఆసుపత్రిలో ఆయన పాట పాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ముంబైలోని రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి రిషిని చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు రిషి కపూర్‌ను ఆప్యాయంగా పలకరించి, ఆయన నటించిన ‘దీవానా’ సినిమాలోని ‘‘తేరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా’’ పాట పాడి వినిపించగా.. రిషి అతణ్ణి మెచ్చుకున్నారు. పాట పూర్తయిన వెంటనే ఆ యువకుడికి తన ఆశీస్సులు అందించారు. ‘జీవితంలో కష్టపడి పైకి రావాలి. కష్టపడటమే మన వంతు, పేరు ప్రఖ్యాతులు అనేవి వాటంతటవే వస్తాయని’ అన్నారు. కాగా ఇది రిషి కపూర్ చివరి వీడియో అని కొందరు అంటుంటే, ఇంతకుముందు ఆయన ఆసుపత్రికి వచ్చినప్పుడు తీసిన వీడియో అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.  

Categories
National

లాక్ డౌన్ టైంలో పెళ్ళి …మాస్టర్ ప్లాన్ వేసిన కుటుంబం క్వారంటైన్ కు తరలింపు

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే ప్రజలు అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఒక ముస్లి కుటుంబం మాత్రం పెళ్లి కోసం  మాస్టర్ ప్లాన్ వేసి…. చివరికి పోలీసులకు చిక్కి క్వారంటైన్ లోకి వెళ్ళింది. 

పెళ్ళి ముఖ్యం
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన అహ్మద్ అనే వ్యక్తికి ఢిల్లీకి  చెందిన ఒక యువతితో వివాహాం నిశ్చయమయ్యింది.  లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఎక్కడికి వెళ్లలేని పరిస్ధితి ఉంది.  పెళ్లి రోజు దగ్గర పడుతుండటంతో పెళ్లి కొడుకు, అతడి తండ్రి ఢిల్లీ వెళ్లేందుకు సిధ్ధమయ్యారు. నాలుగు రోజుల క్రితం ముజఫర్ నగర్ నుంచి ఢిల్లా వెళ్లేందుక బయలు దేరి మార్గ మధ్యలో పోలీసులకు చిక్కారు.పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. 

ఢిల్లీ వెళ్లటానికి మాస్టర్ ప్లాన్ 
ఇంటికి చేరిన తండ్రీ కొడుకులు మళ్లీ ప్లాన్ వేశారు.ఈ సారి పోలీసులకు దొరక్కూడదనుకున్నారు. ఇద్దరూ కల్సి మాస్టర్ ప్లాన్ వేశారు.  తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని అంబులెన్స్ కు కాల్ చేశాడు. అంబులెన్స్ అయితే ఎవ్వరూ ఆపరనే అయిడియాతో. అంబులెన్స్ రాగానే తండ్రికి తోడుగా వస్తానంటూ అహ్మద్ కూడాఎక్కాడు. లాక్ డౌన్ లో అంబులెన్స్ లకు సడలింపు ఉండటంతో ఎక్కడా వారిని పోలీసులు అడ్డగించలేదు.  ఢిల్లీకి వెళ్లాక వారు ఆస్పత్రికి వెళ్ళకుండా పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు.  అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని పోలీసుల కళ్లు కప్పి ముజఫర్ నగర్, ఖతౌలి లోని ఇంటికి చేరుకున్నారు. 

దొరికిపోయింది ఇలా..
ఖతౌలిలో ఇటీవల కోవిడ్  పాజిటివ్ కేసులు పెరగటంతో ఆ ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించారు.  అహ్మద్ ఇంట్లో జనాలు ఎక్కువ కనిపించటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి చేరుకుని విచారించగా అసలు విషయం  బయట పడింది.  దీంతో  నవ దంపతులతో పాటు బంధువులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.