COVID-19 చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుండి ఆరు ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఆమోదించబడిన ఔషధాల సామర్థ్యాన్ని, క్లినికల్ ట్రయల్స్‌లో అభ్యర్థులు, ఇతర సమ్మేళనాలను పరీక్షించింది.
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్‌లాండ్‌లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్‌తో సన్నద్ధం చేస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో చర్యలు చేపట్టాయి. COVID-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం చాలా చురుకైన చర్యలు తీసుకుంది. వైరస్ ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకుంది.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల...
భయాందోళనతో భారతీయులు లాక్‌డౌన్‌కు ముందు, రెండువారాల్లో 84,461 కోట్ల రూపాయల నగదును విత్‌డ్రా చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డుపై ఉమ్మినందుకు ఓ యువకుడి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.
కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్...
పది మందికి మంచి చెప్పాల్సిన జ్యోతిష్యుడు తన దగ్గరకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో రాసలీలలు మొదలెట్టాడు. అడ్డు వచ్చిన భర్తను హత్య చేశాడు. అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా...
తన కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముకేశ్ ఖన్నాపై విరుచుకుపడ్డ శత్రుఘ్న సిన్హా..
జనవరి… జర్మనీ… కారు విభాగాల కంపెనీ… మధ్యాహ్నం లంచ్ టైం… ఓ కాస్తంత ఉప్పుంటే ఇస్తారా అని ఓ వర్కర్ అడిగాడు. ఇంకో వర్కర్ వేరే టేబుల్ మీదున్న ఉప్పడబ్బా ఇచ్చాడు. అంతే కరోనాను ఇచ్చిపుచ్చుకున్నారు....
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి లక్షణాలు జ్వరం, నీరసం, పొడిదగ్గు, శ్వాసలో ఇబ్బంది ఇవే అనుకున్నాం. ఈ లక్షణాలు ఉంటేనే కరోనా అని భయపడుతున్నాం. కొందరిలో అటువంటి లక్షణాలేమీ కనిపించకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి....
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి...
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని కాలుష్య స్థాయి మాత్రం జీరోకు పడిపోయింది. వందల సంవత్సరాల తర్వాత స్వచ్ఛమైన గాలి వాతావరణంలో నిండుకుంది. ఫలితంగా ఆకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో టెలిస్కోప్ లేదా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రతి...
కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..
బీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా...
దక్షిణ మధ్య రైల్వే ఆస్పత్రుల్లోని కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్ సూపరింటెండెంట్లు,...
కరోనా వైరస్ మొదట వూహాన్లో కనిపించిన నాటి వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలకు, ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌కు అనేకరూపాలు కనిపించాయి. కరోనా వైరస్ ఎందుకింత ప్రమాదకరం? ఇది ఎదుగుతోంది. రూపం మార్చుకొంటోంది. వూహాన్లో Covid-19 మొదటిగా...
ఫామ్‌హౌస్‌లో గడ్డి రుచి చూసిన సల్మాన్ ఖాన్.. హ్యాకింగ్‌కి గురైన అనుపమ పరమేశ్వరన్ ఫేస్బుక్ అకౌంట్..
ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. ఎత్తేస్తారా అనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్‌డౌన్‌పై క్లారిటీ రావాలంటే ఆదివారం సాయంత్రం వరకూ ఆగాల్సిందే. రెండోసారి ముఖ్యమంత్రులు అందరితో శనివారం వీడియో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును...
కొద్ది రోజులుగా హాస్పిటల్లో గుండె జబ్బు వచ్చిందని వచ్చే వారి కంటే.. తమకు కరోనా వచ్చేస్తుందేమోననే బెంగతోనే సగం మందికి గుండె నొప్పులు వస్తున్నాయట. ఏ చిన్న లక్షణం కనిపించినా అది కరోనానే అనుకుని గుబులు పడుతున్నారట....
లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు....
ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్. బయో-టెర్రరిస్ట్ దాడులు చేసేందుకు కోవిడ్-19 మహమ్మారి అవకాశాలను కల్పించిందని ఆయన అభిప్రాయపడ్డారు. COVID-19 కి వ్యతిరేకంగా జరిగుతున్న...
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు మార్పు చేస్తూ.. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు...
నెలఖరువరకు మీరు ఇంట్లోనే. మోడీ తేల్చేశారు. ఇంకా మూడువారాలు. ఖాళీగా ఉండటంకూడా కష్టమేనని ఇప్పుడు చాలామందికి అర్ధమవుతూనే ఉంది. లేవడం, కూర్చోవడ, టీవీచూడటం…మొబైల్…మళ్లీ బెడ్ ఎక్కడం..రోజులు గడుస్తున్నా… ఈ రొటీన్ మారట్లేదు. మరేం చేయాలి? ఇంట్లోనే...
కరోనా మహమ్మారిపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా.. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందించింది ఓలా కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సాయంగా పలు సంస్ధలు, వ్యక్తులు తోచిన సాయం అందిస్తూ...
‘ఆర్ఆర్ఆర్’ కోసం పదిరోజుల కాల్షీట్కు గానూ భారీ మొత్తంలో పారితోషికం అందుకోనున్న ఆలియా భట్..
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. కానీ, ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగతి...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...
ఫిబ్రవరిలో మెడికల్ స్టూడెంట్ చైనాలోని వూహాన్ నుంచి భారత్ కు వచ్చింది. కేరళలోని అలప్పుఝా వచ్చిన కొద్ది రోజుల వైరస్ సోకినట్లు తెలిసి.. ఆమె ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించారు. కొందరికి హోం...
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాపై ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తప్పు అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితులపై దేశాల వారీగా రిపోర్టు ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ మూడో దశలో ఉందని.. అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఒకరి నుంచి ఇతరులకు వ్యాపించే...
కరోనా..మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. చైనా నుంచి వచ్చినఈ రాకాసి…భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. వేలాది కేసులు నమోదవుతుండడం, వందకు పైగానే మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు మందు లేదని, కేవలం...
కరోనావైరస్ నుంచి పంజాబ్ రైతులకు తాత్కాలిక విముక్తి కల్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా రైతులకు లాక్ డౌన్ నుంచి ఉపశమనం ఇస్తున్నాం....
మీరు కారులో వెళ్తున్నారు. బ్రేక్ వేద్దామంటే కుదరడంలేదు. కాళ్లాడటంలేదు. ఇంకోసారి, మీరు వరండాలో నిల్చున్నారు. గోడలు దగ్గరగా వస్తున్నాయి….ఇరుకైపోతోంది… ఏం చేయాలి? ఇంకోసారి, పెద్ద సునామీ అల మీదకు దూసుకొస్తోంది. తాటిచెట్టంత పెద్దది. పారిపోలేరు… మీరు...
కరోనా వ్యాధి సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డు తగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ లోని జలంధర్ లో ఒక వ్యక్తి శ్వాస కోస వ్యాధులతో కొద్ది రోజుల క్రితం...
కరోనా క్రైసిస్ : మరోసారి భారీ విరాళం ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..
మరి కొద్ది రోజుల్లో 21 రోజుల లాక్డౌన్ ముగియనుంది. స్తంభించిపోయిన సేవలు పునరుద్దరిస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో రవాణా సేవలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆంక్షలు...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే..చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేసి నాలుక కరచుకున్నారు. డిశ్చార్జ్ చేసిన...
కరోనా మహమ్మారీ కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ ఫోర్ డేస్ తో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనబోతోంది ? లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేక పాక్షికంగా సడలిస్తారా ?...
యాంకర్ శ్రీముఖి తాను సినిమాలు కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పింది..
లాక్డౌన్ విజయవంతం కావడానికి పోలీసులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు..
లాక్డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్...
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మన దేశంలో ఇప్పుడు చైనా తయారు చేసిన టిక్ టాక్ ని బాన్ చెయ్యాలి అనే...
ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ కొవిడ్ నివారణకు ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు plasma therapyని అమల్లోకి తీసుకురావాలని భారత్ రెడీ అవుతుంది. అమెరికన్ జర్నల్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
ఏపీలో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు...