Categories
National

98 శాతం మార్కులు సాధించిన అఖిలేష్ కూతురు

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెద్ద కుమార్తె అదితి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(CISE) లో 98 శాతం మార్కులు సాధించింది. అఖిలేష్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో ఇచ్చారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ పిల్లల గురించి తెలుసు.

అఖిలేష్ యాదవ్ మరియు భార్య డింపుల్ యాదవ్‌లకు ఒక కుమారుడు (అర్జున్ యాదవ్) మరియు ఇద్దరు కుమార్తెలు (అదితి యాదవ్ మరియు టీనా యాదవ్). టీనా మరియు అర్జున్ కవలలు.

ఈ ఏడాది 98 శాతం మార్కులను అదితి సాధించగా.. “కష్టపడి చదువుకునే విద్యార్థులను చూస్తుంట గర్వంగా ఉంది” అని అఖిలేష్ ట్వీట్ చేశారు. అదితి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. ఆమె దేశానికి మరియు ప్రపంచానికి సంబంధించిన వార్తలను షేర్ చేస్తూ ఉంటుంది. అతని తల్లి డింపుల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అదితికి హిందీపై బాగా పట్టు ఉందని, ఆమెకి బ్యాడ్మింటన్ అంటే ఇష్టమని ఆమె చెప్పారు.

ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్ఈ) 10 వ తరగతిలో 99.33% విద్యార్థులు మరియు ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ (ISC) 12 వ తరగతిలో 96.84% విద్యార్థులు విజయవంతమయ్యారు. గత సంవత్సరం, 10 వ తరగతిలో 98.54% విద్యార్థులు మరియు 12 వ తరగతిలో 96.52% విద్యార్థులు విజయం సాధించారు. ఈసారి ఫలితం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంది.

Categories
Andhrapradesh

ఏపీలో కొత్తగా 1,813 కరోనా కేసులు… 17 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 1,775 మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 34 మందికి కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,235కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో 309 మంది మరణించారు. ప్రస్తుతం 12,533 మంది చికిత్స పొందుతున్నారు.

అనంతపురం 311, చిత్తూరు 300, తూర్పుగోదావరి 143, గుంటూరు 68, కడప 47, కృష్ణ 123, కర్నూలు 229, నెల్లూరు 76, ప్రకాశం 63, శ్రీకాకుళం 204, విశాఖ 51, విజయనగరం 76, పశ్చిమగోదావరి 84 చొపపున నమోదు అయ్యాయి.

Categories
Internatioinal

ఆ 11 యాప్స్‌ అత్యంత ప్రమాదకరం

మొబైల్‌ ఫోన్‌..అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. వ్యక్తిగత భద్రతకు అంతులేని ప్రమాదాలు తెచ్చిపెడుతోంది. తాజాగా అత్యంత ప్రమాదకరమైన 11 యాప్స్‌ను గూగుల్‌ సంస్థ తన యాప్‌ స్టోర్‌లో గుర్తించింది. ఈ యాప్స్‌ జోకర్‌ అనే మాల్‌వేర్‌ను యూజర్ల డివైస్‌లలోకి చొప్పిస్తున్నాయని గుర్తించింది. ఈ మాల్‌వేర్‌ ప్రమాదకరమైనదే కాదు.. జిత్తుల మారిది అని తెలిపింది.

2017 నుంచి దీన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల తర్వాత గానీ అది దొరకలేదు. ఈ యాప్స్‌ను ఎవరైనా ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉంటే వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని గూగుల్‌ సూచించింది. ప్లేస్టోర్‌ నుంచి కూడా వాటిని తొలగించింది.

తొలగించిన యాప్స్‌ ఇవే..
com.imagecompress.android
com.contact.withme.texts
com.hmvoice.friendsms
com.ralax.relaxation.androidsms
com.cheery.massage.sendsms
com.peason.lovinglovemessage
com.file.recovefiles
com.lplocker.lockapps
com.remindme.alram
com.training.memorygame

Categories
Telangana

అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలి : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించినట్లు వానాకాలంలో రైతులు వందకు వంద శాతం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తుండటం శుభసూచికమన్నారు.

ఇది భవిష్యత్ లో సాధించే గొప్ప విజయానికి నాంది అని సీఎం అన్నారు. సీడ్ డెవలప్ కార్పోరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలన్నారు. క్లస్టర్ల వారీగా ఎంఈవోల నుంచి నివేదికలు తెప్పించాలని, రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలని సూచించారు. రైతు బంధు రాకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలన్నారు. భూముల క్రయ విక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.

రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందన్నారు. రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదని.. ఇది గొప్ప పరివర్తన అన్నారు. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామమన్నారు.

రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందని.. ఇది శుభసూచకం అన్నారు. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతుల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నదన్నారు.

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వేదికల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలన్నారు. ఒకసారి రైతు వేదికల నిర్మాణం పూర్తైతే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయన్నారు.

రైతు బంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ శర్మతోపాటు పలువురు వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు.

Categories
Movies

అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్..తనకు వైరస్ సోకినట్లు బిగ్ బీ ట్వీట్

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా వైరస్ సోకింది. అమితాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో ఆయన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చించారు. ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. అమితాబ్ కుటుంబ సభ్యులు, ఇంట్లో పని మనుషులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమితాబ్ కుటుంబ సభ్యులు, సన్నిహతులు, ఆయన స్టాఫ్ మొత్తం కూడా పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చారు. ఇంకా ఫలితాలు రావాల్సివుంది.

గడిచిన పది రోజులుగా ఎవరైతే అమితాబ్ బచ్చన్ ను కలిశారో వారంతా కూడా టెస్టులు చేసుకోవాలని అమిత్ ట్వీట్ లో పేర్కొన్నారు. 77 ఏళ్ల వయస్సు కలిగిన బిగ్ బీకి అంతర్గతంగా ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు. గతంలో అనేక సార్లు నానావతి ఆస్పత్రిలోనే గడిచిన 20 ఏళ్లుగా కూడా లివర్ కు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు.

అయితే కొంత ప్యానిక్ పరిస్థితిలో బిగ్ బీ ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ఉన్నారు. అమిత్ తాబ్ కు కరోనా సోకి కూడా చాలా రోజులు కావస్తోంది. టెస్టు రిజల్ట్స్ ముందుస్తుగానే తెలిసిన తర్వాత పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కరోనా సోకిన వారు హోంఐసోలేషన్ లోనే క్యూర్ అవుతున్న పరిస్థితి వుంది.

కానీ బిగ్ బీ 70 ఏళ్లు పై బడినవారు కావడం, ఇతర సమస్యలు కూడా ఉండటం అమిత్ తాబ్ ను వెంటనే నానావతి ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో అయనకు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంగా ఉండటంతో అమితాబ్ ముందస్తుగానే కరోనా టెస్టు నిర్వంచారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటి వద్ద ఉన్నారు.

కుటుంబ సభ్యులు జయాబచ్చన్, అబిషేక్ బచ్చన్ సహా ఐశ్వర్యరాయ్, ఆమె పిల్లలు, అలాగే ఇతర స్టాఫ్ కు పరీక్షలు నిర్వహించారు. రిజల్ట్స్ రావాల్సివుందని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

Categories
Trending Viral

స్పోర్ట్స్ మ్యాగజైన్‌‌ కవర్‌కెక్కిన మొదటి ట్రాన్స్ జెండర్ మోడల్!

స్పోర్ట్స్ ఇల్లిస్ట్రేటేడ్ స్విమ్ స్యూట్ సంచికలో మొదటి ట్రాన్స్‌జెండర్ మోడల్‌గా Valentina Sampaio చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌కు SI స్విమ్‌సూట్ 2020 రూకీ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా సంపాయో మాట్లాడుతూ.. వెబ్‌సైట్‌లో రాసిన నోట్‌లో ఆమె ఉత్సాహంగా, ఎంతో గౌరవంగా ఉందని చెప్పారు.

ఫోటోగ్రాఫర్ Josie Cloughతో కలిసి బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని స్క్రబ్ ద్వీపంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోషూట్ జరిగింది. దీనిపై మోడల్ సంపాయో మాట్లాడుతూ… ‘నేను ఉత్తర బ్రెజిల్‌లోని మారుమూల ప్రాంతంలోని ఫిషింగ్ గ్రామంలో ట్రాన్స్‌లో జన్మించాను.

బ్రెజిల్ ఒక అందమైన దేశం. ప్రపంచంలో ట్రాన్స్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా అత్యధిక హింసాత్మక నేరాలు జరిగే ప్రాంతం కూడా. యుఎస్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

ట్రాన్స్ అవ్వడం అంటే.. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంటుంది. అవమానాలతో పాటు శారీరక ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నామని తెలిపింది. అంతకుముందు ఆగస్టు 2019లో విక్టోరియా సీక్రెట్ మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ మోడల్‌గా మోడల్ Sampaio చరిత్ర సృష్టించింది.

 

View this post on Instagram

 

 💜🧡💛❤️💚

A post shared by Valentina Sampaio (@valentts) on

Categories
Telangana

తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు… తొమ్మిది మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 348 మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 12,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20,919 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికీ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 11,066 శాంపిల్స్ సేకరించారు. వీటిలో 1178 పాజిటివ్ కేసులు నమోదవ్వగా మిగితావన్ని కూడా నెగెటివ్ గా పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, హైదరాబాద్ లో 736 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 125, మేడ్చల్ 101, కరీంనగర్ 24, సిరిసిల్ల 24, వరంగల్ అర్బన్ 20, మెదక్ 22, ఖమ్మం 18, మంచిర్యాల 17, ఆదిలాబాద్ 14, మహబూబ్ నగర్ 14, నిజామాబాద్ 12 మంది కరోనా బారిన పడ్డారు.

వికారాబాద్ 9, సిద్దిపేట 9, ఆదిలాబాద్ 8, సూర్యపేట 7, గద్వాల 6, నారాయణపేట 5, ఖమ్మం 2, వరంగల్ రూరల్ 2, నిర్మల్ 2, జగిత్యాల 2, జనగామ 2, వనపర్తి 2, ఆసిఫాబాద్ లో ఒక కేసు నమోదు అయింది. గత 15..20 రోజులుగా చూసినట్లైతే ఇవాళ కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.

Categories
Crime Internatioinal

32 ఏళ్ల మహిళ, కుర్ర బాయ్ ఫ్రెండ్ వల్లే ప్రెగ్నెంట్‌ అయ్యానని నమ్మించడానికి, నకిలీ బేబీ స్కాన్ ఫోటోస్ వాడింది!

పెళ్లి అయిన 32ఏళ్ల మహిళ.. తన 18ఏళ్ల కుర్ర బాయ్ ఫ్రెండ్‌ను మోసం చేసింది. అతడి కారణంగానే తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా తప్పుగా చెప్పింది. అతన్ని నమ్మించేందుకు ఈబే నుంచి నకిలీ బేబీ స్కాన్ ఫొటోలను 100వేల పౌండ్లతో కొనుగోలు చేసింది. ఆ ఫొటోలను చూపించి తన బిడ్డకు అతడే తండ్రి అని నమ్మించింది. ఫలితంగా అతని కుటుంబం మూడేళ్లకు పైగా వారితో సంబంధం లేని శిశువును పోషించారు. ఆమె చేసిన మోసం తేలడంతో  నిందితురాలు సారా డోవ్సన్ కు మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. 32 ఏళ్ల సారా డోవ్సన్‌తో కలిసి బాధితుడు జోసెఫ్ బాస్టిన్ చైనీస్ రెస్టారెంట్‌లో కలిసి పనిచేసినట్టు విచారణలో కోర్టు పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య అఫైర్ నడిచింది.
18, into thinking he wouldఇక తమ సంబంధాన్ని ముగించాలని టీనేజర్ డోవ్‌సన్‌కు చెప్పాడు. కానీ, ఆమె వెంటనే తాను గర్భవతి అయినట్టు నమ్మించింది. పిల్లల పోషణ కోసం అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు విచారణలో తేలింది. అసలు మోసం గ్రహించిన బాధిత యువకుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డీఎన్ఏ పరీక్షల్లో బయటపడ్డ మోసం :
దాంతో డోవ్సన్.. బాధితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. తనను అత్యాచారం చేసినట్టు ఆమె భర్త థామస్ కూడా డోవ్సన్ చెప్పిన ఆమెకు వంత పడాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సీక్రెట్ డీఎన్ఎ పరీక్ష ఫలితాల్లో పోలీసులు డోవ్సన్ చెప్పిందంతా అబద్దామని తేల్చేశారు. ఇదే విషయాన్ని కోర్టులో విన్నవించారు. వాస్తవానికి పుట్టిన శిశువు కుర్ర బాయ్ ఫ్రెండ్ కు పుట్టలేదు… తన భర్తే ఆ శిశువుకు తండ్రి అని పోలీసులు విచారణలో నిర్ధారించారు.

Married woman, 32, used fake baby scan photos bought on eBay to trick lover, 18, into thinking he would become father

డోవ్సన్ మాటలు నమ్మిన టీనేజర్.. తనకు ఒక బిడ్డకు జన్మనిచ్చాడని టీనేజర్ తన తల్లిదండ్రులకు ముందే చెప్పాడు. అలా చెప్పడంతో అతడి కుటుంబం మూడున్నర సంవత్సరాలు పసికందును పోషించింది. కొంతకాలం తర్వాత, ఆమె తన బిడ్డను హోటల్ గదిలో గర్భస్రావం అయినట్టు అతనికి చెప్పింది.అయినప్పటికీ, డోవ్సన్ తన బాధితుడికి 100 రోజులలో, రోజుకు నాలుగు మెసేజ్ ల నుంచి వేల మెసేజ్‌ల వరకు పంపుతూ వచ్చింది.

తనను మరోసారి గర్భవతిని చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఫిబ్రవరి 2016లో, బాధితుడు డోవ్‌సన్‌తో తన రిలేషన్ కు బ్రేకప్ చెప్పేశాడు. నవంబర్ 2016 లో ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఇది కూడా బాస్టిన్ తండ్రి అంటూ మళ్లీ ఇద్దరూ నమ్మించే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 2016లో తన పిల్లల పోషణ కోసం అతడి నుంచి మళ్లీ డబ్బులను అడగడం మొదలుపెట్టింది.  డీఎన్ఎ పరీక్షను మార్చేసింది. అది డోవ్సన్ పంపినట్లు తరువాత తేలింది.

Categories
Andhrapradesh

యువకుల వేధింపులు తట్టుకోలేక యువతి సెల్ఫీ సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భక్తవత్సల నగర్ లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురు యువకులతో వాట్సాప్ చాట్ చేసిన ఆ యువతి సూసైడ్ చేసుకుంటున్న ఫోటోలను వారికి పంపించింది. ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై రమ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకుల వేధింపులే రమ్య మృతికి కారణమని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నారు. చనిపోయే ముందు కూడా రమ్య వారికి చెప్పిందని వాళ్లు పట్టించుకోలేదన్నారు. ఆ యువకులపై దిశ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.

నెల్లూరులోని భక్తవత్సల నగర్ లో నివాసముంటున్న కొండూరు రమ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయే ముందు కొన్ని ఫోటోలను తీసుకొని సాయి, శివభార్గవ్, వాసు అనే ముగ్గురు యువకులకు వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలోనే రమ్య ఉరివేసుకుంటూ లైవ్ డెత్ రికార్డ్ చేసుకొని చనిపోయింది.

విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. దీని ద్వారా ఎవరెవరితో చాటింగ్ చేసింది, ఫోటోలు పెట్టిందన్న విషయం బయటపడింది. శివ భార్గవ్ కు ఆమె మెస్సెజ్ చేసింది. ఆ మెసేజ్ లు చూస్తే రమ్యకు, శివభార్గవ్ కు మధ్య కొంత ఎఫైర్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొంతకాలం నుంచి శివభార్గవ్ రమ్యతో మాట్లడం మానేశాడు. ఈ క్రమంలోనే రమ్య శివభార్గవ్ ను బతిమిలాడుకున్నట్లు తెలుస్తోంది. అనేక సార్లు కూడా మెస్సెజ్ లు పెట్టింది. ఈ వీడియోలో కూడా శివ భార్గవ్ ను ఒక్కసారి మాట్లాడమని బతిమిలాడుతున్నట్లు కనిపించింది. అయితే ఈ విషయంలో సాయి, వాసుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురి యువకుల వేధింపులు, ప్రేమ వ్యవహారమే రమ్య మృతికి కారణమని చెప్పొచ్చు.

Categories
Andhrapradesh

నెల్లూరులో ఆనం ఫ్యామిలీ నయా ఎత్తుగడ

నెల్లూరు కొంతకాలంగా అధికార పార్టీ రాజకీయ అంతర్యుద్ధం సాగుతోంది. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది. ఈక్రమంలో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు ఆనం కుటుంబం పావులు కదుపుతోందని అంటున్నారు. అనిల్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో ఆనం రామనారాయణరెడ్డికి సఖ్యత లేదు.

వీఆర్‌ విద్యా సంస్థలు, వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం ఇందుకు కారణంగా నిలిచాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అనిల్ , ఎమ్మెల్యే కోటంరెడ్డి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వీఆర్ విద్యాసంస్థలపై ఆనం పెత్తనానికి చెక్ పడటం, వేణుగోపాలస్వామి భూముల విక్రయించాలనుకున్న వ్యవహారం కూడా ఆనంకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వ్యవహారాలను నడిపించిన వారిద్దరిపై రామనారాయణరెడ్డి గుర్రుగా ఉన్నారు.

మరోవైపు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. నియోజకవర్గంలో తన మాట వినడం లేదని మీడియా సమావేశంలోనే అధికారులపైన, ప్రభుత్వంపైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు మంత్రి అనిల్, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఆనం రామనారాయణరెడ్డి… నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందనే విమర్శలు చేసి దుమారాన్ని లేపారు.

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఆనం సోదరులు చక్రం తిప్పారు. జిల్లాలో తమకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి మృతితో ఆ కుటుంబ ప్రాబల్యం జిల్లాలో బాగా తగ్గిపోయింది. ఆనం వర్గం కూడా చెల్లాచెదురైపోయింది. కుటుంబ సభ్యుల మధ్య కూడా వివాదాలు నెలకొన్నాయి. ఎవరికి వారుగా వేర్వేరు పార్టీల్లో ఉంటూ వస్తున్నారు. మొత్తం నలుగురు సోదరుల్లో ఆనం వివేకానందరెడ్డి మరణించగా మిగిలిన ముగ్గురిలో రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డి వైసీపీలోనూ, జయకుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు.

కొద్ది రోజుల క్రితం వరకు ఎవరికి వారుగా ఉంటున్న ఈ అన్నదమ్ముల్లో ఇప్పుడు రామనారాయణరెడ్డి, విజయకుమార్‌రెడ్డి ఏకమయ్యేందుకు ముందుకొచ్చారట. తమ విభేదాలను పక్కన పెట్టేశారట. ఎవరికి వారుగా ఉంటే జిల్లాలో మనుగడ కష్టమని భావించి కలిసిపోయి జిల్లాలో మళ్లీ చక్రం తిప్పాలని ప్లాన్‌ చేసుకున్నారట. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోయినా తమ వర్గానికి అండగా నిలవాలని డిసైడ్‌ అయ్యారని అంటున్నారు.

వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర్ రెడ్డి మాత్రమే నెల్లూరులో రాజకీయాల్లో కొంత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో నగరంలో ఆనం కుటుంబానికి అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో అనిల్ పాల్గొనే కార్యక్రమాల్లో రంగ మయూర్‌రెడ్డి అంతగా పాల్గొనడం లేదు. తమ ప్రాభవం మళ్లీ పెరగాలంటే కుటుంబం కలసికట్టుగా ఉండడం ఒక్కటే పరిష్కారమని భావించి, ఏకమయ్యారని అంటున్నారు.

నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలను ఇప్పుడు ఆనం ఫ్యామిలీ టార్గెట్ చేసిందని సన్నిహితులు అంటున్నారు. నెల్లూరులో రాజకీయం మళ్లీ స్పీడ్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆనం కుటుంబంలో యువ నాయకులు రంగమయూర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి తమ కుటుంబ రాజకీయాలకు అండగా నిలువనున్నారన్న ప్రచారం సాగుతోంది. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న విజయకుమార్ రెడ్డి కూడా తమను పట్టించుకొనే వారెవరూ లేరంటూ అన్న రాంనారాయణరెడ్డిని కలసి ఆవేదన వ్యక్తం చేశారట.

గతంలో ఈ ఇద్దరు సోదరుల మధ్య గ్యాప్ ఉండేది. ఇప్పుడు మాత్రం కలసి పని చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారట. మరి ఈ కలయికతో ఆనం ఫ్యామిలీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అన్నది చూడాలి.