Home » భారత్‌లో ఆడీ కొత్తకారు.. ధర ఎంతంటే?
Published
2 months agoon
లగ్జరీ కార్ల సంస్థ ఆడి 2021 ఎడిషన్ AUDI A4 ను ఈ రోజు భారతదేశంలో విడుదల చేసింది. AUDI A4 2021 ధర 42,34,000 రూపాయల(42.34లక్షలు ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది. విలాసవంతమైన లగ్జరీ కారు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్ ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆడీ A4 కొత్త డిజైన్‌లో వస్తోంది. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తోంది. 190 హెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.
ఆడి A4 2021 ను ప్రారంభించిన సందర్భంగా ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, ” న్యూ ఇయర్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మా కారు లేటెస్ట్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చెయ్యడానికి సంతోషిస్తున్నాము. ఇది ఐదవ తరం. కొత్త ఆడిలో క్లాస్‌గా ఇంటీరియర్స్‌ని మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే వెసులుబాటు ఉంది. ఈ కారులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది. మిడ్-లగ్జరీ సెడాన్ విభాగంలో పోటీ ఉండగా.. కొత్త AUDI A4 గేమ్ ఛేంజర్ అని భావిస్తున్నారు.
ఈ కొత్త కారు 190 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 7.3 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 241 కి.మీ అత్యధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం అని కంపెనీ పేర్కొంది. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కీ లెస్ ఎంట్రీ, జెస్టర్ బేస్డ్ బూట్ లిడ్ ఓపెనింగ్, పవర్ ఫ్రంట్ సీట్స్, డ్రైవర్ సీట్‌కి మెమరీ ఫీచర్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 12వీ హైబ్రిడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.
ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు
రిజర్వేషన్లు ఉంటేనే రైలు ప్రయాణం..
ప్రయాణికులకు షాక్, టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీ ఆర్టీసీ
జగన్ ఎవరిని కరుణిస్తారో, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ స్థానం కోసం పోటీ
ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
కోర్టు కొట్టేసినా బీసీలకు న్యాయంచేస్తాం. అదనంగా బీసీలకు 10శాతం రిజర్వేషన్లు