లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సమ్మర్‌కి సిద్ధమవుతున్నాయ్..

Published

on

Summer Movies: 2021 సంక్రాంతి సినిమాల జోరు.. సమ్మర్ రిలీజ్ సినిమాలకు ఊపునిచ్చింది. ‘క్రాక్’, ‘రెడ్’, ‘మాస్టర్’, ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తుండటంతో.. ఇండస్ట్రీలో సినిమాల జాతర స్టార్ట్ అయ్యింది. వెంటనే సమ్మర్ రిలీజ డేట్లు అనౌన్స్ చేస్తున్నారు స్టార్స్.. ఈ సమ్మర్ సీజన్ కాస్త ముందుగానే, అంటే ఫిబ్రవరి నుంచే స్టార్ట్ కాబోతోంది.

థియేటర్లు ఓపెన్ అయినా.. సినిమాలు ఆడతాయా? ఆడియన్స్ వస్తారా? కలెక్షన్స్ ఉంటాయా.. అన్న అనుమానాలను బ్రేక్ చేస్తూ.. సంక్రాంతి సినిమాలు సమ్మర్ సీజన్‌కు ఊపునిచ్చాయి. ఫస్డ్ డేనే కోట్ల కలెక్షన్స్ కనిపించడంతో.. సంక్రాంతికి సమ్మర్ రిలీజ్ పోస్టర్లు వేసేశారు.

Uppena

గత పది నెలలుగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ పిబ్రవరి 5న రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 12న సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’.. ఆది సాయి కుమార్ ‘శశి’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మార్చిలో సమ్మర్ సీజన్ హీట్ స్టార్ట్ కాబోతోంది. ఓటీటీ రిలీజ్‌కు వెళ్లకుండా.. థియేటర్ అయితేనే వస్తాం అంటూ పట్టుదలతో ఎదురు చూస్తున్న సినిమాలు మార్చిలోసందడి చేయబోతున్నాయి. రానా ప్రధాన పాత్రలో మూడు భాషల్లో రూపొందిన ‘అరణ్య’ మార్చి 26 రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

Love Story

ఇక రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాగ చైతన్య-శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ తో పాటు నితిన్-కీర్తి సురేష్ ‘రంగ్ దే’ కూడా మార్చి 26 నే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ మూడు సినిమాలలో ‘రంగ్ దే’, ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్లకు రెడీ అవుతున్నాయి.. కానీ ‘అరణ్య’ మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. పోస్టర్ తప్పించి ఇప్పటి వరకూ అప్‌డేట్ ఇవ్వలేదు.

ఏప్రిల్.. మే లో కూడా భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. నాని-శివ నిర్వాణ కాంబినేషన్ మూవీ ‘టక్ జగదీష్’ ను ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు..

Nani

ఇక చాలా కాలం పెండింగ్‌లో ఉన్న రానా-సాయి పల్లవి ‘విరాటపర్వం’ సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అలాగే అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు సంక్రాంతికి పోస్టర్ వేశారు టీమ్. ఈ సినిమాలన్నీ ఏప్రిల్‌లో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి.

Sharwanand

సంక్రాంతి ఇచ్చిన ఊపు.. ధైర్యంతో భారీ సినిమాలు కూడా సమ్మర్ ప్లాన్లు వేస్తున్నాయి. ఆ లిస్ట్‌లో పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ తో పాటు మెగాస్టార్ ‘ఆచార్య’ కూడా ఉంది. మెగా అన్నాదమ్ములు మే ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

Vakeel Saab

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ డేట్ అయిన మే 9న సెంటిమెంట్‌గా ‘ఆచార్య’ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇక ‘వకీల్ సాబ్’ కూడా మే లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా శర్వానంద్ ‘శ్రీకారం’ లాంటి మరికొన్ని సినిమాలు కూడా సమ్మర్ బరిలో నిలవబోతున్నాయి.