4 రోజుల్లో తెలంగాణలో 203 మంది మిస్సింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

203 people missing in Telangana with in 4 days : తెలంగాణలో రోజురోజుకీ మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. 4 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 203 మంది అదృశ్యమయ్యారు. గత 8 నెలల్లో 1282 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో తల్లి సహా ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు.



మూసాపేట్-రాజీవ్ నగర్ లో నివాసముండే మానస, ఇద్దరు పిల్లలు కనిపించడంలేదు. నిన్న మధ్యాహ్నం తన పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



ఈ నెల 26న 65 మిస్సింగ్ కేసులు, 27న 62 కేసులు, 28వ తేదీన 65 కేసులు నమోదయ్యాయి. భార్య మానసకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుందని.. ఆమె భర్త పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related Tags :

Related Posts :