లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

DDLJ: Trend Setter ప్రేమకథకు పాతికేళ్లు..

Published

on

Dilwale Dulhania Le Jayenge: బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌, ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ ‘దిల్‌వాలే దుల్హనియ లేజాయేంగే’ (DDLJ) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. షారుక్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారానికి (అక్టోబర్ 20) 25 వసంతాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా సినిమాలో షారుఖ్‌-కాజోల్‌ పాత్రలకు సంబంధించిన ఓ కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని Scenes in the Square లో ఏర్పాటు చేయనున్నట్లు హార్ట్‌ ఆఫ్‌ లండన్‌ బిజినెస్‌ అలయన్స్‌ తెలిపింది. వచ్చే ఏడాదిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

Shahrukh Khan-Kajol

Aditya Chopra దర్శకత్వంలో Yash Raj Films నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో ప్రేమకథా చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. Jatin–Lalit సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎవర్‌గ్రీన్ అనే చెప్పాలి. 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా అనుబంధం ఉన్నవారు తమ జ్ఞాపకాలను ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎన్నేళ్లైనా ఈ చిత్రంతో పాటు రాజ్, సిమ్రాన్ క్యారెక్టర్లను కూడా ప్రేక్షకులు, సినీ ప్రేమికులు మర్చిపోలేరు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *