in single day 120 patients recover from corona virus in telangana

బిగ్ రిలీఫ్, తెలంగాణలో ఒకేరోజు 120మంది కరోనా నుంచి కోలుకున్నారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు సంఖ్య

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం(మే 26,2020) ఒక్కరోజే భారీగా(71) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనాల్లో ఆందోళన పెరిగింది. కరోనా వైరస్ వణుకుపుట్టిస్తున్న ఈ తరుణంలో తెలంగాణలో సానుకూల పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 120 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. వారంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1284కు చేరింది. 

ఒక్కరోజే 71 మందికి కరోనా, 2వేలకు చేరువలో కొవిడ్ కేసులు:
ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 650గా ఉంది. కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 57కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 38 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఇక మిగతా కేసుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మంది, మేడ్చల్‌ జిల్లా నుంచి 6, సూర్యాపేట, వికారాబాద్‌,  నల్గొండ, నారాయణ్‌పేట నుంచి ఒక్కొక్కరు ఉండగా.. వలసదారులు 12 మంది, విదేశాల నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నేటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేని జిల్లాలు 3 ఉన్నాయి. 14 రోజులుగా పాజిటివ్‌ కేసులు లేని జిల్లాలు 21 ఉన్నాయి.

జీహెచ్ఎంసీలో పెరుగుతున్న కేసులు, కంటైన్మెంట్ జోన్లు:
హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అదే స్థాయిలో కంటైన్మెంట్‌ జోన్లు (నియంత్రిత ప్రాంతాలు) కూడా పెరుగుతున్నాయి.  ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో 107 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోజుకు 400 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ  చేస్తున్నారు. బస్టాండ్‌లు, మార్కెట్లు వివిధ ప్రాంతాల్లోనూ క్రిమిసంహారక చర్యలు చేపడుతున్నారు. క్రమక్రమంగా మార్చి నుంచి పెరుగుతూ వచ్చిన  కంటైన్మెంట్‌ జోన్లు ఏప్రిల్‌లో దాదాపు 180కి చేరుకోగా, అనంతరం కొంత తగ్గాయి. తాజాగా, మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రస్తుతం 107కి  చేరుకున్నాయి. 

జీహెచ్‌ఎంసీలోని 6 జోన్లలో కంటైన్మెంట్ల సంఖ్య:
*ఎల్బీనగర్‌- 20
* చార్మినార్‌- 38
* ఖైరతాబాద్‌- 19
* సికింద్రాబాద్‌- 10
* కూకట్‌పల్లి- 8
* శేరిలింగంపల్లి- 12
* మొత్తం- 107 కంటైన్మెంట్‌ జోన్లు కాగా చార్మినార్‌లో అత్యధికంగా 38 జోన్లు ఉన్నాయి.

READ  Breaking News : షేక్ పేట MRO సుజాత భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

దేశంలో లక్షా 45వేల కరోనా కేసులు, 4వేల 167 మరణాలు:
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా ఆరో రోజూ ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6వేల 535 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 146 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 45వేల 380కి పెరిగింది. ఇందులో 80వేల 722 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 60వేల 490 మంది కోలుకున్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 4వేల 167 మంది బాధితులు మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జాబితాలో భారత్‌ పదో స్థానంలో నిలిచింది.  

* దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు. 
* మహారాష్ట్రలో ఇప్పటివరకు 52వేల 667 పాజిటివ్‌ కేసులు.. 1,695 మరణాలు.
* తమిళనాడులో 17వేల 82 కరోనా కేసులు, 118 మరణాలు. 
* గుజరాత్‌లో 14వేల 468 పాజిటివ్‌ కేసులు, 888 మరణాలు. 
* దేశ రాజధాని ఢిల్లీలో 14,053 కేసులు, 276 మరణాలు. 
* రాజస్థాన్‌లో 7300 పాజిటివ్‌ కేసులు, 167 మరణాలు.

Read: కొంపముంచిన పార్టీ, మటన్ వ్యాపారి కారణంగా 22మందికి కరోనా, ఆందోళనలో కొనుగోలుదారులు

Related Posts