అతనికి 19, ఆమెకు 26 ఏళ్లు…… భర్త ఇంటి ముందు భార్య ధర్నా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆమెకు 26, అతనికి 19…..అవును,  వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్లికి ఆమె సిధ్దపడింది. వారి పెళ్లికి వయస్సు అడ్డుగా మారలేదు.

అంతా సాఫీగానే సాగుతుందనుకున్న సమయంలో ఆ అబ్బాయి షాకిచ్చాడు. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా నందవరం కి చెందిన అబ్బాయి (19) డిగ్రీ చదువుతున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన యువతి (26) హైదరాబాద్ లో తల్లి తండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనంసాగిస్తున్నారు. కాగా ఆమెకు మూడు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా నందవరం యువకుడు పరిచయం అయ్యాడు.

వారి పరిచయం క్రమేపి ప్రేమగా మారింది. ఇంకేముంది హైదరాబాద్ వచ్చిన యువకుడు ఆమెను చూశాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అతనికి ఆమె బాగా దగ్గరైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్లు పెద్దదైన యువతిని పెళ్లి చేసుకోటానికి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. జులై 4న ఇద్దరూ పెళ్ళికూడా చేసుకున్నారు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులను కలిసి వస్తానని చెప్పి వెళ్ళిన యువకుడు మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆ యువతి కర్నూలు జిల్లా నందవరం చేరుకుని భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్దానిక మహిళా సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి. సమచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్ళారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts