29 TDP MLCs are with us TDP MLC Srinivas

కోసినా.. నా రక్తం పచ్చగానే ఉంటుంది – టీడీపీ డిప్యూటీ లీడర్ శ్రీనివాస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీకి చెందిన 32 మంది MLC సభ్యుల్లో…ముగ్గురు పోతే..29 మంది సభ్యులు ఒకే తాటిపైకి ఉన్నామని, పార్టీ అధ్యక్షులు బాబు ఆదేశాల మేరకు..ఐదు కోట్ల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము పని చేస్తామని టీడీపీ శాసనమండలి డిప్యూటీ లీడర్ శ్రీనివాస్‌ వెల్లడించారు. తనను కోస్తే.. రక్తం..ఎర్రగా ఉండదు..పచ్చగా ఉంటుందన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనుగుణంగా తాము పనిచేయడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు.

 

2020, జనవరి 26వ తేదీ ఆదివారం ఉదయం అమరావతిలో బాబు అధ్యక్షతన టీడీపీ ఎల్పీ సమావేశం జరుగుతోంది. శాసనమండలి రద్దు నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. శాసనసభా సమావేశాలకు హాజరు కావాలా వద్దా ? అనే దానిపై చర్చిస్తున్నారు. జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా..టీడీపీ శాసనమండలి డిప్యూటీ లీడర్ శ్రీనివాస్‌తో 10tv ముచ్చటించింది. 

 

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన, రాచరక వ్యవస్థ పరిపాలన జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై పార్టీ అధ్యక్షులు..గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలను వాళ్ల వైపుకు తిప్పుకుని..బిల్లులను ఆమోదింప చేసుకొనేందుకు చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు.

 

వైసీపీకి పార్టీకి చెందిన కీలక నేతల మండలి గ్యాలరీలో కూర్చొని, 29 మంది ఎమ్మెల్సీలు ఒకే తాటిపై ఉన్నామన్నారు. ఐదు కోట్ల ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. సెలెక్ట్ కమిటీ ఎందుకంటే భయమని ప్రశ్నించారు. ఎన్ని ప్రలోభాలు చేసినా..తమ పార్టీకి చెందిన 29 మంది ఎమ్మెల్సీలు ఒకే దగ్గర ఉన్నామన్నారు. శాసనమండలి రద్దు చేస్తే..చేసుకోమనండి..బెదిరింపులకు భయపడమన్నారు. సెలెక్ట్ కమిటీలకు బిల్లులు వెళ్లాల్సిందే..ప్రజాభిప్రాయం సేకరించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. 

Read More : క్యా బాత్ హే : నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్

Related Posts