లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు, 19 మంది మృతి

Published

on

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 74,757 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 2,901 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,11,825లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 19 మంది మరణించారు.గత 24 గంటల్లో 4,352 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 7,77,900 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 76,96,653 మందికి శాంపిల్స్ పరీక్షించగా 27,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,625కు చేరుకుంది. ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కడపలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *