3-people-can-watch-amazon-prime-video-once-heres-how-it-compares-competition

OTT పోటీదారులతో పోలిస్తే: అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకేసారి ముగ్గురు చూడొచ్చు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆన్ లైన్ వీడియో మార్కెట్లో.. ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసులకు ఫుడ్ డిమాండ్ పెరుగుతోంది. ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను ఎన్నో అందుబాటులోకి వచ్చేశాయి. ఏయే స్ట్రీమింగ్ సర్వీసులు ఎలాంటి ఫీచర్లు, అద్భుతమైన వీడియో కంటెంట్ అందిస్తున్నాయో తెలుసుకోవడం కష్టమే మరి. స్ట్రీమింగ్ సర్వీసు అందించే కంపెనీల్లో ఆన్ లైన్ యూజర్లకు టక్కున గుర్తుచ్చే వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి.

ఆ తర్వాత హాట్ స్టార్, నెట్ ఫ్లెక్స్, జీ5 ఇలా మరిన్నో స్ట్రీమింగ్ సర్వీసులు లెక్కలేనన్నీ అందుబాటులో ఉన్నాయి. స్ట్రీమింగ్ సర్వీసుల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. వ్యూయర్లను ఆకర్షించేందుకు తక్కువ రేట్లకే మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి. అదే.. అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వస్తే.. ఇందులో మూవీలతో పాటు టీవీ స్ట్రీమింగ్ సర్వీసుల్లో అమెజాన్ మ్యూజిక్ తో పాటు ప్రైమ్ మెంబర్ షిప్ కూడా ఆఫర్ చేస్తోంది. మీరు ఏ ప్యాకేజీతో యాక్టివేట్ చేసుకున్నా ఫుల్ రేట్ చెల్లించినా లేదా డిస్కౌంట్ ధరకు చెల్లించినా బెనిఫిట్స్ మాత్రం ఒకేలా ఆఫర్ చేస్తోంది. 

అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక అకౌంట్లో ముగ్గురు యూజర్లు మూడు డివైజ్‌ల్లో ఒకేసారి కంటెంట్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. దీనికి ఒక్కో యూజర్ వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఒక్కొక్కరూ వేర్వేరు కంటెంట్ చూసినంతవరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఒకే వీడియో కంటెంట్ ఒకే టైటిల్ తో ఒకేసారి వీక్షించాలనుకుంటే మాత్రం రెండు డివైజ్ ల కంటే ఎక్కువ డివైజ్ ల్లో చూడలేరు. ఇతర స్ట్రీమింగ్ సర్వీసులతో పోలిస్తే.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకే అకౌంట్.. మల్టీపుల్ డివైజ్ ల్లో యాక్సస్ చేసుకోవచ్చు.

Fire Stick నుంచి ప్రైమ్ వీడియో యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఐప్యాడ్ ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు. ఒకే అకౌంట్‌తో మూడు డివైజ్ లపై ఒకేసారి స్ట్రీమింగ్ చేసుకునేందుకు వీలుంది. ఇతర పోటీదారుల మాదిరిగా అమెజాన్ ప్రైమ్ లో కుటుంబ సభ్యుల కోసం వేర్వేరు అకౌంట్లు క్రియట్ చేయాలసిన అవసరం లేదు. మూవీలు, షోలు అన్నింటిని వేర్వేరు డివైజ్ ల్లోనూ వీక్షించవచ్చు. కానీ, మీ అకౌంట్ ను ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు స్ట్రీమింగ్ చేస్తే మాత్రం ఒక వార్నింగ్ మెసేజ్ పాప్ అప్ అవుతుంది. 

మరో స్ట్రీమింగ్ సర్వీసు Hulu కూడా స్ట్రీమింగ్ కంటెంట్ యాక్సస్ చేసుకునేందుకు ఇద్దరు యూజర్లకు అనుమతిస్తోంది. అయినప్పటికీ లైవ్ టీవీ ప్యాకేజీలను మాత్రం అన్ లిమిటెడ్ స్ర్కీన్లలో వీక్షించవచ్చు. మరోవైపు నెట్ ఫ్లెక్స్ స్ట్రీమింగ్ సర్వీసు ఎక్కడైనా ఒక యూజర్ నుంచి నలుగురు యూజర్ల వరకు అనుమతి ఉంది. అది కూడా మీరు ఎంచుకున్న ప్లాన్ బట్టి అనుమతి ఇస్తుంది. అదేవిధంగా కొత్త డిస్నీ ప్లస్ సర్వీసు కూడా నెలకు 6.99 డాలర్ల సబ్ స్ర్కిప్షన్ పై నాలుగు డివైజ్ ల వరకు స్ట్రీమింగ్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. అంతేకాదు.. ఏడు వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా అందిస్తోంది. 

Related Posts

Trending

Latest News