Home » కశ్మీర్ లో ఉగ్రదాడి: ముగ్గురు ఉగ్రవాదులు, జవాను మృతి
Published
1 year agoon
By
subhnభద్రతా సిబ్బందిపై గ్రనేడ్లతో రెండు ప్రాంతాల్లో దాడి చేశారు. గాందర్ పల్లిలోని ఓ నివాసంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో దళాలపై ముష్కరులు దాడి జరిపారు. ధీటుగా బదులిచ్చినప్పటికీ భారత జవాను ఒకరు మరణించారు.
ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత రెచ్చిపోతున్నాయి. కశ్మీర్ లో రక్తపాతం జరుగుతుందన్న ఇమ్రాన్ మాటలు నిజం చేసి అంతర్జాతీయ దేశాల ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరో పుల్వామా దాడి జరుగుతుందన్న ఇమ్రాన్ వార్నింగ్ నిజం చేసేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.
రెండు చోట్ల వాహనాలను హైజాక్ చేసి దాడులకు ప్రయత్నించారు. గాందర్బల్లోని రహదారిపై ఓ కారును ఆపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. వాహన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయి సైనిక కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. ఈలోపు బస్సును కూడా ఆపేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు మొదట సైనిక దుస్తుల్లో ఉండటంతో ముందు వాహనం ఆపాలనుకుని తర్వాత ముందుకు వెళ్లిపోయాడు.
సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు వారిపైకి దాడి చేశారు. ఓ ఇంట్లోకి చొరబడి దాడులకు యత్నిస్తుండటంతో సైన్యం వారిని చుట్టుముట్టింది. ఎదురు కాల్పులు జరిపిన బలగాలు బందీగా ఉన్న వ్యక్తిని విడింపించినట్లు అధికారులు తెలిపారు.