వ్యభిచారం నిర్వహిస్తున్న నటుడు అరెస్ట్.. ముగ్గురు నటులతో పాటు బెల్లీ డ్యాన్సర్‌ను కాపాడిన పోలీసులు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mumbai Prostitution Racket: గతకొద్ది రోజులుగా నెపోటిజం, డ్రగ్స్ ఆరోపణలు, మీటూ వ్యాఖలతో అట్టుడుకుతున్న బాలీవుడ్‌లో తాజాగా వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. ముంబైలోని ఓ five-star hotel లో ఈ దందా నడుపుతున్న ఓ నటుణ్ణి  పోలీసులు రట్టు చేశారు.

ఇందులో చిక్కుకున్న ముగ్గురు బుల్లితెర నటులతో పాటు ఓ బెల్లీ డ్యాన్సర్‌‌ను పోలీసులు కాపాడారు. కొంతమంది మహిళలు ఓ వ్యభిచార ముఠా ఉచ్చులో చిక్కుకుపోయినట్లు ఇటీవల ముంబై పోలీసులకు సమాచారం రావడంతో ఈ ముఠా గుట్టు బయట పెట్టేందుకు పోలీసులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.

నిందితులను పట్టుకునేందుకు ఓ నకిలీ కస్టమర్‌ని హోటల్‌కు పంపించారు. అతడికి ముగ్గురు మహిళలను ఇచ్చేందుకు రూ.10.5 లక్షలకు ఆ నటుడు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తరువాత సీనియర్ పోలీస్ అధికారి మహేష్ థావడే నేతృత్వంలోని ఓ బృందం.. గోరేగావ్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌పై దాడి చేసి సినీ నటుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Related Tags :

Related Posts :