లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుకునే మొదటి 3 కోట్ల మంది వీళ్లే..

Published

on

CoronaVaccine: హెల్త్‌కేర్ స్పెషలిస్టులతో కలిపి మూడుకోట్లమందికి మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇండియా రెడీ అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి పోరాడుతున్న frontline workersకు తొలి దశలో వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ్ అధికారులు మంగళవారం వెల్లడించారు.

ఆ 30మిలియన్ మందిలో 7మిలియన్ మంది డాక్టర్లు, పారామెడిక్స్ మిగతా 20మిలియన్ మందిలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు ఉన్నట్లు కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్ మంగళవారం పేర్కొన్నారు. 30మిలియన్ మందికి అందించేందుకు సరిపడ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను దేశవ్యాప్తంగా రెడీ అయింది.‘ట్రాన్స్‌పోర్ట్, సిరంజీలు, ప్యాకేజింగ్’ వంటివన్నీ రెడీగా ఉన్నాయని ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ అందించేందుకు ఫస్ట్ ఫేజ్‌‌ను జనవరి-జూన్ 2021గా నిర్ణయించారు.

‘వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై నేషనల్ ఎక్స్‌పర్ట్ కమిటీ డ్రాఫ్ట్ ప్రియారిటిజేషన్ ప్లాన్ తో వచ్చింది. దీంతో పాటు డ్రాఫ్ట్ ప్లాన్ పరిగణనలోకి తీసుకుని డోజులు ఎన్ని ఇవ్వాలనేది, అందుబాటులో ఉన్నదానిని బట్టి జనవరి నుంచి జులై 2021మధ్య వేస్తుంటారు. ప్లాన్ ప్రకారం.. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ సక్సెస్ అయితేనే.. జనవరి నుంచి డోసులు అందుబాటులో ఉంటాయి’ అని భూషణ్ తెలిపారు.

కరోనా మందును అందజేసేది కొందరికి మాత్రమే.. కేంద్రం సన్నాహాలు


వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా వారు ప్రొటెక్షన్ ను మర్చిపోకూడదు. వైరస్ సోకకుండా తీసుకున్న అదే జాగ్రత్తలు పాటించాల్సిందే. టెస్ట్ చేసి ట్రీట్ చేస్తూనే ఉంటాం. ఈ ప్రోసెస్ కు రిలాక్సేషన్ అనేది లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) చీఫ్ డా.బలరాం భార్గవ అన్నారు.

ఇండియా గత 50ఏళ్లుగా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంది. ఏటా పిల్లలు, పెద్దవాళ్లు కలిపి 25మిలియన్ మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.

‘మనకు 28వేలకు పైగా కోల్డ్ స్టోరేజీలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. పలు రకాల వ్యాక్సిన్లు ప్రోగ్రాంలో భాగంగా స్టోర్ చేసి ఉంచుతున్నారు. వీటన్నిటి టెంపరేచర్లు ఎప్పటికప్పుడు సెంట్రలైజ్డ్ సర్వర్ లో అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి’ అని భూషణ్ చెప్పారు.
‘మా డిజిటల్ ప్లాట్‌ఫాం పైన కూడా అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంచుతాం. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ నుంచి స్టోరేజి దాకా, కోల్డ్ చైన్, రిఫ్రిజరేటెడ్ వాహనాల్లో ట్రాన్స్‌పోర్టేషన్, ప్రత్యేకమైన బాక్సుల్లో కరెక్ట్ టెంపరేచర్ వద్ద రెగ్యులేట్ చేయడం వంటి ఏర్పాట్లు అన్నీ చూస్తున్నాం. ఆల్రెడీ ఇండియాలో ఈ ఫెసిలిటీ ఉంది. దీని కోసం నేషనల్ లెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీ రెడీగా ఉంది’ అని ఆయన అన్నారు.

కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం కొవిడ్ వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలని క్లెయిమ్ చేస్తున్నాయి. దీని కోసం ప్రైవేట్ యాజమాన్యాలను సంప్రదిస్తున్నామని భూషణ్ తెలిపారు.

ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నట్లు వ్యాక్సిన్ ఎప్పుడు రెడీ అవుతుందో చెప్పలేం. ‘వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విషయాన్ని చెప్పలేం. ఒకసారి వచ్చిందంటే చాలా దేశాలు దీని కోసం లైన్లో ఉంటాయి’ అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ డా. కే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *