లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘నువ్వొదిలే ఆ ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే’..

Published

on

30 Rojullo Preminchadam Ela: టెలివిజన్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘1 నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక..

30 Rojullo Preminchadam Ela

‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ యూట్యూబ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు.. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు జనవరి 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం సాయంత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ట్రైలర్‌ను టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

ట్రైలర్ ఆసక్తికరంగా కొనసాగింది. సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగే కథగా చూపించారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, మ్యూజిక్ చక్కగా కుదిరాయి. ప్రస్తుత మరియు పునర్జన్మలో సాగే రెండు ప్రేమకథలను ట్రైలర్‌లో చూపించారు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ వెండితెర మీద కూడా ఆడియెన్స్‌ను ఎంత వరకు ఆకట్టుకుంటాడనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.