లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో అలజడులకు పాకిస్తాన్ కుట్ర

Updated On - 6:50 am, Mon, 25 January 21

300 Pak Twitter Handles రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్​ కుట్ర పన్నినట్టు ఆదివారం(జనవరి-24,2021)ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో దాదాపు 300కుపైగా పాకిస్తాన్​ ట్విట్టర్​ ఖాతాలను గుర్తించినట్టు స్పష్టం చేశారు.

ఈ ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రపన్నారని తెలిపారు. ఈ సమయంలో ట్రాక్టర్​ ర్యాలీని నిర్వహించడం పెద్ద సవాలు అయినప్పటికీ మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ర్యాలీ సాగుతుందని స్పెషల్ పోలీస్ కమిషనర్(ఇంటెలిజెన్స్)దీపేంద్ర పాఠక్ తెలిపారు.​

కాగా, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు రెండు నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా టిక్రీ, సింఘు, గాజీపుర్​ సరిహద్దుల్లో రిపబ్లిక్ డే రోజున భారీగా ట్రాక్టర్ ర్యాలీకి తలపెట్టారు. ట్రాక్టర్​ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించిన ఢిల్లీ పోలీసులు.. రైతులతో నాలుగుసార్లు చర్చలు జరిపారు. అయితే చివరికి అనుమతిచ్చారు