రాజమండ్రి జైల్లో కరోనా నుంచి కోలుకున్న 300మంది ఖైదీలు, ఫలితాన్ని ఇచ్చిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. 300 మంది ఖైదీలు కరోనా నుంచి కోలుకున్నారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. దీంతో ఇటు ఖైదీలు అటు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అగస్టులో కరోనా బారినపడ్డారు. మొత్తం 1700 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 300 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు కరోనా బారిన పడిన ఖైదీలకు ప్రత్యేక బ్యారక్‌ ఏర్పాటు చేశారు. మిగిలిన ఖైదీలతో కలవకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే మెరుగైన వైద్య సేవలు అందించారు.

మణియమ్మల్..నా దేవతవు నీవే : భార్య బొమ్మతోనే ఆయన ముచ్చట్లు


ఖైదీలు కరోనా బారినపడిన వెంటనే పూర్తి స్థాయి వైద్యంతో పాటు బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఖైదీలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా వైద్య సేవలందించారు. కరోనా బాధితులందరికీ చికిత్స తర్వాత పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చిందని జైలు అధికారులు తెలిపారు.
ఏపీలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 61వేల 529 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7వేల 956 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 5లక్షల 75వేల 079కు పెరిగాయి.

అలాగే రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. కొన్ని వారాల క్రితం ప్రతి రోజూ 90కి పైగా సంభవించే మరణాలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 66 కరోనా మరణాలు సంభవించగా, సోమవారం కోవిడ్ బారినపడి మరో 60 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 4వేల 972కు పెరిగింది.

కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురంలో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఏపీలో కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 9వేల 764 మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 5లక్షల 75వేల 079 పాజిటివ్ కేసులకు గాను 4లక్షల 76వేల 903 మంది డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం 93వేల 204 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 78 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో కలిపి తూర్పు గోదావరిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 78వేల 220 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

READ  చంద్రబాబు ఆగ్రహం : అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవటానికా!

Related Posts