లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఇవాంకా ట్రంప్ సెక్యూరిటీకి టాయిలెట్ కష్టాలు.. నెలకు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా?

Published

on

Toilet for Ivanka Trump_Jared Kushner Secret Service detail : అమెరికాలో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లకు టాయిలెట్ కష్టాలు తప్పడం లేదు. వాషింగ్టన్ ఎలైట్ కలోరమా అనే విలాసవంతమైన భవనంలో మాజీ అమెరికా అధ్యక్షుల నుంచి కేబినెట్ సెక్రటరీలు ఇక్కడే నివాసముంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ భవనంలో నివాసముండే వారికి యూఎస్ సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు రక్షణగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భవనం పరిసరాల్లో భవనంలో భద్రతపరంగా తలెత్తే సమస్యలను నియంత్రించడంలో ఆందోళన చెందాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సీక్రెట్ సర్వీసు ఏజెంట్లకు కొత్త కష్టం వచ్చి పడింది.

ఇప్పుడు ఇదే భవనంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరికి రక్షణ ఉండే యూఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి టాయిలెట్ కష్టాలు మొదలయ్యాయి. వీరికోసం టాయిలెట్ లేక ఇబ్బందులు పడుతున్నారంట.. ప్రత్యేకించి సీక్రెట్ సర్వీసు ఏజెంట్లకు టాయిలెట్ సౌకర్యం కోసం నెలకు లక్షల్లో ఖర్చుఅవుతుందంట. దాదాపు నెలకు 2.20 లక్షల పైనే ఖర్చు చేస్తున్నారంట. ఆరు బెడ్ రూంలు, ఏడు బాత్ రూంలు, 5వేల చదరపు అడుగల విస్తీర్ణంలో ఉండే విలాసవంతమైన భవనంలో సెక్యూరిటీ సిబ్బంది ఉండేందుకు అవసరమైన టాయిలెట్ వసతి లేదంట..

అంతేకాదు… భవనంలోకి వెళ్లేందుకు కూడా వీరికి అనుమతి ఉండదట.. ఇవాంకా దంపతులకు రక్షణగా ఉండే ఈ సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం సరైన నివాసం, టాయిలెట్ సౌకర్యాన్ని భవనంలో కల్పించలేదు. ఈ సెక్యూరిటీ ఇబ్బంది టాయిలెట్ సౌకర్యం కోసం సమీపంలో ఒక భవనాన్ని రెంటుకు తీసుకున్నారంట.. సెక్యూరిటీ ఏజెన్సీ వసతి సౌకర్యాల కోసం ప్రతినెలా 3వేల డాలర్లు ఖర్చు చేస్తోంది ఫెడరల్ ప్రభుత్వం. అంటే.. మన కరెన్సీలో రూ.2.20లక్షల వరకు ఉండొచ్చు. 2017 నుండి ఇప్పటివరకు 100,000 డాలర్ల కంటే ఎక్కువగానే చెల్లిస్తూ వచ్చింది.

సీక్రెట్ సర్వీసు సిబ్బందికి టాయిలెట్ సౌకర్యాన్ని పరిమితం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అంతటి పెద్ద భవనంలో సీక్రెట్ ఏజెంట్ల నివాసానికి ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలను వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు ఖండించారు. ఇది సీక్రెట్ సర్వీస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. ట్రంప్ కుటుంబం అభ్యర్థన మేరకు ఏజెంట్లను దూరంగా ఉంచారని చెప్పారు.