లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పోలీస్ స్టేషన్ లో 31 మందికి కటింగ్, ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన

Updated On - 8:12 pm, Wed, 27 January 21

haircuts at police station : పోలీస్ స్టేషన్ లో 31 మంది పోలీసు అధికారులు కటింగ్ చేసుకోవడం పట్ల..ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన విధించారు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. చేసిన కటింగ్ కు Turkish origin కు చెందిన వ్యక్తి ఒక్కొక్కరి వద్ద రూ. £10 వసూలు చేశాడు.

జనవరి 17వ తేదీన కరోనా వైరస్ ప్రబలడంతో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో తూర్పు లండన్ లోని Bethnal Green police station లోని అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కటింగ్ చేసుకొనేందుకు ఓ మంగళిని నియమించుకున్నారు. 31 మంది అధికారులు కటింగ్ చేసుకున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. జట్టు కత్తిరించే సమయంలో…ఇతరులు చాలా మంది ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు.

కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించారని, మెట్రో పాలిటన్ పోలీసు అధికారులందరికీ నోటీసులు జారీ చేశారు. 31 మంది మెట్రోపాలిటన్ పోలీసు అధికారులకు రూ. £200 (రూ. 20 వేలు) జరిమాన విధించారు. అధికారుల బాధ్యతారహితంగా ఉన్నారని Detective Chief Superintendent Marcus Barnett అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ఉన్నట్లు తేలితే..చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఓ కేఫ్ లో టిఫిన్ తిన్నందుకు Met officers లకు ఒక్కొక్కరికి రూ. £ 200 జరిమాన విధించిన తర్వాత..ఈ ఘటన చోటు చేసుకుంది.