34 shops open in tamilnadu from Monday

చెన్నైలో 34 రకాల షాపులు ఓపెన్ చేసుకోవచ్చు : కరోనా షరతులు వర్తిస్తాయి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘లాక్ డౌన్’ తో మూత పడిన షాపులతో వ్యాపారులతో పాటు ప్రజలు కూడా నానా యాతనలకు గురవుతున్నారు. ముఖ్యంగా చిరువ్యాపారులు పూర్తిగా చితికిపోయారు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం 34 రకాల షాపులు తెరుచుకోవచ్చునంటూ నుమతినిస్తూ ఆదివారం (10.5.2020) సీఎం  పళనిస్వామి ప్రకటన జారీ చేశారు. దీంతో ఆ 34 రకాల షాపులు సోమవారం నుంచి తెరుచ్చుకోనున్నాయి. దీంతో ఆయా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా.. సోమవారం నుంచి కరోనా బాధిత ప్రాంతాలు (చెన్నై సహా రెడ్‌జోన్‌ ప్రాంతాలు) మినహా రాష్ట్రమంతటా 34 రకాల దుకాణాలు తెరచేందుకు అనుమతిస్తున్నట్టు ఎడప్పాడి తెలిపారు. సెలూన్లు, బ్యూటీఫార్లర్లు తెరిచేందుకు అనుమతి లేదని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. 

సీఎం జారీచేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలో సోమవారం నుంచి పనిచేయనున్న దుకాణాల వివరాలు ఇలా ఉన్నాయి..

1. బేకరీలు (పార్శిల్‌ మాత్రమే)

2.టీషాపులు (పార్శిల్‌ మాత్రమే)

3. హాటళ్లు (పార్శిల్‌ మాత్రమే)

4.సిమెంట్‌, హార్డ్‌వేర్‌, శానిటరీవేర్‌ షాపులు

5.  పూలు, పండ్ల షాపులు

6.నిర్మాణ వస్తువులు అమ్మే షాపులు

7.మొబైల్‌ ఫోన్‌ దుకాణాలు, మొబైల్‌ ఫోన్ల సర్వీస్‌ సెంటర్లు

8. ఎలక్ర్టానిక్‌ వస్తువుల దుకాణాలు, సర్వీస్‌ సెంటర్లు

9. కంప్యూటర్‌ పరికరాలు, కంప్యూటర్‌ సర్వీస్‌ సెంటర్లు

10. గృహోపయోగ యంత్రాలు, వస్తువులు అమ్మే దుకాణాలు11.

12. కళ్ల అద్దాలు, కంటి అద్దాల రిపేరు షాపులు 

13. చిన్న నగల దుకాణాలు (ఏసీలు లేని షాపులు మాత్రమే)

14. చిన్న జౌళి దుకాణాలు (ఏసీలు లేని షాపులు మాత్రమే)

15. మిక్సీ, గ్రైండర్‌ సర్వీస్‌ సెంటర్లు

16. టీవి సేల్స్‌ షాపులు, సర్వీసు సెంటర్లు

17. బడ్డీ కొట్లు

18. ఫర్నీచర్‌ దుకాణాలు

19. ఫ్లాట్‌ఫామ్‌పై తోపుడు బండ్ల దుకాణాలు

20. లాండ్రీ షాపులు 

21. కొరియర్‌, పార్శిల్‌ సర్వీసు సెంటర్లు

22. లారీ బుకింగ్‌ సర్వీస్‌ షాపులు

23. జిరాక్స్‌ సెంటర్లు

24. బైకులు, కార్ల షాపులు

25. బైకులు, కార్ల మెకానిక్‌ షెడ్లు

26. నాటు మందు షాపులు

27. ఎరువుల షాపులు

28. టైల్స్‌ షాపులు

29. పెయింట్‌ షాపులు

30. ఎలక్ర్టికల్‌ షాపులు

31. ఆటోమొబైల్‌ విడిభాగలు అమ్మే షాపులు

32. నర్సరీ గార్డెన్లు

33. టింబర్‌ డిపోలు, ఫ్లయివుడ్‌ షాపులు

34. సా మిల్లులు (రంపపు కోత షాపులు)

ఈ షాపులన్నింటిలోనూ కరోనా వైరస్‌ నిరోధకాలకు సంబంధించిన అన్ని  నియమనిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనల్లో అతి ముఖ్యంగా భౌతికదూరం పాటించాలని, షాపులో ఉన్నవారు, షాపులకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి ఉండాలని, ఈ నిబంధనలు పాటించనట్టయితే స్థానిక అధికారులు దుకాణాలు సీజ్‌ చేస్తారని ప్రభుత్వం హెచ్చరించింది. 

READ  రుణాలు చెల్లించేందుకు అంగీకరించండి...కేసులు మూసేయండి

Read More:

రసాయనాలు వాడకుండానే ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కరెన్సీ నోట్లు శానిటైజ్ చేసేందుకు హైదరాబాద్ డీఆర్డీవో కొత్త ఆవిష్కరణ

* సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఏపీలో దుకాణాలకు అనుమతి, ఉ.7 నుంచి రా.7 వరకు ఓపెన్

Related Posts