34 ఏళ్ల మాయ లేడీ….. 30 ఏళ్ళుగా అదే పని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

34 year old domestic help, a serial thief active since 1990 : 30 ఏళ్లుగా దొంగతనాలే వృత్తిగా జీవిస్తున్న మాయలేడీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వనితా గైక్వాడ్(34) అనే మహిళ ఇళ్లల్లో పని కావాలంటూ చేరి పని దొరికిన కొద్ది గంటల్లోనే ఆ ఇంట్లో దొంగతనం చేసి… విలువైన వస్తువులు చేజిక్కించుకుని పారిపోయేది.

అక్టోబర్ 19న బాంద్రాలోని ఒక వ్యాపార వేత్త ఇంట్లో నగదు, బంగారం, వజ్రాల ఆభరణాలు కాజేసి పరారవటంతో ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు వనితతో పాటు ఆమెకు సహాయం చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.గడిచిన 30 ఏళ్లలో 1990 నుంచి వనిత సుమారు 40 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 2019లో శాంతాక్రజ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో పనిలో చేరిన కొద్ది గంటల్లోనే వనిత దొంగతనం చేసింది. ఆ చోరీలో రూ.5.3లక్షల విలువైన నగలు కాజేసిందని పోలీసులు తెలిపారు.

ఫోన్లో అసభ్యంగా వేధిస్తున్న వ్యక్తి….ఇంటికి రమ్మన్న తల్లీకూతుళ్లు…
Related Tags :

Related Posts :