యూరిన్ పోసినందుకు రూ.2,500 లంచం తీసుకున్న హోం గార్డులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో రోడ్డు పక్కన బహిరంగ మూత్రవిసర్జన చేశాడనే కారణంతో నలుగురు హోం గార్డులు ఒక వ్యక్తిని పోలీసుస్టేషన్ కు రమ్మన్నారు. అక్కడ అతనిపై కేసు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరించారు. లఘుశంక తీర్చుకున్న కారణంగా ఈ తలకాయ నొప్పి ఎందుకని వారితో బేరం కుదర్చుకున్నాడు ఆవ్యక్తి. కేసు లేకుండా వదిలేయాలంటే రూ. 2,500 ఇమ్మని హోంగార్డులు డిమాండ్ చేయటంతో వారికి ఆ మొత్తం ఇచ్చి బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాడు.

గ్రేటర్ నోయిడాకు చెందిన అశుతోష్ సెప్టెంబర్9, బుధవారం సాయంత్రం ఇండ్రస్ట్రియల్ ఏరియాలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజర్యయ్యాడు. ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలో ఎల్జీ చౌక్ ఏరియాలో రోడ్డు పక్కన ట్రాఫిక్ తక్కువగా ఉన్న ఏరియాలో మూత్ర విసర్జన చేశాడు. ఇది గమనించిన నలుగురు హోం గార్డులు అశుతోష్ వద్దకు వచ్చి పోలీసుస్టేషన్ కు రమ్మన్నారు. స్టేషన్ కు ఎందుకు రావాలని అశుతోష్ హోం గార్డులను ప్రశ్నించాడు.


Gaganyaan : నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ


బహిరంగ మూత్ర విసర్జన చేయటం నేరం కనుక మీపై కేసు పెట్టాలని వారు చెప్పారు. ఎరక్కపోయి మూత్ర విసర్జన చేశానే అని బాధ పడుతూ వాళ్లతో బేరానికి దిగాడు. చివరకు రూ.2,500 లు ఇస్తే కేసు లేకుండా విడిచి పెడతామని వారు చెప్పటంతో ఆ మొత్తం చెల్లించి అక్కడ్నించి బయటపడ్డాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అశుతోష్ కు పోలీసు పెట్రోలింగ్ వాహానం కనిపించింది. వారికి హోం గార్డులు తనను అడ్డగించిన విషయం చెప్పాడు.అశుతోష్ వద్ద వివరాలు తీసుకున్న పెట్రోలింగ్ సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చారు. అక్కడ వారు గాలింపు చేపట్టగా పోలీసు డ్రస్ ధరించిన నలుగురు హోం గార్డులు కంట పడ్డారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయబోగా అందులో ఇద్దరు తప్పించుకుపారిపోయారు. పట్టుబడిన వారు బులంద్ షహర్ కు చెందిన రామ్ అవతార్ , దాద్రికి చెందిన రాజేష్ కుమార్ గా గుర్తించారు.

తప్పించుకు పారిపోయిన మరో ఇద్దరు హోం గార్డుల వివరాలను వారి వద్ద నుంచి పోలీసులు తెలుసుకున్నారు. ఈ నలుగురు సభ్యులు 2015లో ఇదేరకమైన నేరాలు చేసినందుకు వారికి జైలు శిక్ష విధించామని, అయినా వారు తమ పధ్ధతి మార్చుకోలేదని డీసీపీ రాజేష్ కుమార్ సింగ్ చెప్పారు.


Related Posts