4 KG Gold Seized In Marredpally

సికింద్రాబాద్‌లో 4 కిలోల బంగారం పట్టివేత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బంగారం..అక్రమమార్గంలో తరలించడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుడడంతో అధికంగా డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ ఇంట్లో కిలోల బంగారం బయటపడడంతో షాక్ తిన్నారు అధికారులు. బంగారంతో పాటు కోట్ల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడ్‌పల్లిలో చోటు చేసుకుంది. 

షెనాయ్ హాస్పిటల్ సమీపంలోని ఓ ఇంట్లో భారీగా బంగారం ఉందని DRI అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు..సోదాలు నిర్వహించారు. 4 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కారులో బంగారం ఉన్న బ్యాగ్‌ను గుర్తించింది. బంగారంతో పాటు రెండు కోట్ల విలువైన బంగారం అమ్మకాలకు సంబంధించిన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కాలికట్‌ నుంచి ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర దేశాల నుండి దొంగతనంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు అధికారులు.
Read More : ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం : ఇద్దరు మృతి

Related Tags :

Related Posts :