రాజస్థాన్ లో దారుణం : వివాహితపై గ్యాంగ్ రేప్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్థాన్‌లో కామాంధులు రెచ్చిపోయారు. తన మేనల్లుడితో వెళుతున్న మహిళపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. యువకుడిని కొట్టి ఆరుగురు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అల్వార్‌ జిల్లాలోని టిజారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. 45 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ టిజారా కుషల్‌సింగ్‌ చెప్పిన వివరాల ప్రకారం ……‘ఓ వివాహిత(40) తన మేనల్లుడితో కలిసి వేరొకరికి డబ్బులు ఇవ్వడానికి వెళ్లారు. వారికి డబ్బులు ఇచ్చేసి తిరిగి తమ పనులు ముగించుకొని వారు ఇంటికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలోని ఓ కొండ ప్రాంతంలో వారికి ఆరుగురు వ్యక్తులు తారస పడ్డారు. వారిని కొంతదూరం వెంబడించి నిర్మానుష్య ప్రదేశంలో వారిని అడ్డగించారు.

అనంతరం మేనల్లుడిపై విచక్షణారహితంగా దాడి చేసి, పక్కకు పడేశారు. వివాహితపై వారు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే వారు ఈ అకృత్యాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంటికి వెళ్లిన బాధిత మహిళ జరిగిన ఘటనను భర్తకు వివరించింది.వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ కుషల్‌ సింగ్‌ తెలిపారు.

Related Posts