లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

డేంజర్ బెల్స్ : చైనా ఐస్‌క్రీమ్‌లో కరోనావైరస్.. ఎవరెవరూ తిన్నారో ట్రేస్ చేస్తున్న అధికారులు

Published

on

ice cream contaminated with Covid in China : చైనాలో కరోనావైరస్ డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. డ్రాగన్ దేశంలో ఐస్ క్రీంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. ఐస్ క్రీమ్ శాంపిల్స్ పరీక్షించగా కరోనావైరస్ పాజిటివ్ ఫలితాలు వచ్చాయని చైనా వైద్యాధికారులు వెల్లడించారు. దాదాపు 4,800 ఐస్ క్రీమ్ బాక్సుల్లో కరోనా వైరస్ ఉందని నిర్ధారించారు. ఈ ఐస్ క్రీమ్ తిన్నవారిలో ఎంతమందికి వైరస్ సోకిందో ట్రేస్ చేస్తున్నారు వైద్యాధికారులు. ఈశాన్య దేశమైన చైనాలో టియాజిన్ మున్సిపాలిటీ ప్రాంతంలో స్థానికంగా తయారు చేసిన ఐస్ క్రీం కంటెంట్ నుంచి మూడు శాంపిల్స్ అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపారు.

ఐస్ క్రీంలో కరోనా కలుషితమైనట్టు నిర్ధారించినట్టు వెల్లడించారు. Tianjin Daqiaodao అనే ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్ క్రీం బాక్సుల్లో కరోనా కలుషితమైనట్టు గుర్తించారు. ఇప్పటికే స్టోరేజీలో ఉంచిన 2,089 ఐస్ క్రీం బాక్సులకు అధికారులు సీల్ వేశారు. మిగిలిన 1,812 ఐస్ క్రీం బాక్సులను ఇతర ప్రావిన్స్‌లకు పంపిణీ చేయగా, మరో 935 ఐస్ క్రీం బాక్సులు స్థానిక మార్కెట్లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇప్పటివరకూ కేవలం 65 బాక్సులు మాత్రమే విక్రయించినట్టు అధికారులు గుర్తించారు.

450గ్రాముల ఐస్ క్రీం బాక్సుల్లో ఉక్రేయిన్ నుంచి తెచ్చిన మిల్క్ ఫౌడర్, న్యూజిలాండ్ నుంచి వెన్నప్రోటీన్ వాడినట్టు వైద్యాధికారులు గుర్తించారు. ఈ ఐస్ క్రీంలను ఎవరెవరు తిన్నారో ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 1,662 మంది కంపెనీ ఉద్యోగులను సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. అలాగే కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలని అధికారులు సూచించారు.

ఐస్ క్రీం ఫ్యాక్టరీలో శానిటైజేషన్, సరైన పారిశుధ్యం లేకపోవడం కారణంగానే వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. అందులోనూ ఐస్ క్రీంను ఫ్యాట్ తో తయారుచేస్తారు. కోల్డ్ టెంపరేచర్ వద్ద స్టోర్ చేస్తారు. దీనికారణంగానే వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని ఐస్ క్రీం బాక్సుల్లో కలుషితం కాలేదని, కలుషితమైన ఐస్ క్రీంలను వేరు చేశామని అధికారులు చెబుతున్నారు.