లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

మహిళను వేధించాడని వ్యక్తిని కొట్టి చంపిన ప్రజలు

Published

on

49 year old man died in kasargod after mob lynching due to misbehaving a woman : కేరళలోని కాసర్ గోడ్ లో దారుణం జరిగింది. ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 49 ఏళ్ళ వ్యక్తిని స్ధానికులు కొట్టి చంపిన దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది.

కాసర్గోడ్ లోని చెమ్మనాడ్ లో నివసించే రఫీక్ అనే వ్యక్తి స్ధానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడ ఉన్న కుంబాలాకు చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను వివస్త్రను చేయబోగా ఆ మహిళ గట్టిగా అరిచి అతడిపై దాడికి యత్నించింది. వెంటనే రఫీక్ ఆస్పత్రి  నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చాడు. ఆ మహిళ కూడా రఫీక్ నువెంబడిస్తూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన రఫీక్ సమీపంలోని ఆటో స్టాండ్ వరకు వచ్చాడు.

ముందు పురుషుడు, వెనుక మహిళ అరుస్తూ పరిగెత్తుకు రావటం గమనించిన స్ధానికులు రఫీక్ ను పట్టుకున్నారు.  మహిళ తనపై అత్యాచారం చేయబోయాడని చెప్పి రఫీక్ ను కొట్టింది.   దీంతో అతడ్ని పట్టుకున్న చుట్టు పక్కల వారంతా కలిసి రఫీక్ ను చితకబాదారు.  ఒకనొక  సమయంలో రఫీక్ వారినుంచి తప్పించుకుపారిపోదామని ప్రయత్నించగా మరికొందరు పట్టుకుని అతనిపై పిడిగుద్దులు వర్షం కురిపించారు.

స్ధావికులు కొట్టిన దెబ్బలకు రఫీక్  స్పృహ  కోల్పోయాడు.  అతడ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే రఫీక్ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.   పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు. ఇప్పటికే రఫీక్ ను కొడుతున్న సీసీటీపీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.