లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

Real Life ఫ్రెండ్స్‌ను దగ్గర చేసే 5 యాప్స్ ఇదిగో!

Published

on

5 Apps That Help You Manage Real-Life Friends

అసలే ఉరుకుల పరుగుల జీవితం. క్షణం కూడా తీరికగా మాట్లాడే పరిస్థితి ఉండదు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు బిజీ.. బిజీ లైఫ్. నిజ జీవితంలో చైల్డ్ లైఫ్ ఎంత స్వీట్ గా ఉంటుందో.. స్కూల్ లైఫ్.. కాలేజీ లైఫ్ కూడా అంతే మధురంగా ఉంటుంది. ప్రతి అడుగులో కొత్త కొత్త స్నేహితులతో లైఫ్ లీడ్ చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రియల్ లైఫ్ స్నేహితులను మిస్ అవుతున్నామనే ఫీల్ చాలామందిలో ఉంటుంది. కనీసం ఫోన్ చేసే సమయం కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీని కూడా ఎంతో మిస్ అవుతున్నామనే ఫీలైపోతుంటారు.

కెరీర్ గోల్స్ చేరుకునే తొందరలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పక్కన పెట్టేసి నిర్లక్ష్యంగా ఉంటుంటారు. కొన్నిసార్లు అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఫీల్ అవుతారు. మీలో కూడా ఒంటరితనం అనే ఫీల్ ఉందా? రియల్ లైఫ్ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాని అనుకుంటున్నారా? మీ స్నేహితులను కోల్పోక ముందే జాగ్రత్త పడండి.. మీకోసం అద్భుతమైన 5 యాప్స్ రెడీగా ఉన్నాయి. ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే.. రియల్ లైఫ్ ఫ్రెండ్స్ మీ చెంత ఉన్నట్టే. మీ స్నేహితులందరిని దగ్గర చేసే ఈ యాప్స్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రండీ..

1. HeyTell :
ఈ యాప్.. క్రాస్-ప్లాట్ ఫాం వాయిస్ మెసేంజర్.. వాకీ టాకీ (walkie-talkie) అని కూడా పిలుస్తారు. అప్పటికప్పుడూ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్ 7 డివైజ్ ల్లో ఈజీగా వాడుకోవచ్చు. సింగిల్ బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. ఒకేసారి అందరితో మాట్లాడుకోవచ్చు. SMSలు పంపుకోవడం కంటే వాయిస్ మెసేజ్ ఫ్రీగా ఈజీగా మాట్లాడుకోవచ్చు.

2. Garden :
ఈ యాప్.. కేవలం iOS devices, App Storeలో మాత్రమే అందుబాటులో ఉంది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో Garden యాప్ ద్వారా ఈజీగా కమ్యూనికేట్ కావొచ్చు. మీ కాంటాక్టులోని వ్యక్తికి సంబంధించి Reminders సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు మీ లైఫ్ లో ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. రెగ్యులర్ రిమైండర్ నోటిఫికేషన్ల కోసం మీ ఇంపార్టెంట్ కాంటాక్టులపై సెట్ చేసుకోవాలి.

కనీసంగా 3 నెలల వరకు టైమ్ సెట్ చేసుకోవచ్చు. ప్రతినెల, ప్రతి మూడు నెలలకు, ప్రతి రోజు.. ఇలా ఎన్నిసార్లు అయినా రిమైండర్ టైమ్ మార్చేసుకోవచ్చు. ముఖ్యమైన వ్యక్తుల వివరాలను గుర్తించుకోవాలంటే ప్రతి కాంటాక్టుపై నోట్స్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే.. సెట్ చేసిన సమయానికి ఆటోమాటిక్ గా రిమైండర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.. మీకు ఆ విషయాన్ని వెంటనే గుర్తు చేస్తుంది.

3. LokLok: 
మీకు నచ్చిన వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు LokLok యాప్ సూపర్ గా వర్క్ అవుతుంది. మీ ఫోన్ లాక్ స్ర్కీన్ పై దీన్ని సెట్ చేసుకోవచ్చు. నోట్స్ పంపుకోవచ్చు. డ్రాయింగ్స్, ఫొటోలు పంపొచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు వారి ఫోన్ లాక్ ఆన్ చేయగానే వారి స్ర్కీన్ పై మీరు పంపిన నోట్స్, ఫొటోలు అన్ని కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ Lock Screen స్థానంలో LokLok స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు. ఒక వైట్ బోర్డు కనిపిస్తుంది. ఎవరితో మీరు కాంటాక్ట్ అయ్యోరో అక్కడే చూడొచ్చు. కావాలంటే గ్రూపు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా వారి స్ర్కీన్ లాక్ ఛేంజ్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి స్ర్కీన్ పై లాక్ కూడా మారిపోతుంది.

4. Cloze: 
ఈ యాప్.. ఇదొక పర్సనల్ అసిస్టెంట్ వంటిది. మీ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మీరు చేయాలనుకునే ప్రతి విషయాన్ని గుర్తు చేస్తూ మీకో ప్రాంప్ట్ మెసేజ్ మాదిరిగా అలర్ట్ చేస్తుంటుంది. మీ యాప్స్ నుంచి ప్రతి ఒక్క కాంటాక్టు, కంపెనీకి సంబంధించి ఆటోమాటిక్‌గా ఒక్కో చోట వ్యూ క్రియేట్ అవుతుంది. కాంటాక్టు వివరాలతో పాటు మీ పూర్తి వివరాలు కూడా చూడవచ్చు. మీ ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లు, ప్రతి ఈమెయిల్, ఫోర్త్, మీటింగ్స్, నోట్స్, ఫైల్స్, సోషల్, మెసేజ్ లను చూసుకోవచ్చు. ఎలాంటి బిజీ వర్క్ లేకుండానే నీకోసం అన్ని అదే చేసేస్తుంది.

5. pplkpr: 
బయోమెట్రిక్ డేటా ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. దీనిపై టెక్స్ట్ మెసేజ్ లను కంపోజ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీ స్నేహితుడితో చాటింగ్ చేసిన మెసేజ్ లను డిలీట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోన్లో నుంచి కాంటాక్టులను కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎవరితో Hanging out అవుతున్నారో వారికి సంబంధించి సమాచారాన్ని మ్యానువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. WristBand ద్వారా హార్ట్ రేట్ మార్పులును నోట్ చేయొచ్చు.

కాంటాక్టు లిస్టులోని వారితో మీరు కమ్యూనికేట్ అయ్యే సమయంలో మీ ప్రవర్తన విధానం, ఒత్తిడి లేదా ఆందోళన స్థాయి ఎలా ఉందో కూడా రికార్డు చేసుకోవచ్చు. Patterns ఆధారంగా ఆల్గారిథమ్స్.. ఆ నిర్దిష వ్యక్తితో ఎంత సమయం గడపాలా లేదా వెంటనే అతన్ని కట్ చేయాలో కూడా నిర్ణయిస్తాయి. ప్రస్తుతం.. ఈ pplkpr యాప్ iOS డివైజ్ ల కోసం App Storeలో మాత్రమే అందుబాటులో ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *