లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సీరం ఇనిస్టిట్యూట్ అగ్నిప్రమాద ఘటనలో 5గురు మృతి

Published

on

fire at Serum Institute పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లోని మంజ్రి ఫ్లాంట్ లో జరిగిన అగ్రిప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. టెర్మినల్ 1గేటు వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో ఇవాళ(జనవరి-21,2021)మధ్యాహ్నాం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే,అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పని చేసే శాస్త్రవేత్తలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

10 ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటను ఆర్పివేసిన తర్వాత ఐదు మృతదేహాలను గుర్తించారు. పూణే మేయర్ కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. అగ్నిప్రమాదం ఘటనపై సీరం సీఈవో అదార్ పూనావాలా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటంబాలకు సంతాపం తెలిపారు. అయితే, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోన్న యూనిట్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బిల్డింగ్ లో ఈ అగ్రిప్రమాదం జరిగిన నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి ఆందోళనలు వ్యక్తమవగా సీరం సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

అగ్నిప్రమాద ఘటనతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. కాగా,ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించగా..అందులో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఒకటి.