సామాన్యులు క‌ల‌లో ఊహించలే‌ని…. ఎవ‌రిద‌గ్గ‌రా లేని ఐదు… అంబానీ సొంతం. అవేంటో తెలుసా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ..కోట్లకు పడగలెత్తిన కుబేరుడు.. ప్రపంచ కుబేరుల్లో ఆరో ధనవంతుడు.. అంతేకాదు.. భారతదేశంలో అత్యంత ధనవంతుడు కూడా.. బడా వ్యాపారవేత్త.. బిలియనీర్‌గా పేరు ప్రఖ్యాతాలు గడించిన అంబానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నివైపులా విస్తరించాడు. అంబానీ ఫ్యామిలీ అంటే ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌ను రూ .24,713 కోట్లకు కొనుగోలు చేసిందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ మొత్తం నికర విలువ 79.7 బిలియన్ డాలర్లలో స్వల్పంగా మాత్రమే తగ్గింది.

5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns

ముఖేశ్ అంబానీ బిజినెస్ వ్యవహారాల మాట అటుంచితే.. అంబానీ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్ గురించిఎంత చెప్పిన తక్కువే.. ఎంతో విలాసవంతంగా ఉంటుంది.. అంబానీ కొనుగోలు చేసిన కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించి తెలియాల్సిన ఆసక్తికరమైన ఎన్నో ఉన్నాయి.. సామాన్యుడు కూడా ఊహించలేని అందులో ఆ ఐదు ఖరీదైన అంబానీ సొంతమైన వాటి గురించి తెలుసుకుందాం..

5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns

1. అంటిలియా (Antilia) :
కొన్ని రోజుల క్రితం, ఫోర్బ్స్ మ్యాగజైన్ 20 బిలియనీర్ల గృహాల జాబితాను విడుదల చేసింది.. ఆ ఫోర్బ్స్ జాబితాలో అంటిలియా అగ్రస్థానంలో నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువైన ఈ 27 అంతస్తుల భవనం ఎవరిదో కాదు.. ముంబైలోని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నివాసముంటోంది.. ఇందులో 9 హై-స్పీడ్ ఎలివేటర్లు, గ్రాండ్ బాల్రూమ్, థియేటర్, స్పా, టెంపుల్, మల్టీ టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి.

5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns2. స్నో రూమ్ (Snow Room):
అంటిలియా భవనంలో చల్లని పిల్లగాలుల్లా వీచే స్నో రూమ్ ఆకర్షణీయంగా ఉంటుంది.. అంటిలియాలో కృత్రిమంగా మంచు కురుస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది.. చల్లగా ఉండే ఆ గదిలోకి వెళ్లగానే మంచు ప్రదేశంలో తేలియాడుతున్న భావన కలుగుతుంది..
5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns3. అంబానీ సొంత గ్యారేజీలో 168 కార్లు :
భారతదేశంలో అంబానీ స్నో రూమ్ చాలా స్పెషల్.. అంబానీ సొంత గ్యారేజ్‌లో 168 కార్లను పార్క్ చేయగల సామర్థ్యం ఉంది. అంటిలియాలో ఒక ప్రైవేట్ గ్యారేజీ ఉంది. ఇందులో 168 కార్ల వరకు పార్క్ చేయొచ్చు. దీని పైకప్పుపై మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి. ఎంతో ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ BMW కారును ఇటీవలే అంబానీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns

4. బుల్లెట్ ప్రూఫ్ BMW :
ముఖేష్ అంబానీ సుమారు రూ.8.5 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారు BMW 760Li కారును వాడుతున్నారు. BMW ఫ్యూయిల్ ట్యాంక్ ఆటోమాటిక్-సీలింగ్ కెవ్లార్‌తో తయారు చేశారు. ఫైర్ (మంటలు) కూడా అంటుకోదు.. ప్రతి విండో 65 మి.మీ మందంతో బుల్లెట్ ప్రూఫ్ 150 కిలోల బరువు ఉంటుంది.

READ  RIL రికార్డు : ప్రపంచ కుబేరుల్లో అంబానీకి 9వ ర్యాంకు

5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns5. ముంబై ఇండియన్స్ :
ముఖేష్, నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా నాలుగు సార్లు ఐపిఎల్, రెండుసార్లు CLT20 ఛాంపియన్స్, ముంబై ఇండియన్స్ (MI)లకు ప్రాంచైజీగా వ్యవహరిస్తోంది. ఈ టీమ్ 2008లో ఏర్పడింది.

5 extremely expensive and one of a kind things Mukesh Ambani owns

2017లో 100 మిలియన్ డాలర్ల విలువను అధిగమించిందని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ది వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ టీం ఓనర్స్ జాబితాలో 2019లో MI టీంతో   ముఖేశ్ టాప్ ర్యాంకులో నిలిచారు.

Related Posts