లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

గుండె ఫిట్‌గా ఉండేందుకు 5 చిట్కాలు

Published

on

మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. ప్రధానంగా… గుండె, కిడ్నీలు, లివర్ వంటివి అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి.  మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉండేవారు… ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.

అధిక బరువు ఉండేవారికి కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల గుండె విషయంలో అందరమూ జాగ్రత్త పడదాం. అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

ఫ్యాట్ ఫుడ్ తగ్గించుకోవాలి 

స్వీట్లు, కూల్ డ్రింక్స్,ఫ్రైలు, కేకులు, చాకొలెట్లు ఇవన్నీ అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ… రోజూ అలాంటివి తింటే… గుండెకు చేటే. వీటిలో కొవ్వు ఎక్కువ. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే… మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు… రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది.

ప్రోటీన్స్ ఎక్కువ ఉండొచ్చు 

చికెన్, మాంసం, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు. అయితే, ఈ ఫుడ్‌లో కూడా బీఫ్ అయితే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దాని బదులు చికెన్, మటన్ వంటివి తినడం బెటర్. చేపలు మంచివి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొవ్వు తగ్గిస్తాయి. గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే మేలు.

తృణ ధాన్యాలు తప్పనిసరి 

రైస్‌, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిదే. ఇలా మనం తినే వాటిలో బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఉండేలా చేసుకోవాలి.

ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరి 
మనం తినే ఆహారాల్లో మృతం, అమృతం అని రెండు రకాలుంటాయి. డీప్ ఫ్రై చేసే ఆహారం మృత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అదే ఆకు కూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి అమృత ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. అమృతాహారంలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువ.

ఎంత తింటున్నామో గమనించుకోవాలి

కొంతమంది భోజనం చేసినా… మళ్లీ చిరుతిళ్లవంటివి తింటారు. అలా చెయ్యకూడదు. కావాలంటే… భోజనం కొద్ది కొద్దిగా రెండుసార్లు తినడం బెటర్. ప్రతీ రెండు గంటలకు ఓసారి ఎంతో కొంత ఏదో ఒకటి తినాలి. కానీ… భోజనం వంటివి మరీ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *