పార్లమెంటులో కరోనా కలకలం, ఐదుగురు ఎంపీలకు పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో ఇప్పటివరకు ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది.

పార్లమెంట్‌ సమావేశాలపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అధ్యక్షతన కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కరోనా నియంత్రణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎంపీలు పాటించాల్సిన గైడ్‌లైన్స్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని, లోక్‌సభ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించినట్లుగా స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు. ఎంపీలందరూ విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పీకర్‌ ఓంబిర్లా సూచించారు.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. సమావేశాలకు 72 గంటల ముందు ఎంపీలంతా కరోనా టెస్టు చేసుకోవాలని వెంకయ్య తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు కరోనా నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి అన్నారు. ప్ర‌భుత్వం ఆమోదించిన ఆస్ప‌త్రులు, లాబోరేట‌రీలు, పార్ల‌మెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన టెస్ట్ సెంట‌ర్‌లో ప‌రీక్ష‌లు చేయించుకుని రిపోర్టు స‌మ‌ర్పించాలన్నారు. పార్లమెంటు అధికారులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేసుకోవాలని, డీఆర్‌డీవో ద్వారా ఎంపీలకు కరోనా ప్రత్యేక కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో పార్లమెంట్‌ బిజినెస్‌ పేపర్లు ఉండనున్నాయని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తెలిపారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి. శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌తో నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయ సభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Related Posts