లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

20 ఏళ్ల యువతిపై…10 రోజులు…లాకప్ లో పోలీసుల సామూహిక అత్యాచారం

Published

on

rape pocso act

gang-rape’ 20-year-old woman in lock-up for 10 days : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. హత్యా నేరంపై జైలులో ఉన్న 20 ఏళ్ల యువతిపై 5గురు పోలీసులు 10 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్టోబర్ 10వ తేదీన జిల్లా అదనపు న్యాయమూర్తి, మరో న్యాయమూర్తి, ఇద్దరు న్యాయవాదులతో కలిసి జైలును తనిఖీ చేస్తున్నప్పుడు బాధిత మహిళ… తనపై జరిగిన అత్యాచారాన్ని వారికి వివరించింది.

ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ లోని మంగ్వాన్ పోలీసు స్టేషన్ పరిధిలో సుధవర్మ అనే మహిళ హత్యకు గురైంది. ఆ కేసుకు సంబంధించి బాధిత మహిళ, ఆమె స్నేహితుడు నిందితులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మే 9 నుంచి 21 వ తారీఖు మధ్య అయిదుగురు పోలీసులు బాధిత మహిళపై సామూహిక అత్యాచారం జరిపారని ఆరోపించింది.కాగా…… రేవాజిల్లా ఎస్పీ రాకేష్ సింగ్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. హత్య జరిగిన 5 రోజుల తర్వాత మే 21న ఆమె తన స్నేహితుడితో సహా పట్టుబడిందని పోలీసు రికార్డుల్లో ఉందని… అటువంటప్పుడు మే 9-21 మధ్య రేప్ జరిగిందని ఎలా చెపుతారని ప్రశ్నించారు ? కాగా…. ఈవిషయాన్ని ఇంతవరకు ఎందుకు చెప్పలేదని న్యాయమూర్తుల బృందంలోని సభ్యులు సతీష్ మిశ్రా బాధిత మహిళను ప్రశ్నించగా ఈవిషయాన్ని వెంటనే జైలు వార్డెన్ కు చెప్పానంది.ఇంతలో వార్డెన్ కల్పించుకుని….. బాధిత మహిళపై రేప్ జరిగిన విషయాన్ని తనకు చెప్పిందని అంగీకరించింది. న్యాయమూర్తులు వార్డెన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు. అత్యాచారం జరిగినట్లు ఎవరికైనా చెపితే హత్య కేసులో తన తండ్రిని కూడా ఇరికించి జైలుపాలు చేస్తామని పోలీసులు బెదిరించినట్లు ఆ మహిళ పేర్కోంది. ఫిర్యాదు నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసును జిల్లా న్యాయమూర్తికి పంపారు. కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *