మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లే ఎందుకు కొనాలి.. ఈ 5 రీజన్స్ తెలిస్తే.. ఇవే కావాలంటారు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఎందుకు కొనాలి? అసలు ఫ్లాగ్ షిప్ ఫోన్లకు మిడ్ రేంజ్ ఫోన్లకు మధ్య తేడా ఏంటి? 2020లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు ఎందుకింత క్రేజ్ పెరుగుతోంది. కొన్ని ఏళ్లుగా మిడ్ రేంజ్ ఫోన్లు.. ఫ్లాగ్ షిప్ ఫోన్లకు పోటీగా మార్కెట్లో ఊపందుకున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఈ ఫోన్లకు ఫుల్ క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. సబ్ రేంజ్ రూ.25వేల స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ మిడ్ రేంజ్ ఫోన్లు కస్టమర్లను మరింత ఎట్రాక్ట్ చేశాయి.

ఇక టాప్ ఎండ్ డివైజ్‌లైన ఐఫోన్ 11 ప్రో మాక్స్, గెలాక్సీ S20 అల్ట్రా డివైజ్ లు కూడా ఐఫోన్ SE, గెలాక్సీ A51 ఫోన్లు ఆకర్షణించేలా ఉన్నాయి. అయినప్పటికీ కస్టమర్లు ఫ్లాగ్ షిప్ ఫోన్లను వదిలేసి ఈ మిడ్ రేంజ్ ఫోన్లపైనే ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారంటే.. ధర కావొచ్చు.. ఫీచర్లు కావొచ్చు.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో 5 కారణాలేంటో ఓసారి లుక్కేయండి..1. ప్రీమియం ఫీచర్లతో మిడ్ రేంజ్ ఫోన్లు :
మిడ్-రేంజ్ ఫోన్‌లలో ఇప్పటికీ అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల పర్పార్మెన్స్ ఫీచర్లతో సరిపోలడం లేదనే అభిప్రాయం ఉంది. అది తప్పు అంచనా.. OnePlus Nord, Oneplus 8pro ప్రో విషయానికి వస్తే… ఈ రెండు ఫోన్‌ల ధర వేర్వేరుగా ఉంటుంది. కానీ, ఫీచర్లు, డివైజ్ లుక్ విషయంలో మాత్రం ఒకే మాదిరిగా కనిపిస్తాయి. మిడ్ రేంజ్ ఫోన్‌లు ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల మాదిరిగా కస్టమర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇదే.

 

5 reasons why buying a mid-range smartphone makes more sense in 2020

గెలాక్సీ S20 కోసం మీరు రూ .70,499 అవసరం లేదు. మిడ్-టైర్ గెలాక్సీ M31 లో కూడా ఇదే తరహా ఫీచర్లతో యూజర్లను ఫిదా చేస్తోంది. హార్డ్‌వేర్ విషయంలో 2020 మిడ్-రేంజ్ ఫోన్‌లలో ప్రీమియం ఫోన్‌లకే పరిమితం చేశాయి తయారీ కంపెనీలు. ఇన్-డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్లతో ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ ప్లేలు చాలా మిడ్ రేంజ్ ఫోన్లలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

2. ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో లేని అడ్వాన్స్ ఫీచర్లు :
2020లో ఫ్లాగ్‌షిప్‌ల కంటే మిడ్-రేంజ్ ఫోన్‌లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. Oneplus Nord వంటి మిడ్-రేంజ్ ఫోన్ 5Gకి సపోర్ట్ ఇస్తుంది. కానీ, శామ్‌సంగ్ గెలాక్సీ S20 Ultra మాత్రం దీనికి సపోర్ట్ చేయదు. గెలాక్సీ M31 వంటి మిడ్ రేంజ్ ఫోన్లు 000mAh భారీ బ్యాటరీతో వస్తాయి. పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు మాత్రం అంత క్రేజ్ ఉండదనే చెప్పాలి. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ల కంటే మిడ్-రేంజ్ ఫోన్‌లను ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉంటుంది. వైర్డ్ హెడ్‌ఫోన్‌లను ఉపయోగించే చాలా మంది యూజర్లకు 3.5-mm హెడ్‌ఫోన్ Jack పర్ ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు.


3. పర్ఫార్మెన్స్‌లో మిడ్-రేంజ్ ఫోన్లే భేష్ :
మిడ్-రేంజ్ ఫోన్లపై ఇప్పటికీ టాప్- టైర్ పర్ఫార్మెన్స్ తగినట్టుగా ఉండదని భావిస్తుంటారు. ఇప్పుడు, Qualcomm, MediaTek నుండి మిడ్-లెవల్ చిప్‌సెట్‌లు హై పర్ఫార్మెన్స్ గల coresతో వస్తున్నాయి. గేమింగ్ కోసం మెరుగైన గ్రాఫిక్స్ కెపబులిటీ కలిగి ఉంటాయి. గేమింగ్-ఫోకస్డ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్ విషయానికి వస్తే.. Oneplus Nord ఫోన్‌కు సరిగ్గా సరిపోతుంది.

READ  Simple Tips: మీ ఫోన్‌లో సూర్యగ్రహణాన్ని ఫొటో తీయండి!

మిడ్-లెవల్ చిప్‌సెట్ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్‌కు 20 శాతం ఆదానిస్తుంది. హైయర్ GPU క్లాక్ లను సైతం హ్యాండిల్ చేయగలదు. స్నాప్‌డ్రాగన్ 765Gకి చాలా డిమాండ్ ఉన్న గేమ్స్ ఆడేందుకు తగినంత హార్స్‌పవర్ ఉంది. PUBG మొబైల్ లేదా Call of Duty: Mobile వంటి వీడియో గేమ్స్ లకు సపోర్ట్ చేస్తాయి.

కానీ, స్నాప్‌డ్రాగన్ 765G అనేది చిప్‌సెట్.. స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ సామర్థ్యాలను పెంచడానికి రూపొందించారు. Qualcomm మిడ్-ఎండ్ ఫోన్‌లకు పవర్‌నిచ్చే ‘System-On-Chip’చిప్‌సెట్‌లను చేస్తుంది. అంటే మీరు డివైజ్‌కు శక్తినిచ్చే చిప్‌సెట్‌ను స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవచ్చు. గేమ్స్ ఆడటానికి యాప్స్ యాక్సస్ లిమిట్ ఉంటుంది. తక్కువ ధర గల స్మార్ట్‌ఫోన్ మీకు కావాలంటే, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ధర కేవలం రూ.16,999 ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం హై సెట్టింగ్‌లలో గేమ్స్ ఆడటానికి అనుమతిస్తుంది.


4. Design‌లోనూ ఈ ఫోన్లేమి తక్కువేం కాదు..
Redmi K20 ఇప్రెషివ్ బిల్డ్ తో వచ్చింది. అలాగే OnePlus Nord ఫోన్ కూడా ఇదే డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్లు రూ .25 వేలలోపు ప్రీమియం డిజైన్ ఉన్న మిడ్ రేంజ్ ఫోన్లు మాత్రమే కాదు. నోకియా 7.1 కూడా అద్భుతమైన గ్లాసుతో పాటు ఫ్రెంట్ సైడ్ ఫ్లాగ్ షిప్ డిజైన్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 5.84-అంగుళాల స్క్రీన్ తో ఈ డివైజ్ రోజంతా చేతిలో పట్టుకున్నా సరిపోతుంది. రియల్‌మే XTవంటి ఫోన్ కూడా ధర రూ. 16,999తో చూడటానికి డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

5. మిడ్ రేంజ్ ఫోన్లలో హై క్వాలిటీ కెమెరాలు :
కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. గత కొన్ని ఏళ్లుగా మిడ్-రేంజ్ ఫోన్‌లు, ఫ్లాగ్‌షిప్‌లదే హవా నడుస్తోంది. రానురాను ఇవి మారిపోతున్నాయి. Oneplus Nord ఫోన్ చూస్తే.. ఇందులో ప్రైమరీ, అల్ట్రా-వైడ్ కెమెరాలు మంచి షాట్‌లను తీయగలవు. క్వాడ్-కెమెరా సిస్టమ్ రకరకాల లైటింగ్
పరిస్థితులలో బాగా ఫొటోలు తీస్తుంది.ఐఫోన్ 11 అంత బాగోదు.. వన్‌ప్లస్ Nord, ఐఫోన్ 11 ధరలో సగం ధరకే లభ్యం అవుతోంది. ఒక ఫోన్‌కు రూ. 24,999, పెడితే చాలు.. వన్‌ప్లస్ నార్డ్ కెమెరా ఊహించిన దానికంటే అద్భుతంగా ఫొటోలు తీస్తుంది. Poco X2 వంటి ఇతర మిడ్ రేంజ్ ఫోన్లు తక్కువ ధర అయినప్పటికీ బెటర్ షాట్స్, హై క్వాలిటీ వీడియోలను పొందవచ్చు.

Related Posts