Type 2 diabetes diet, fruits, vegetables, blood sugar, insulin

మధుమేహం.. ఇక మీ కంట్రోల్లో..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వింటర్ వచ్చిందంటే చాలు.. ఎక్కడా లేని ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చలికాలంలో ఏదో రకంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ చలికాలం కష్టకాలమనే చెప్పాలి.

  • బ్లడ్ షుగర్, ఇన్సూలిన్ అదుపులో ఉంచే అద్భుత గుణాలు.. 

  • టైప్-2 డయాబెటిస్ చెక్ పెట్టాలంటే మీ మెనూలో ఇవి ఉండాల్సిందే

వింటర్ వచ్చిందంటే చాలు.. ఎక్కడా లేని ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చలికాలంలో ఏదో రకంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ చలికాలం కష్టకాలమనే చెప్పాలి. డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్, ఆస్థమా, గుండె సంబంధిత రోగాలతో బాధపడేవారికి చలికాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు. డయాబెటిస్ రోగులకు ఈ కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ వేగంగా పెరిగిపోతాయి. అందుకే వ్యాయామం కాస్తా తగ్గించాలి. పోషక విలువలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిట్ నెస్ ప్లాన్ కు అలవాటు కావడం కొంత కష్టంగా మారే పరిస్థితి లేకపోలేదు. అయినా తప్పదు మరి.  

చల్లని వాతావరణంలో తిరిగే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొంత మార్పులు చేయాల్సి ఉంటుంది. వింటర్ సీజన్ లో కూడా తాజా, రుచికరమైన పండ్లు, కూరగాయలు ఎన్నో దొరుకుతుంటాయి. ఈ పండ్లు, కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో తీసుకొన్నట్టుయితే డయాబెటిస్ ను కంట్రోల్ చేసేందుకు ఉపకరిస్తాయట. ఆర్యోగం కూడా స్థాయిలో మెరుగుపడుతుందట. పండ్లు, కూరగాయల్లో పోషకవిలువలు, విటమిన్స్, మినరల్స్, పైబర్ పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయనడంలో సందేహం లేదు. దీర్ఘకాలంగా వేధించే డయాబెటిస్ కూడా చెక్ పెట్టవచ్చు. వింటర్ లో దొరికే పండ్లు, కూరగాయాల్లో ఐదు రకాలను ఆహారంలో వాడితే ఎన్నో అద్భుత ఫలితాలు పొందవచ్చు. అందులో బ్రసెల్స్ స్ర్పౌట్స్ (క్యాబేజీ), వింటర్ స్వ్కాష్, స్వీట్ పోటాటో, ఆరెంజ్ (నారింజ పండు), గువా (జామ పండు) అద్భుతంగా పనిచేస్తాయి. 

1. క్యాబేజీ (బ్రసెల్స్) 
డయాబెటిస్ డైట్ లో వాడే కూరగాయల్లో అద్భుతంగా పనిచేసేది క్యాబేజీ ఒకటి. ఎక్కువగా చలికాలంలోనే దొరికే ఈ క్యాబేజీ కూరగాయ.. ఆహారంగా తీసుకోవడం వల్ల ఇందులోని అధిక ఫైబర్ శరీరంలోని షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది.  

2. వింటర్ స్క్వాష్ 
వంటకాల్లో వాడే గుమ్మడికాయల్లో ఇదో రకమైన కూరగాయ. దీన్ని వింటర్ బట్టర్ నట్ స్క్వాష్ అని కూడా పిలుస్తుంటారు. చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఈ కూరగాయలో అధిక మొత్తంలో ఫైబర్, పోటాషియం, ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటును అడ్డుకోవడంలో దీనికి సాటి లేదనే చెప్పాలి. లో బ్లడ్ షుగర్, ఇన్సూలిన్ స్థాయిని కూడా కంట్రోల్ చేస్తే శక్తి ఇందులో ఉంది. 

READ  దిగివచ్చిన కూరగాయల ధరలు

3. స్వీట్ పొటాటో..   
బంగాళదుంప మాదిరిగా ఉండే ఈ కాయగూరను స్వీట్ పొటాటో అంటారు. దీన్ని నేరుగా తినొచ్చు. లేదా కూరలా వండుకొని కూడా తినొచ్చు. యాంటి డయాబెటిక్ ఫుడ్ గా దీనికి పేరుంది. ఇందులోని న్యూట్రిషన్లు, ఫైబర్ సహా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా దిట్ట. జనటెక్ సంబంధిత కారణాలతో వచ్చే టైప్ -2 డయాబెటెక్ ను కూడా ఇది నియంత్రిస్తుంది. 

4. ఆరెంజ్ 
నారింజ పండు అంటే పరిచయం అక్కర్లేని పండు. సిట్రస్ జాతి ఫలాల్లో నిమ్మకాయ, ఆరెంజ్ సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు ఈ పండు ఎంతగానో ఉపకరిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే గుణం కలిగిన ఈ పండు రోజువారీ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

5. జామ పండు 
జీర్ణసంబంధిత వ్యాధులకు జామ పండు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో అధికంగా తీసుకుంటే మంచిది. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ జామ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెరుగుపర్చేందుకు తోడ్పడుతుంది. 

Related Posts