తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో 50 వేల రెమ్డెసివర్ సిధ్ధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్‌ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్‌ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజెక్షన్లు ఇచ్చేందుకు కూడా సిధ్దంగా ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో కరోనా రోగులకు స్ధానికంగానే చికిత్సఅందించేందుకు 50 వేల కోవిఫర్ ఇంజెక్షన్లను టీఎస్‌ఎంఐడీసీ- తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ శనివారం నాడే పంపిణీ చేసింది. దీంతో అవసరమైన అవసరమైనవారికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు మార్గం సుగమమైంది.

కోరోనాకు వ్యాక్సిన్ రాకపోవటం, ప్రత్యేకంగా అందుకు సంబంధించిన మందులు అందుబాటులో లేక పోవటంతో యాంటీ వైరల్ మందులనే పేషెంట్లకు ఇస్తున్నారు. వీటిలో రెమెడిసివర్ ముఖ్యమైనది. ఈ మందు ఇవ్వటంతో రోగులు కోలులుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు.

బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ విషయమై చర్చించారు. జిల్లా స్ధాయిలోనే ప్రజలకు చికిత్స అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించటంతో అధికారులు రెమెడిసివర్ అవసరాన్ని సీఎం కు వివరించారు.

ఈ మందుకు డిమాండ్ ఏర్పడి వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఆర్డర్లు పెరగడంతో కొరత ఏర్పడుతోందని తెలిపారు. వెంటనే సీఎం కేసీఆర్ హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథిరెడ్డితో మాట్లాడారు. సీఎం కోరిక మేరకు రాష్ట్ర అవసరాల కోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు , మూడు రోజుల్లో మొదటి విడతగా 50 వేల రెమెడిసివర్ డోసులు పంపిణీ చేశారు.

రాష్ట్రంలో 5 లక్షల ఫావిఫిరావిర్‌, లక్ష ఐసొలేషన్‌ కిట్లు సిధ్ధం
రాష్ట్రంలోని  అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు ఆస్పత్రులకంటే మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలువైన, ముఖ్యమైన మందులను కొనుగోలుచేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమైన మందులను జిల్లాలకు పంపిణీ చేసిన టీఎస్‌ఎంఐడీసీ శనివారం నాటికి 5 లక్షల ఫావిఫిరావిర్‌ ట్యాబ్లెట్ల సరఫరాను పూర్తిచేసింది. మరో లక్ష హోం ఐసొలేషన్‌ కిట్లను జిల్లాలకు పంపిణీ చేసింది.

                      వివిధ జిల్లాలకు పంపిణీ చేసిన రెమెడిసివర్ వివరాలుcovifor distribution

 

Related Posts