లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఢిల్లీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 52మందికి అస్వస్థత…ఒకరికి సీరియస్

Published

on

52 adverse events దేశవ్యాప్తంగా శనివారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే కొంతమందిలో స్వల్ప రియాక్షన్స్ కనిపించాయి. అయితే శనివారం ఢిల్లీలో 4వేల మందికిపైగా హెల్త్ కేర్ వర్కర్లకి వ్యాక్సిన్ ఇవ్వగా… 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. వీరిలో చరాక్ ఆస్పత్రి,నార్తర్న్ రైల్వే సెంట్రల్ ఆస్పత్రి,సౌత్ ఢిల్లీ,తూర్పు ఢిల్లీల్లో టీకా తీసుకున్నవారు ఉన్నారు.

అయితే,తొలి రోజు వ్యాక్సిన్ తీసుకున్న ఓ 22ఏళ్ల హాస్పిటల్ సెక్యూరిటీ గార్డుకి సీరియస్ గా ఉందని..వెంటనే పేషెంట్ ని ఎయిమ్స్ కి తరలించినట్లు సత్యేందర్ జైన్ తెలిపారు. రాత్రివరకూ అతనని ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒక్కరే ఆ తర్వాత హాస్పిటల్ లో చేరారని..మిగిలిన 51మంది హాస్పిటల్ పాలవ్వలేదని జైన్ తెలిపారు.

కాగా, తొలిరోజు ఢిల్లీలో 8,117మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా..ఇందులో సగం మందికే వ్యాక్సిన్ అందించగలిగారు. సిటీవ్యాప్తంగా 81 ప్లేస్ లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ వంటి కొన్ని హాస్పిటల్స్ కి సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన “కోవిషీల్డ్”వ్యాక్సిన్ ఇవ్వగా..ఆరు సెంట్రల్ హాస్పిటల్స్ కి భారత్ బయోటెక్ డెవలప్ చేసిన “కోవాగ్జిన్”ను అందించారు.