67 positive cases of coronavirus registered in Telangana

తెలంగాణలో 67కి పెరిగిన కరోనా కేసులు…ఇవాళ ఒక్కరోజే 8 మందికి పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 67కు చేరింది.

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య ఏమీ లేవు అనుకున్న తరుణంలో ఇంతకముందే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆరు పాజిటివ్ కేసులున్నట్టుగా ప్రకటించారు. కొద్ది సేపటి క్రితమే మరో రెండు పాజిటివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి పేరు మీద ప్రకటించారు. అయితే ఇవాళ రాష్ట్రంలో మొత్తం 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

సెకండ్ స్టేజ్..
దీంతో తెలంగాణ ఇప్పటివరకు మొత్తం 67 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కుత్బుల్లాపూర్ కు సంబంధించి నాలుగు కేసులు, ఓల్డ్ సిటీకి సంబంధించి నిన్న ఆరు కేసులు, నాంపల్లికి సంబంధించి ఇవాళ నాలుగు పాజిటివ్ కేసులు నమోదైన్లట్లు ప్రకటించారు. అయితే ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న క్రమాన్ని చూస్తే ఢిల్లీ నుంచి వచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉన్న రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు కాంటాక్టు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఉంది. కాంటాక్టు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 

కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ కు వివరాలు సేకరణ
కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. గత ఐదారు రోజులుగా అతను ఎవరెవరితో కాంటాక్టు అయి ఉన్నారు…ఎవరెవరితో మాట్లాడి ఉన్నారు…ఎక్కడెక్కడ వెళ్లాడు అనే వివరాలను సేకరించే పనిలో ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. ఇప్పటికే వచ్చిన అన్ని కేసులకే సంబంధించి డేటా ప్రభుత్వం సేకరిస్తోంది. నిన్న 14, ఇవాళ 8 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరిస్తోంది. 

తెలంగాణలో మొట్టమొదటి కరోనా మృతి 
తెలంగాణలో మొట్టమొదటి కరోనా మృతి సంభవించినట్లుగా చెప్పుకోవాలి. అయితే మృతి చెందిన వ్యక్తి నియోనియాతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మరణించిన తర్వాత అతని నుంచి శాంపిల్స్ సేకరించారు. మృతునికి కరోనా పాజిటివ్ గా తేలడంతో తెలంగాణలో మొట్టమొదటి మరణంగా ఆరోగ్యశాఖ ధృవీకరించింది. అంతకంతకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఎప్పటికప్పుడూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. 
 

Related Posts