లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘మున్నా’ మళ్లీ ట్రెండ్ అవుతోంది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మున్నా’ 13 ఏళ్లు పూర్తిచేసుకుంటోంది..

Published

on

13 Years for Young Rebel Star Prabhas's Super Stylish Mass Entertainer Munna

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మున్నా’ 13 ఏళ్లు పూర్తిచేసుకుంటోంది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా, వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన స్టైలిష్ ఎంటర్‌టైనర్.. ‘మున్నా’.. 2007 మే 2న విడుదలైన ఈ సినిమా 2020 మే 2 నాటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ‘#13yearsformunna’ హ్యాష్‌ ట్యాగ్‌‌తో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. హారిష్ జైరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

MUNNA

See Also | మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా బచ్చా.. చెర్రీపై చిరు సెటైర్..

హాట్ బ్యూటీ శ్రియా స్పెషల్ సాంగ్ చేసింది. శ్యామ్ కె.నాయుడు కొంత భాగం షూట్ చేసిన తర్వాత సినిమా నుండి తప్పుకోగా.. సి.రామ్ ప్రసాద్ కంటిన్యూ అయ్యారు. బి.వి.ఎస్.రవి, కొరటాల శివ డైలాగ్స్ రాశారు. సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ వంశీ పైడిపల్లి స్టైలిష్ మేకింగ్‌కు మంచి పేరొచ్చింది. అనుకున్న దానికి మించి బడ్జెట్ పెట్టడంతో సినిమాకు రూ.50 లక్షల నష్టం వాటిల్లింది. నిర్మాతగా దిల్ రాజు లాస్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ‘మున్నా’ 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా తాలుకు పాటలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

MUNNA

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *