లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

గుడి ప్రాంగణంలో… మైనర్ బాలికపై పూజారి అత్యాచారం

Published

on

68 year old priest arrested for allegedly raping :  గుళ్లో తాత్కాలికంగా విధలులు నిర్వహించటానికి వచ్చిన పూజారి అక్కడ ఆడుకుంటున్న బాలికపై కన్నేశాడు. స్వీట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ కి చెందిన వెంకటరమణప్ప(68) అనే వ్యక్తి పూజారిగా పని చేస్తుండేవాడు.

ఇతని అల్లుడు బెంగుళూరులో పూజారిగా పని చేస్తున్నాడు. అల్లుడికి వేరే పని ఉండి ఊరు వెళ్ళాల్సి వచ్చి, కొద్దిరోజులు మామను వచ్చి తన గుళ్లో పూజారిగా బాధ్యతలు నిర్వహించమని కోరాడు. అందుకు అంగీకరించిన వెంకట రమణప్ప బెంగుళూరు వచ్చి గుళ్లోపూజాదికాలు నిర్వహించటం మొదలెట్టాడు.ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుడి బయట ఆడుకుంటున్నపదేళ్ల బాలికపై పూజారి కన్ను పడింది. మనసులో దుష్ట ఆలోచనలు చెలరేగిపోయాయి. బాలికను పిలిచి తనతో వస్తే స్వీట్లు ఇస్తానంటూ ఆశ పెట్టాడు. స్వీట్లకు ఆశపడిన బాలిక పూజారి వెంట వెళ్లింది.ఆలయ ప్రాంగణంలోని తన కుమార్తె ఇంటికి తీసుకువెళ్లి బాలికపై పూజారి అత్యాచారం చేశాడు. ఆడుకోటానికి వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో బాలిక తల్లితండ్రులు బాలికను వెతకటం ప్రారంభించారు.

బాలిక గురించి వాకబు చేయగా ఆలయ పూజారితో వెళ్లినట్లు గుడి బయట పూలు అమ్ముకునే వ్యక్తి చెప్పాడు. బాలిక తల్లి,తండ్రులు ఆలయ ప్రాంగణంలోని పూజారి ఇంటికి వెళ్లి చూడగా భయంతో గుక్కపెట్టి ఏడుస్తున్నబాలిక వారికి కనిపించింది.తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని వివరించి చెప్పింది. వెంటనే వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయం బయట ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారాలతో, పూల కొట్టు వ్యాపారి స్టేట్ మెంట్ ఆధారంగా నిందితుడు వెంకటరమణప్ప పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *