లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పదేళ్ల బాలిక‌పై 68ఏళ్ల పూజారి రేప్

Published

on

girl-raped

Priest Arrest: కూతురి ఇంటికి తీసుకెళ్లి 10ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మత గురువు. గుడికి సమీపంలో ఉన్న ఇంట్లో ఈ ఘటనకు పాల్పడినట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. చిక్కబల్లాపూర గ్రామానికి చెందిన వెంకటరమణప్ప మేనల్లుడు లేని సమయంలో గుడి బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాడు.

మంగళవారం సాయంత్రం వెంకటరమణప్ప బాలిక గుడి బయట ఆడుతుండగా చూశాడు. స్వీట్లు ఇస్తానని ఎరగా వేసి అతని కూతురి ఇంటికి తీసుకొచ్చి రేప్ చేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీకే బాబా చెప్పారు.బాలిక అదే రోజు సాయంత్రం వరకూ ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో ఆమె తల్లి చుట్టుపక్కల ఇళ్లలో ఎంక్వైరీ చేసింది. ‘గుడి పరిసర ప్రాంతాల్లో అడిగినప్పుడు.. అక్కడ పూలమ్మే వ్యక్తి బాలిక మత గురువు ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు’ అని సీకే బాబా అన్నారు.

బాధితురాలి తల్లి ఇంటి పక్క వారిని తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లగా బాలిక ఏడుస్తూ బయటకూర్చొని ఉంది. ఘటన గురించి తల్లికి వివరించగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

‘గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజి ఆధారంగా, మెడికల్ రిపోర్టు, పూలమ్మే వ్యక్తి స్టేట్‌మెంట్ లు తీసుకుని వెంకటరమణప్పను బుధవారం అరెస్టు చేశాం. పలు సెక్షన్ల ప్రకారం.. కేసులు నమోదు చేశాం’ అని సీకే బాబా చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *