లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు

నూతన సంవత్సరం సందర్భంగా  సెవన్ మూవీ టీజర్ రిలీజ్

Published

on

7 Movie Official Telugu Teaser -10TV

నూతన సంవత్సరం సందర్భంగా  సెవన్ మూవీ టీజర్ రిలీజ్

హవీష్, రెహమాన్, నందితా శ్వేత, రెజీనా, అతిథి ఆర్య, అనీషా అంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి మెయిన్ లీడ్స్‌గా, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా, సెవన్.. రమేష్ వర్మ స్టోరీ, స్ర్కీన్‌ప్లే, నిర్మాత కాగా,  నిజార్ షఫీ ఫోటోగ్రఫీతోపాటు, డైరెక్ట్ చేస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా, ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు మూవీ యూనిట్. టీజర్ అంతా కూడా వాయిస్ ఓవర్‌తో సాగుతుంది. ఒక్కడున్నాడు, ఉన్నాడో లేదో తెలీదు, ఉన్నాడనే అంటున్నారు.  

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇంకా ఎంతమంది? అందర్నీ ముడివేసిన ప్రశ్న వాడు, సమాధానమూ వాడే, ఎవడు వాడు, ఎక్కడుటాడు, ఏం చేస్తుంటాడు? యు వేర్ ఆన్ ఐ విల్ గెట్ హిమ్ అని వాయిస్ ఓవర్ వస్తుండగా, పోలీస్ ఆఫీసర్ అయిన రెహమాన్ గన్ ఫైర్ చేస్తున్నాడు. టీజర్‌లో హవీష్, అమ్మాయిలతో రొమాన్స్ చెయ్యడం, క్రైమ్స్ చేసి తప్పించుకుని తిరగడం, రెహమాన్ అతన్ని పట్టుకోవడానికి ట్రై చెయ్యడం చూపించారు. ఇక టీజర్ చివర్లో రెజీనా, కొంటెగా కన్నుగీటుతూ కవ్వించింది. ఈ మూవీకి సంగీతం : చైతన్ భరద్వాజ్, డైలాగ్స్ : మహర్షి, లిరిక్స్ : శ్రీమణి, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ : గాంధీ

వాచ్ సెవన్ మూవీ టీజర్…
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *