లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

సైనస్ సమస్య ఇబ్బంది పెడుతుందా.. ఇంట్లోనే ఈ టెక్నిక్స్ ఫాలో అవండి

Published

on

సైనస్సెస్ అంటే మరేదో కాదు.. ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కులో ఆగిపోయే గాలినే సైనస్. అలర్జీలు, జలుబు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కారణంగా ముక్కులో ఆగిపోతుంది. వీటి కారణంగా తుమ్ములు, తలనొప్పి, శ్వాస సమస్యలు వంటివి వస్తుంటాయి.

సీరియస్ కేసుల్లో సైనస్ ఇన్ఫెక్షన్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే సైనస్ సమస్యల్లో నాలుగు రకాల కామన్ లక్షణాలు ఉన్నాయి.నాలుగు వారాల కంటే తక్కువ, నాలుగు వారాల నుంచి 8వారాలు, 8వారాల కంటే ఎక్కువ, సంవత్సరమంతా ఉండే సైనస్ కారణంగా పలు ప్రమాదాలు రావొచ్చు. మంచి విషయం ఏంటంటే.. దీనికి ఇంట్లోనే రెమెడీ దొరుకుతుంది.

ఫ్రైడ్, పిండిపదార్థాలు, అన్నం, మాంసం వంటి స్ట్రాంగ్ ఫుడ్స్ సైనస్ సమస్యను బాగా పెంచుతాయి. దీని నుంచి బయటపడటానికి మంచి ఫుడ్ ఏంటంటే విటమిన్ ఏ ఉండేవి. సైనస్ ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి బాగా ఉపయోగపడతాయి.

డా. అషుతోష్ గౌతమ్ క్లినికల్ ఆపరేషన్స్ అండ్ కోఆర్డినేషన్ మేనేజర్, బైద్యనాథ్ ఆహారం విషయంలో కొన్ని తప్పనిసరి జాగ్రత్తలను సూచిస్తున్నారు. యోగర్ట్, ఐస్ క్రీమ్ వంటి వాటిని వదిలేయాలి. చాక్లెట్, షుగర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ కు నో.. ముక్కు కారేలా చేసే ఏ లిక్విడ్ కైనా నో చెప్పాల్సిందే.

ఇక ఈ సమస్య నుంచి బయటపడే టెక్నిక్స్:
హైడ్రేట్‌గా ఉండండి.. :

నీళ్లు తాగడం, టీ లేదా జ్యూస్‌లు పంచదార లేకుండా తీసుకోవడం వల్ల హైడ్రేట్‌గా ఉండొచ్చు. ఈ ద్రావణాలు ముక్కులో అడ్డుపడే ఇన్ఫెక్షన్ తగ్గేలా చేసి సైనస్ ఇరిటేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. దాంతో పాటు ఆల్కహాల్, కెఫ్ఫైన్, స్మోకింగ్ కూడా వదిలేయాలి. లేదంటే డీ హైడ్రేట్ కొనితెచ్చుకున్నట్లే.

ఘాటెక్కించే మసాలా:
యాంటీ బ్యాక్టీరియా సమస్యలు తగ్గించే పదార్థాల్లో మిరియాలు ఒకటి. ముక్కును పొడిగా ఉంచడానికి యాపిల్ సైడర్ వెనిగర్, లెమన్ జ్యూస్ కూడా హెల్ప్ అవుతుంది. పావు టీ స్పూన్ హార్స్ ర్యాడిష్ వేర్లు నోట్లో పెట్టుకోవడం వల్ల త్వరిత ఉపశమనం దొరుకుతుంది. ఇది మింగేయొచ్చు కూడా.

ఆవిరి పట్టడం:
డాక్టర్లు కూడా చెప్పే అద్భుతమైన చిట్కా ఆవిరి పట్టడం. మూడు చుక్కల రోజ్‌మ్యారీ ఆయిల్ లేదా మూడు చుక్కల పెప్పర్ మింట్, 2చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసిన నీళ్లు మరిగించి ఆవిరిపట్టాలి. ఆవిరి బయటకు పోనీయకుండా ముక్కులు ఫ్రీ అయ్యేంత వరకూ ఇలా చేస్తుండాలి.

పసుపు లేదా అల్లం వేర్లు:
పసుపు వేర్లు అనేవి అద్భుతమైన మందు. ఇండియాలో ఎక్కువగా వాడే పదార్థం కూడా. ఇందులో రంగు మాత్రమే కాకుండా చాలా ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి. వేడి టీలో అల్లం వేసుకుని తాగినా మంచిదే. దీని ద్వారా సైనస్ నుంచి ఫ్రీ అయి బెటర్ గా అనిపిస్తుంది. కొందరైతే అల్లం రసంలో టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని రోజుకు 2నుంచి 3సార్లు తాగితే మంచిదని చెప్తుంటారు.

యాపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజుకు రెండు మూడు సార్లు తీసుకునే టీలో కలుపుకుని తాగొచ్చు. నిమ్మ రసం, తేనెతో కలుపుకుని తాగితే మంచి టేస్ట్ వస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ చాలా సహజమైన పదార్థమే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *